SIDDHARTH ROY REVIEW: “అతడు చైల్డ్ ఆర్టిస్ట్” హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

SIDDHARTH ROY REVIEW: “అతడు చైల్డ్ ఆర్టిస్ట్” హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరోలుగా, హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు అలాగే అతడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన దీపక్ సరోజ్, సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాతో హీరోగా అడుగు పెట్టారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : సిద్ధార్థ్ రాయ్
  • నటీనటులు : దీపక్ సరోజ్, తన్వి నేగి, నందిని యల్లారెడ్డి.
  • నిర్మాత : జయ ఆడపాక
  • దర్శకత్వం : వి. యశస్వి
  • సంగీతం : రధన్
  • విడుదల తేదీ : ఫిబ్రవరి 23, 2024

siddharth roy movie review

స్టోరీ:

సిద్ధార్థ్ రాయ్ (దీపక్ సరోజ్), లాజిక్స్ మీద బ్రతికే వ్యక్తి. ప్రతి విషయాన్ని లాజిక్ ప్రకారం ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. అందుకే తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అలా సాగిపోతున్న సిద్ధార్థ్ జీవితంలోకి ఇందు (తన్వి నేగి) ప్రవేశిస్తుంది. ఇందులో ప్రేమలో పడి ఎమోషన్స్ గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. కానీ వీరిద్దరి మధ్య మాత్రం గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా వాళ్ల సమస్యలను పరిష్కరించుకుంటున్నప్పుడు, సిద్ధార్థ్ జీవితంలోకి రాధ (నందిని యల్లారెడ్డి) ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి? సిద్ధార్థ్ ఎవరిని ప్రేమించాడు? ఇందు ఏం చేసింది? వాళ్ల సమస్యలను వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

siddharth roy movie review

రివ్యూ:

లవ్ స్టోరీ అనే జోనర్ లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు కొత్త ఏమీ కాదు. ఎన్నో లవ్ స్టోరీ సినిమాలు చూసి, ఏ ప్రేమ కథ చూస్తున్నా కూడా తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మన ప్రేక్షకులు ఈజీగా కనిపెట్టగలుగుతారు. అలాంటి తెలిసిన కథను కూడా టేకింగ్ పరంగా జాగ్రత్తలు తీసుకుంటే సినిమాని బాగా చూపించే అవకాశం ఉంటుంది. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుండి కూడా చాలా మంది అర్జున్ రెడ్డి సినిమాతో పోలికలు వెతకడం మొదలు పెట్టారు. అయితే, సినిమా బృందం మాత్రం అర్జున్ రెడ్డి సినిమాకి ఈ సినిమాకి ఎటువంటి పోలిక లేదు అని చెప్తూ వచ్చారు.

ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఎమోషన్స్ కి, లాజిక్స్ కి మధ్య నలిగే ఒక వ్యక్తిని చూపించారు. అలాంటి వ్యక్తులు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు అనే విషయాన్ని చూపించారు. కానీ కొన్ని సీన్స్ మాత్రం అందులో మోతాదుకు మించి డ్రామా పెట్టినట్టు అనిపిస్తాయి. సింపుల్ గా చూపించే అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. దీపక్ సరోజ్ కి హీరోగా ఇది మొదటి సినిమా. పాత్ర కోసం తనని తాను చాలా మార్చుకున్నారు. అది సినిమా చూస్తుంటే తెలిసింది.

హీరోగా ఇది మొదటి సినిమా అయినా కూడా, ఎటువంటి భయం లేకుండా బాగా నటించారు. హీరోయిన్స్ తన్వి, నందిని కూడా పాత్రల పరిధి మేరకు నటించారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఎంత పోలికలు లేవు అని చెప్పినా కూడా, ఎక్కడో ఒకచోట అర్జున్ రెడ్డి సినిమా గుర్తొస్తుంది. అయినా కూడా రెండు డిఫరెంట్ కథలు. టేకింగ్ పరంగా కూడా అలాగే డిఫరెంట్ గా ఉండేలాగా చూసుకున్నారు. కానీ కొన్ని సీన్స్ మాత్రం చాలా సాగదీసినట్టు అనిపిస్తాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్:

  • నటీనటుల పర్ఫార్మెన్స్
  • నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్:

  • కొన్ని సీన్స్ లో ఎక్కువ అయిన డ్రామా
  • సాగదీసినట్టుగా ఉన్న కొన్ని ఎపిసోడ్స్

రేటింగ్ :

2.75/5

ట్యాగ్ లైన్:

మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అర్జున్ రెడ్డి సినిమాతో అసలు పోలిక పెట్టకుండా, ఈ సినిమా ఎలా తీశారు అని చూద్దాం అనుకునే వారికి, సిద్ధార్థ్ రాయ్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer : 


End of Article

You may also like