ఒక మనిషి ఎంటర్టైన్మెంట్ లో సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపోయింది. కేవలం ఎంటర్టైన్మెంట్ గురించి మాత్రమే కాకుండా సోషల్ మీడియాని ఎన్నో మంచి పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం పక్కన పెడితే, సోషల్ మీడియా అంటే మనకి ఎక్కువ గుర్తొచ్చేది సినిమాలు. సినిమాల గురించి సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో అప్డేట్ అవుతుంది.brahmi robo 1కేవలం కొత్త సినిమాల గురించి మాత్రమే కాకుండా, పాత సినిమాల గురించి కూడా ఎన్నో తెలియని విషయాలు సోషల్ మీడియా ద్వారా తెలుస్తాయి. అలాగే పాత సినిమాల్లో, లేదా సూపర్ హిట్ అయిన సినిమాల్లో కొన్ని ఫేమస్ డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్, పాటలు కూడా ఇప్పుడు టెంప్లేట్స్ లాగా మనకి తరచుగా కనిపిస్తూనే ఉంటాయి.

brahmi robo 2

అయితే ఈ టెంప్లేట్స్ లో మనకు ఎక్కువగా కనిపించే బ్రహ్మానందం గారి టెంప్లేట్స్. ఆయన నటించిన ప్రతి సినిమా, ఆయన పోషించిన ప్రతి పాత్ర, ఆయన ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషన్, ఇప్పటికీ, ఎప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటాయి. అయితే రజనీకాంత్ గారు హీరోగా నటించిన రోబో సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.brahmi robo 4

ఒకవేళ ఈ సినిమాలో రోబో ప్లేస్ లో బ్రహ్మానందం గారు ఉంటే ఎలా ఉంటుందో, రజినీకాంత్ గారు రోబో ని అందరికీ ఇంట్రడ్యూస్ చేసే సీన్ లో బ్రహ్మానందం గారు ఉంటే, వారు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తారో అని తెలుగు బ్రో అనే ఒక ఫేస్ బుక్ పేజ్ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన పార్ట్ 1 గతం లోనే రిలీజ్ అయింది. ఆ పార్ట్ ని ఈ లింక్ లో చూడచ్చు. : పార్ట్-1

పార్ట్-2 ని ఈ కింద చూడొచ్చు.

Watch Video: