RRR పై “బాలీవుడ్” డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..! ఆస్కార్ గురించి అడిగితే..?

RRR పై “బాలీవుడ్” డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..! ఆస్కార్ గురించి అడిగితే..?

by Mohana Priya

Ads

సినీ ఇండస్ట్రీని ఇక్కడి నుండి ఎక్కడికో తీసుకెళ్లిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలితో మొదలైన సెన్సేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అప్పట్లో మగధీర వంటి సినిమాలు ఎన్నో తీసి ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తీసిన క్యారెక్టర్లు ప్రతీ ఒక్కరూ అనుసరిస్తూ, అభిమానాన్ని పెంచుకున్నారు.

Video Advertisement

బాహుబలి నుండే తెలుసు సినీ పరశ్రమ ప్యాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో బాలీవుడ్, టాలీవుడ్ అనే వ్యత్యాసం కూడా తొలగిపోతుంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో తప్ప మరెక్కడా కూడా తెలుగు సినిమాల గురించి పెద్దగా చర్చలు జరిగేవి కావు. కానీ ఇప్పుడు అలా కాదు, తెలుగు సినిమాల రేంజ్ ఏకంగా హాలీవుడ్ లో మ్రోగుతోంది. దీనంతటికీ కారణం, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళినే.

anurag kashyap on rrr

సినిమా కోసం ఆయన పడే పాట్లు, అందులోని పాత్రల ఎంపికలు, సినిమా కథ, దాన్ని చిత్రీకరించిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇక ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటే ప్యాన్ ఇండియా సినిమానే. ఆయన సినిమాలో నటించిన ఏ హీరో అయినా ప్యాన్ ఇండియా స్టార్ అవ్వాల్సిందే. ఒకరకంగా చెప్పాలంటే తెలుగు ఫిల్మ్ ఇండ్ట్రీనీ పేరు ప్రపంచ దేశాల్లో వినపడేలా చేసింది కూడా ఆయనే అని చెప్పడంలో ఏటువంటి సందేహం లేదు.ఈ తరుణంలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఆర్ఆర్ఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో, ఈ సినిమాపై అతని అభిప్రాయాన్ని వెల్లడించారు.

అయితే 2023 ఆస్కార్ నామినేషన్లలో ఈ సినిమా పేరు వస్తుందా లేదా అనే దానిపై చర్చలు జరగగా… అవును వచ్చే అవకాశం ఉంది అని అనురాగ్ అన్నారు. ఇప్పటి వరకు దక్షిణాది సినిమాలకి ఎప్పుడూ కూడా, ఈ అవకాశం రాలేదు అని. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీతో అది జరగబోతోంది అని పేర్కొన్నారు. కేవలం ఇండియాలోనే కాదు, ఇతర దేశాల వారు కూడా ఈ సినిమాని ఎంతగానో మెచ్చుకున్నారని… అది ఎంతో గొప్ప విషయమని అన్నారు.

ఈ మేరకు భారతదేశంలోని ఏదైనా సినిమాని ఆస్కార్ కు నామినేట్ చెయ్యాలి అంటే అందులో 99 శాతం ఆర్ఆర్ఆర్ సినిమాకే వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఈ విషయంపై పలువురు, నెటిజన్లు, అభిమానులు, సినీ పరిశ్రమలోని పెద్దలు కూడా అవును ఆర్ఆర్ఆర్ సినిమానే ఆస్కార్ కి నామినేట్ అవుతుంది అని అభప్రాయపడుతున్నారు. అదే గనక జరిగితే తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో, ఎస్ఎస్ రాజమౌళి యెనలేని స్థాయిలో నిలుస్తారని, సోషల్ మీడియాలో ముచ్చట్లు చక్కర్లు కొడుతున్నాయి.


End of Article

You may also like