RAZAKAR REVIEW : “బాబీ సింహా, అనసూయ” నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

RAZAKAR REVIEW : “బాబీ సింహా, అనసూయ” నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Harika

Ads

గత కొంత కాలం నుండి పిరియాడిక్ సినిమాల హవా నడుస్తోంది. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలని సినిమాల రూపంలో చూపిస్తున్నారు. ఇప్పుడు అదే క్రమంలో రజాకార్ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : రజాకార్
  • నటీనటులు : బాబీ సింహా, అనసూయ భరద్వాజ్, వేదిక, రాజ్ అర్జున్.
  • నిర్మాత : గూడూరు నారాయణ్ రెడ్డి
  • దర్శకత్వం : యాట సత్యనారాయణ
  • సంగీతం : భీమ్స్ సిసిరోలియో
  • విడుదల తేదీ : మార్చి 15, 2024

razakar movie review

స్టోరీ :

1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. కానీ 1948 వరకు కూడా హైదరాబాద్ కి స్వాతంత్రం రాలేదు. హైదరాబాద్ ని భారత్ లో కలపడానికి నిజాం ఏడవ రాజు అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (మకరంద్ దేశ్ పాండే) సుముఖత చూపించడు. అప్పటి నైజాం, అంటే ఇప్పటి హైదరాబాద్ ని తుర్గిస్తాన్ అనే పేరుతో మార్చి ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించాలి అని అనుకుంటాడు. నైజాంలో ఉండే వారందరినీ కూడా ఒకే మతానికి చెందిన వారి లాగా మార్చాలి అని అనుకుంటాడు.

razakar movie review

దాంతో ఖాసీం రజ్వీ (రాజ్ అర్జున్) నేతృత్వంలో రజాకార్ల వ్యవస్థని ఉపయోగిస్తాడు. మరొక పక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ (తేజ్ సప్రూ) భారతదేశంలో నైజాంని కలుపుదామని అనుకుంటాడు. నైజాంలో జరుగుతున్న వాటిని ఎలా ఆపారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశాడు? రజాకార్లు ఎలాంటి నిబంధనలు విధించారు? ప్రజలు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

razakar movie review

రివ్యూ :

సినిమా చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందిన సినిమా. అప్పట్లో జరిగిన సంఘటనలని చూపించారు. ఇందులో తెలిసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. తెలుగు వాళ్ళతో పాటు, మిగిలిన భాషల నటీనటులు కూడా ఉన్నారు. అందులోనూ ముఖ్యంగా హిందీ వారు ఎక్కువగా ఉన్నారు. అంతే కాకుండా, తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా కొంత మంది ఇందులో ఉన్నారు. చాకలి ఐలమ్మ పాత్రలో ఇంద్రజ నటించారు. ఇంకా చాలా మంది ఈ పోరాటంలో వీరమరణం పొందారు.

razakar movie review

వారందరి గురించి ఈ సినిమాలో చూపించారు. మతం మార్పిడి, తెలుగు మాట్లాడుతున్నారు అని పాఠశాలలో పిల్లలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే విషయాలని కూడా ఇందులో చూపించారు. మహిళలపై వారు ఎలా ప్రవర్తించారు అనేది సినిమాలో చూపించారు. ఈ సినిమాలో హీరో వీళ్ళు అని చెప్పడానికి ఉండదు. చాలా మంది నటులు. చాలా మంది పాత్రలు. ఎవరి ప్రాధాన్యత వారిదే. 15-20 నిమిషాలకు ఒకసారి ఒక పాత్ర తెర మీదకి రావడం, వాళ్లు పోరాడడం, ఆ తర్వాత వారి పరిస్థితి ఎలా అయ్యింది అనేది చూపించడం. సినిమాలో చాలా చోట్ల అలాగే డిజైన్ చేసుకున్నారు.

razakar movie review

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా రజాకార్లు ప్రజల మీద ఎలాంటి చర్యలు చేపట్టారు అనే విషయాలను చూపించారు. సినిమా సెకండ్ హాఫ్ అంతా కూడా ప్రజలు రజాకార్ల మీద ఎలా ఎదురు తిరిగారు అనే విషయాన్ని చూపించారు. సినిమాలో పెద్దగా డివియేషన్స్ అంటూ ఉండవు. దర్శకుడు సినిమాలో ఏ పాయింట్ చూపించాలి అనుకున్నారో, సినిమా మొదటి నుండి చివరి వరకు కూడా అలాగే సాగుతుంది. కానీ క్లైమాక్స్ లో చూపించే ఎపిసోడ్ విషయంలో మాత్రం ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

razakar movie review

భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం బాగుంది. సినిమా సెట్టింగ్స్ అంతా కూడా అప్పటి కాలం గుర్తుతెచ్చే లాగా ఉంటాయి. రమేష్ కుషేందర్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. కొన్ని సన్నివేశాల్లో రియాలిటీ కి దగ్గరగా తీయాలి అనే ఉద్దేశంతో చూపించిన విషయాలు మితిమీరినట్టు అనిపిస్తాయి. ఎక్కువ యాక్షన్ ఉన్న సినిమాలకు దూరంగా ఉండే వారు మాత్రం అలాంటి సీన్స్ చూసినప్పుడు భయపడే అవకాశాలు ఉన్నాయి. కథ కూడా చాలా వరకు తెలిసినట్టుగానే అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • స్క్రీన్ ప్లే
  • భారీ తారాగణం
  • చారిత్రాత్మక విషయాలని చూపించిన విధానం
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • రియలిస్టిక్ గా చూపించడానికి ప్రయత్నించిన కొన్ని సన్నివేశాలు
  • క్లైమాక్స్ డిజైన్ చేసిన విధానం

రేటింగ్ :

3/5

ట్యాగ్ లైన్ :

చారిత్రాత్మక నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చినా కూడా హైదరాబాద్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అప్పట్లో జరిగిన విషయాలు, వాటిపై ప్రజలు చేసిన పోరాటం చూపించిన సినిమాగా రజాకార్ సినిమా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : “తెలివి లేని వాళ్ళు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నట్టు ఉంది..!” అంటూ… “సమంత” వీడియో మీద డాక్టర్ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?


End of Article

You may also like