ఇప్పటి వరకు చూడని హాస్య బ్రహ్మ “బ్రహ్మానందం” అరుదైన ఫోటోలు..!

ఇప్పటి వరకు చూడని హాస్య బ్రహ్మ “బ్రహ్మానందం” అరుదైన ఫోటోలు..!

by kavitha

Ads

హాస్య బ్రహ్మగా పేరుగాంచిన బ్రహ్మానందం గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. హాస్య నటుడిగా  తన కామెడీ టైమింగ్ తో మూడు తరాలను అలరించారు. 1100కి పైగా చిత్రాలలో నటించి, మెప్పించారు.  నవ్వించడంలో ఆయనని మించిన వారు లేరని చెప్పవచ్చు.

Video Advertisement

సోషల్ మీడియాలో బ్రహ్మానందం  మీమ్ రూపంలో లేదా కామెడీ వీడియోల రూపంలోనో ఎక్కడో ఒకచోట తప్పకుండా కనిపిస్తూనే ఉంటారు. హాస్య బ్రహ్మ, కామెడీ కింగ్ అంటూ పలు పేర్లతో పిలిచే ఆయనకు ఉన్న మరో పేరు మీమ్ గాడ్. నేడు పుట్టిన రోజు  జరుపుకుంటున్న బ్రహ్మానందం రేర్ పిక్స్ చూద్దాం..
కన్నెగంటి బ్రహ్మానందం 1956లో ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లిలోని చాగంటి వారి పాలెం గ్రామంలో ఫిబ్రవరి 1న  జన్మించారు. ఆయన తండ్రి పేరు నాగలింగాచారి, తల్లి పేరు లక్ష్మీ నర్సమ్మ. బ్రహ్మానందం ఎనిమిది మంది పిల్లలలో ఒకరు. తండ్రి వడ్రంగి పనిచేసేవారు. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసి, పశ్చిమగోదావరిలోని అత్తిలిలో బ్రహ్మానందం తెలుగు లెక్చరర్‌గా చేరారు. లెక్చరర్‌గా పనిచేస్తున్న సమయంలో థియేటర్‌లో మరియు మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు.
నవలా రచయిత ఆది విష్ణు ఆయనని దూరదర్శన్ (డిడి) ఎన్‌సివి శశిధర్‌కు పరిచయం చేశారు. అలా  ఆయన 1985లో డిడి తెలుగు ఛానెల్ లో ప్రసారం అయిన పకపకలు షోతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టారు. అందులో లో ఆయన నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. షోలో ఆయన నటన చూసిన దర్శకుడు జంధ్యాల అహ నా పెళ్లంట సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ అద్భుతమైన పాత్ర ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ తరువాత వరుస అవకాశాలు రావడంతో స్టార్ కమెడియన్ గా ఎదిగారు.
గిన్నీస్ బుక్ రికార్డ్ మరియు పద్మ శ్రీతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన సోషల్ మీడియా మరియు మీమ్ కంటెంట్ మొదలైన తరువాత జిఫ్ గాడ్, గాడ్ ఆఫ్ మీమ్స్ అని పిలుస్తున్నారు. ఆయన లేకుండా మీమ్స్ ను ఊహించడం నేటి తరానికి అసాధ్యం అని చెప్పవచ్చు. ఆయన పుట్టిన రోజు(ఫిబ్రవరి 1) సందర్భంగా ఉదయం నుండి ఆయన మీమ్స్, ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన అరుదైన ఫోటోలను మీరు చూసేయండి..

1.
2.3.4.5.6.7.8.
9.10. 11. 12.13.
14.15. 16. 17.18. Also Read: “మీరు లేకపోతే సోషల్ మీడియానే లేదు..! అంటూ… హాస్యబ్రహ్మ “బ్రహ్మానందం” బర్త్ డే పై 15 మీమ్స్..!

 


End of Article

You may also like