Ads
జయాపజయాలు మనచేతిలో ఉండవు. ఈ విషయం సినిమా హీరోలకు బాగా వర్తిస్తుంది. జయాపజయాలకు అతీతం గా వారు ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని కొన్ని సార్లు మనం అదృష్టాన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది. అలాంటి దే నాగార్జున కు కూడా ఎదురైంది. మన్మధుడు నాగార్జున లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆయన ఎంచుకున్న సినిమాలలో చాలా సినిమాలు హిట్ అయ్యాయి. అయితే కొన్ని మాత్రం ఆయన వదిలేసుకున్నారు. ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 బద్రి:
పూరి జగన్నాధ్, పవన్ కళ్యాణ్ కాంబో లో వచ్చిన “బద్రి” సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాను పూరి నాగార్జున కోసం రాసుకున్నారట. నాగార్జున అప్పట్లోనే ప్రయోగాలు చేయడం లో ముందుండేవాడట. ఈ సినిమా కు నాగ్ అయితే సరిపోతాడని పూరి అనుకున్నాడు. కానీ అప్పటికే వరుస సినిమాలతో , బిజీ గా ఉన్న నాగార్జున డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేక ఈ సినిమాను వదులుకున్నాడు. ఈ సినిమా అప్పట్లో ఉన్న మూస ధోరణి కి వ్యతిరేకం గా చాలా భిన్నం గా ఉంటుంది. హీరో పాత్రను కూడా పూరి చాలా డిఫరెంట్ గా రాసుకున్నాడు.
#2 ఘర్షణ:
వరుస సినిమా లతో నాగార్జున కెరీర్ పీక్స్ లో ఉంది. ఆ సమయం లో ఘర్షణ సినిమా లో ఆఫర్ వచ్చినా నాగ్ తిరస్కరించాడు. కార్తీక్, ప్రభు కాంబో లో 1988 వ సంవత్సరం లో ఈ సినిమా వచ్చి సౌత్ ఇండియా ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ సినిమా లో కూడా తొలుత నాగ్ నే అనుకున్నారు. అప్పట్లో నాగ్, వెంకీ కి బాగా క్రేజ్ ఉండేది. వీరిద్దరిని పెట్టి మణిరత్నం ఈ సినిమా తీయాలనుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన కుదరలేదు. ఒకవేళ అలా తీసి ఉంటె ఈ సినిమా రేంజ్ మరోలా ఉండేది ఏమో.
#3 కలిసుందాం రా..!
కలిసుందాం రా సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఓ మైలు రాయి. వాస్తవానికి ఈ సినిమా కి కూడా తొలుత నాగ్ ను సంప్రదించారట. కానీ, నాగ్ ఈ సినిమా ను వదులుకోవడం తో ఆ అవకాశం వెంకటేష్ కు వెళ్ళింది. అప్పటికే వరుస ఫామిలీ సినిమాలు చేస్తూ వచ్చిన నాగ్, మళ్ళీ అదే మోడ్ లో చేయడం ఎందుకులే అని ఈ సినిమాను వదులుకున్నాడు.
#4 మౌనరాగం:
ఆరోజుల్లో తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ అయిన మౌన రాగం సినిమా కూడా నాగార్జున చేయాల్సి ఉంది. కానీ, డేట్స్ కుదరక ఈ సినిమాను కూడా నాగ్ వదులుకున్నారు.
#5 మెకానిక్ అల్లుడు:
1993 లో చిరంజీవి, అక్కినేని నాగేశ్వరావు కాంబో లో మెకానిక్ అల్లుడు సినిమా విడుదల అయింది. ఈ సినిమాను కూడా నాగార్జున మరియు అక్కినేని నాగేశ్వర రావు కాంబో లో తీయాలనుకున్నారు. కాగా, అప్పటికే వీరిద్దరి కాంబో లో చాలా సినిమాలు వచ్చాయి. ఈ క్రమం లో ఈ సినిమా లో చిరంజీవి చేయాల్సిందిగా నాగార్జున చిరుని రిక్వెస్ట్ చేశారు. దానితో, ఈ సినిమాలో చిరు నటించారు. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల అయినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
End of Article