నాగార్జున అక్కినేని వారసుడిగా అఖిల్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తన పేరునే తొలి సినిమా టైటిల్ గా చేసుకొని హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినప్పటికి అఖిల్ కి నటుడిగా మంచి గుర్తింపును తెచ్చింది.

Video Advertisement

అఖిల్ కు ఇప్పటి దాకా చెప్పుకోదగ్గ విజయం లేనప్పటికీ యువతలో క్రేజ్ పెరిగిపోయింది. ఆయన మూవీ కోసం ఎదురుచూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. సాధారణంగా తమ అభిమాన నటుడి పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఆ క్రమంలో తమ ఫేవరెట్ హీరో గురించి సోషల్ మీడియాలో పోస్ట్ లు షేర్ చేస్తుంటారు. హీరోలకి సంబంధించిన ఫోటోలు కనిపించగానే వెంటనే షేర్ చేస్తూ ఫ్యాన్స్ మురిసిపోతుంటారు.
అలా ప్రస్తుతం యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది అఖిల చిన్ననాటి ఫోటో. అందులో తల పై హ్యట్, చేతితో గన్ పట్టుకుని కౌబాయ్ గెటప్ లో ఉన్న చిన్నారి అఖిల్ ఫోటో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. అక్కినేని ఫ్యాన్స్ ఆ ఫోటోను షేర్ చేస్తూ ఇదిగో మా ఫేవరెట్ హీరో చిన్ననాటి ఫోటో అని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఫోటో 2002లో టక్కరి దొంగ సెట్ లో తీసిన ఫోటో. మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ అనే కౌబాయ్ సినిమా చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ఆకక్డికి వెళ్ళిన అఖిల్ కు కౌ బాయ్ గెటప్ వేయడం జరిగింది. మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ అనే కౌబాయ్ సినిమా చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ఆకక్డికి వెళ్ళిన అఖిల్ కు కౌ బాయ్ గెటప్ వేయడం జరిగింది. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అఖిల్ హీరోగా ఇప్పటి వరకు నాలుగు చిత్రాలు చేసినా మంచి హిట్ అయితే రాలేదు. అఖిల్ ఇప్పుఉ ఏజెంట్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఈ సినిమాను ఈ ఏడాదిలైన్ విడుదల చేయాలని మూవీ యూనిట్ అనుకుంటున్నారు. ఈసారైనా అఖిల్ మంచి హిట్ రావాలని అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.
Also Read: “గుండెజారి గల్లంతయ్యిందే” నుండి… “జాను” వరకు… “నాని” రిజెక్ట్ చేసిన 10 సినిమాలు..!