బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో నటించారు. సినిమా సెన్సేషనల్ విజయం సాధించింది. బాలకృష్ణకి మళ్లీ మరొక ఇన్నింగ్స్ మొదలయ్యింది ఈ సినిమాతోనే.

Video Advertisement

ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. సినిమాలో బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ చాలానే ఉంటాయి. అలాగే బాలయ్య మార్క్ డైలాగ్స్, డాన్స్ కూడా ఉంది. ఈ సినిమాకి చాలా విషయాలు ప్లస్ అయ్యాయి. దాంతో సినిమా అంత పెద్ద విజయం సాధించింది.

అయితే సినిమాకి ఒక హీరో బాలకృష్ణ అయితే, మరొక హీరో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అని అప్పట్లో చాలా మంది అన్నారు. ఈ సినిమాకి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల థియేటర్లలో సౌండ్ సిస్టం పగిలిపోతుంది అని ఒక థియేటర్ యాజమాన్యం ఫిర్యాదు చేశారు అంటే అది ఏ స్థాయిలో ఉంది అనేది తెలుసు. ఈ సినిమా వచ్చిన తర్వాత తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ అని ఒక టైటిల్ కూడా వచ్చేసింది.

అయితే ఈ విషయంలో ఇటీవల బోయపాటి శ్రీను మాట్లాడుతూ మరొక విధంగా చెప్పారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ విషయంపై బోయపాటి శ్రీను మాట్లాడుతూ, “అఖండ సినిమాకి తమన్ ఏం ప్రాణం పోయలేదు. సౌండ్ లేకుండా చూసినా కూడా ఈ సినిమా అలాగే ఉంటుంది. దానికి అంత దమ్ము ఉంది. చాలా గర్వంగానే ఫీల్ అవుతాను” అని అన్నారు. ఈ విషయం మీద సోషల్ మీడియా అంతటా కామెంట్స్ వస్తున్నాయి.

Balakrishna-Boyapati-Srinu-3

“అసలు అఖండ సినిమా హిట్ అవ్వడానికి ముఖ్య కారణం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ విషయాన్ని మర్చిపోయి అలా ఎలా మాట్లాడుతున్నారు?” అని అంటున్నారు. ఇటీవల వచ్చిన స్కంద సినిమాకి కూడా తమన్ ఇలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. కానీ అలాంటి టైప్ మ్యూజిక్ విని విని మనకి అలవాటు అయిపోవడంతో సినిమా, అందులోని మ్యూజిక్ అంత పెద్దగా ఎక్కలేదు. కానీ అఖండ సినిమాకి మాత్రం తమన్ కి సగం క్రెడిట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు బోయపాటి శ్రీను మాత్రం ఇలా మాట్లాడడంతో ఇలా అంటున్నారు ఏంటి అని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

watch video :

ALSO READ : “శ్రీరామ చంద్ర” నటించిన పాపం పసివాడు చూశారా..? ఎలా ఉందంటే..?