Ads
ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాల హావా కొనసాగుతుంది. బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇక ఇటీవల పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, కాంతారా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడమే కాకుండా భారీగా వసూళ్లు రాబట్టాయి. దీంతో ఇప్పుడు బీటౌన్ హీరోస్ ఫోకస్ సౌత్ పై పడింది.
Video Advertisement
తమ సినిమాలను ఇక్కడ విడుదల చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం తో పాటు.. అవకాశం దొరికినప్పుడల్లా టాలీవుడ్ చిత్రాల్లో విలన్స్ గా మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఉన్న బాలీవుడ్ నటులెవరో చూద్దాం..
#1 సైఫ్ అలీఖాన్
బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన సైఫ్ ఆలీఖాన్ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం లో రావణాసురుడిగా నటిస్తున్నాడు. మరోపక్క ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో మూవీలో పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నాడు.
#2 సంజయ్ దత్
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కన్నడ సినిమా కెజిఎఫ్ మూవీ లో విలన్గా నటించారు.
#3 బాబీడియోల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హిస్టారిక్ ఫిక్షనల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ మూవీ లో బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ఔరంగజేబు పాత్రలో నటించనున్నారు.
#4 అర్జున్ రాంపాల్
నటసింహ బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లోని మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. బాలయ్యకు 108 వ సినిమా ఇది. ఈ మూవీ లో అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
#5 డినో మోరియా
అఖిల్ హీరోగా సురేంద్రరెడ్డి దర్శకత్వం లో వచ్చిన ‘ఏజెంట్’ మూవీ లో బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్ గా నటించారు.
#6 ఇర్ఫాన్ ఖాన్
బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో నటించిన విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్.. మహేష్ బాబు హీరోగా నటించిన సైనికుడు మూవీ లో విలన్ గా నటించారు.
#7 నీల్ నితిన్ ముఖేష్
బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన కవచం మూవీ లో విలన్ గా నటించారు.
#8 శరద్ కేల్కర్
బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ పలు టాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. ఈయన పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ లో విలన్ గా నటించారు. అలాగే ప్రభాస్ కి ఆదిపురుష్ మూవీ కి, బాహుబలి హిందీ వెర్షన్ కి వాయిస్ ఇచ్చారు.
#9 అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రోబో 2 మూవీ లో విలన్ గా నటించారు.
#10 అర్భాజ్ ఖాన్
బాలీవుడ్ హీరో అర్భాజ్ ఖాన్ పలు తెలుగు చిత్రాల్లో విలన్ గా నటించారు.
End of Article