బీపీ చెక్ చేసుకుంటున్నారా….? అయితే ఈ నాలుగు జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి…!

బీపీ చెక్ చేసుకుంటున్నారా….? అయితే ఈ నాలుగు జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి…!

by Mounika Singaluri

Ads

ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరికి ఏ అనారోగ్య సమస్య వస్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు మనుషులను చుట్టుముడుతున్నాయి. పని ఒత్తిడి ప్రధాన కారణంగా మనిషి నలిగిపోతున్నాడు. కుటుంబ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు, డబ్బు సమస్యలు ఇలా ఏదో ఒకటి మనిషిని పట్టి పీడిస్తుంది.
అయితే మనిషికి ఒత్తిడి ఎక్కువైతే లేనిపోని టెన్షన్స్ పెరిగిపోతాయి దాని కారణంగా బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది.

Video Advertisement

ప్రస్తుతం చాలామంది వయసుతో సంబంధం లేకుండా బీపీతో బాధపడుతున్నారు. లేవగానే బీపీ టాబ్లెట్ వేసుకోకుండా రోజు గడవడం లేదు.అయితే చాలామంది నిత్యం ఇంటి వద్ద బీపీ చెక్ చేసుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టు వారి దినచర్యను ప్లాన్ చేసుకుంటారు. ఇంటి వద్ద బీపీ చెక్ చేసుకునేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు.

1.

coffeeఇంటి వద్ద మనం బీపీ చెక్ చేసుకుని ముందు టీ, కాఫీలు తీసుకోకూడదు .అలాగే సిగరెట్ గాని,మద్యం గాని సేవించకూడదు. దాని కన్నా ముఖ్యంగా బీపీ చెక్ చేసుకునే ముందు యూరిన్ అనేది కంప్లీట్ గా వెళ్లిపోవాలి. బాగా ప్రశాంతంగా ఉన్నప్పుడే బీపీని చెక్ చేసుకోవాలి.

2.


హార్ట్ కి సమానంగా మనం బీపీ చూసుకునే చేతిని పెట్టుకోవాలి  . దానికోసం చేతిని ఏదైనా టేబుల్ మీద సమాంతరంగా పెట్టుకోవాలి. అలాగే బీపీ చెక్ చేసుకునే చేతికి షర్టు లేకుండా డైరెక్ట్ గా బీపీని చూసుకోవాలి.

3.health insurance 1

మనం బీపీ ని మూడు మెజర్మెంట్స్ గా తీసుకోవాలి. ఫస్ట్ మెజర్మెంట్ ని వదిలేసి రెండు, మూడు మెజర్మెంట్స్ లో యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేసుకుని దాన్ని పరిగణంలోకి తీసుకోవాలి.
ప్రతి మెజర్మెంట్ మధ్య మూడు నిమిషాల గ్యాప్ ఉండాలి.

4.

మన బీపీ మెజర్స్ 130/80 ఉంటే ఎక్కువగా,100/60 గా ఉంటే తక్కువగా లెక్కవేసుకోవాలి.

 

Also Read:30 దాటిన ఆడవాళ్లు ఈ విషయాలు తప్పక పాటించండి..! అవి ఏంటంటే..?


End of Article

You may also like