మనిషి జీవితంలో అనేక దశలను దాటుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. చిన్నతనం, కౌమారం,యవ్వనం, పెద్దరికం ఇలా అనేక దశలను మనిషి తన జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. చిన్నతనంలో మన బాగోగులన్నీ మన తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు.
Video Advertisement
కౌమార దశ వచ్చేసరికి మనకి శరీరకమార్పులతో కొంత అవగాహన కలుగుతుంది. యవ్వన దశలో పూర్తిగా పరివర్తన చెందుతాం. ఇక పెద్దరికం అంటే మన శరీరాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకోవాల్సిన దశ.
మగవారి కంటే కూడా ఆడవారిలో శరీరక మార్పులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు కూడా ఆడవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే ఆడవాళ్లు ఒక కంట తమ ఆరోగ్యాన్ని కనిపెడుతూ ఉండాలి. 30 ఏళ్ల వరకు జీవితం బాగానే గడిచిన, 30 ఏళ్లు దాటుతుండగా వయసు పెరుగుతుందని భావన కలుగుతుంది. అలాంటప్పుడే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మన చుట్టూ ఉండే వాతావరణం, మన శరీరం, మన చర్మం, మన జుట్టు మనకి వయసు పెరుగుతుందని సంకేతాలు ఇస్తూ ఉంటాయి. లోలోపల కాస్త భయం కూడా పెరుగుతుంది. వయసు పెరుగుతుందని బాధ ఉంటే అది మన పైన ప్రభావం చూపిస్తుంది.
ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన ఆడవాళ్లు తీసుకోవలసిన జాగ్రత్తలు మీకోసం…
#ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మన బుద్ధిని మెరుగుపరుచుకుని నిత్యం చురుకుగా ఉండాలి. దీనివల్ల యవ్వనంగా కనిపిస్తారు.
#డ్రెస్సింగ్ స్టైల్ , హెయిర్ స్టైల్ మార్చడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
#చిన్నప్పుడు నేర్చుకుని వదిలేసిన పనులను మళ్ళీ కొనసాగించడం.
#పుస్తకాల చదవడం అలవాటు చేసుకోండి. ఇంటి దగ్గరే ఉండి యోగానీ ప్రాక్టీస్ చేయండి.
#నిత్యం చురుకుగా ఉండటం ద్వారానే నిత్య యవ్వనం ఉంటుందని గుర్తుంచుకోండి.
#మనసుని హాయిగా ఉంచుకోవడం ద్వారా కూడా మన ఈ దశని దాటవచ్చు.
#వ్యక్తిగత ఆరోగ్యం పైన శ్రద్ధ మనల్ని నిత్యం యవ్వనంగా ఉంచుతుంది.
వయసు తిరోగమనం అన్నది ఎవరికైనా సహజం కాబట్టి, దాని గురించి ఆలోచించకుండా మనం ఆనందంగా, ఆహ్లాదంగా ఉండడానికి ప్రయత్నించడమే దీనికి పరిష్కారంగా చెబుతున్నారు.
Also Read:ప్యాంట్ వెనుక జేబులో పర్స్ పెట్టుకుంటున్నారా..? ఇలా చేయడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా..?