Ads
స్టార్ స్టేటస్ ను,ఇమేజ్ ను పక్కనపెట్టి డిఫరెంట్ కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేయడం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికే చెల్లిందని చెప్పవచ్చు. ‘కాదల్ ది కోర్’లో గే పాత్ర , రోర్‌షాక్’లో వైవిధ్యమైన సీన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపడిచాడు.ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు డిఫరెంట్ కంటెంట్ చిత్రాలు చేస్తున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘భ్రమయుగం’ తెలుగు వెర్షన్ నేడు విడుదలైంది. ఆ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
- చిత్రం : భ్రమయుగం
- నటీనటులు : మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిద్ధార్ధ్ భరతన్ తదితరులు.
- నిర్మాత : చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్
- దర్శకత్వం : రాహుల్ సదాశివన్
- సంగీతం : క్రిస్టో జేవియర్
- విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2024
స్టోరీ:
పానన్ అనే తక్కువ కులానికి చెందిన తేవన్(అర్జున్ అశోకన్) జానపద గాయకుడు. తన తల్లి వద్దకు వెళుతూ ఒక అడవిలో దారి తప్పి, ఒక పాడుబడ్డ భవనంకు చేరుకుంటాడు. అందులో ఇద్దరు మనుషులుమాత్రమే నివసిస్తుంటారు. ఆ ఇంటి యజమాని కొడుమోన్ పొట్టి(మమ్ముట్టి), అతని వంటమనిషి (సిద్ధార్థ్ భరతన్). తక్కువ వర్గానికి చెందిన తేవన్ ను కొడుమోన్ అతిథిగా భావించి, తనతో పాటు సమానంగా చూసుకుంటాడు. కానీ ఆ తరువాత కొడుమోన్ తనను ట్రాప్ చేశారని అర్ధం చేసుకుంటాడు. దాంతో ఆ భవనం నుంచి పారిపోవాలని తేవన్ ప్రయత్నిస్తాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా, తిరిగి ఆ భవనంలోకే వస్తూ ఉంటాడు. అలా జరగడానికి కారణం ఏమిటి? కొడుమోన్ పొట్టి ఎవరు? ఆ ఇంట్లో ఉన్న మాయ ఏమిటి ? తేవన్ ఆ ఇంటి నుంచి తప్పించుకున్నాడా? చివరకు ఏమైంది? అనేది మిగతా కథ.
రివ్యూ:
రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రయోగాత్మక సినిమా భ్రమయుగం. భ్రమయుగం టైటిల్ కు తగ్గట్లుగానే ఆడియెన్స్ ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కేవలం 3 క్యారెక్టర్లతో రెండున్నర గంటల చిత్రాన్ని నడిపించడం తెలికేనా? ప్రస్తుత కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాని ఆడియెన్స్ చూస్తారా? ఎలాంటి హీరోయిజం లేకుండా, స్టార్ హీరోని సినిమా మొత్తం ఒక్క డ్రెస్ లోనే చూపిస్తే, ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా? లాంటి అనుమానాలకు ఈ మూవీ సమాధానం.
తేవన్ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లడంతో స్టోరీ ఊపందుకుంటుంది. అక్కడి నుండి ఆ ఇంట్లో సీన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. డైరెక్టర్ ప్రతీ ఫ్రేమ్ ను తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. తేవన్ ఇంట్లో నుండి బయటపడాలని ప్రయత్నించడం, అవి విఫలం కావడం, అందుకు కారణం ఏమిటో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్ ని కుర్చీ అంచున కూర్చునేలా చేస్తాయి. స్టోరీలో వచ్చే ట్విస్టులు ఊహించనివిధంగా ఉంటాయి. నేపథ్య సంగీతం కథలో లీనం అయ్యేలా చేస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. షెహనాద్ జలాల్ కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది.
కొడుమోన్ పొట్టి పాత్రలో మమ్ముట్టి మరోసారి నట విశ్వరూపం చూపించారు. ఇప్పటివరకు ఆడియెన్స్ చూసిన మమ్ముట్టి వేరు. ఈ ‘మూవీలోని మమ్ముట్టి వేరు. మమ్ముట్టి లుక్స్ నుండి మేనరిజమ్స్ వరకు ప్రతి సీన్ లో ఆయన యాక్టింగ్ అద్భుతం. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ లో అదరగొట్టేశారు. మమ్ముట్టి ధీటుగా తేవన్ పాత్రలో అర్జున్ ఆశోకన్ అద్భుతం నటించాడు. వంటవాడిగా సిద్ధార్థ్ భరతన్ చక్కగా నటించారు.
ప్లస్ పాయింట్స్:
- మమ్ముట్టి నటన
- స్టోరీ
- టెక్నికల్ టీమ్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- స్లో నెరేషన్
రేటింగ్ :
3/5
watch trailer :
End of Article