ఫన్నీ గా చేసిన ట్వీట్ … ట్రోల్స్ దెబ్బకి తట్టుకోలేక అకౌంట్ డిలీట్ చేయాల్సి వచ్చింది..!

ఫన్నీ గా చేసిన ట్వీట్ … ట్రోల్స్ దెబ్బకి తట్టుకోలేక అకౌంట్ డిలీట్ చేయాల్సి వచ్చింది..!

by Mohana Priya

Ads

గత కొంత కాలం నుండి లాక్ డౌన్ కారణంగా అత్యవసరం అయితే తప్ప బయటికి రాని ప్రజలు, ఇప్పుడు కొంచెం రూల్స్ సడలించడం తో ఎప్పటిలాగా కాకపోయినా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే బయటికి వెళ్ళడం మొదలు పెట్టారు. కానీ ఇటీవల వచ్చిన వరదల కారణంగా ప్రజలందరూ మళ్లీ ఇళ్లలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు రెండు రోజులు ఆగకుండా కురిసిన వర్షం తో, వరద నీరు మొత్తం రోడ్లపై నిలిచిపోయింది. అంతే కాకుండా చాలా ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లల్లోకి కూడా వెళ్లి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కి కూడా ఇదే పరిస్థితి ఎదురవడంతో వాళ్ళ ఇంటి దగ్గర కూడా నీళ్ళు నిలిచిపోయాయి అనే విషయాన్ని ఒక పిక్చర్ ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తర్వాత ఒక ట్వీట్ చేశారు. కానీ హ్యూమరస్ గా చేసిన ఆ ట్వీట్, బ్యాక్ ఫైర్ అయ్యింది. వివరాల్లోకి వెళితే.

Video Advertisement

రోడ్డు మొత్తం నీళ్లు నిలిచిపోయిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి,  తర్వాత తాను ఒక బోట్ కొనాలి అనుకుంటున్నట్టు ఒక ట్వీట్ చేశారు బ్రహ్మాజీ. దాంతో నెటిజన్లు “ఆ మాట ఇన్ సెన్సిటివ్ గా ఉంది” అంటూ, ఆ పోస్ట్ కి నెగిటివ్ కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. ట్రోలింగ్ ఎక్కువవడంతో తన సోషల్ మీడియా ఎకౌంట్ ని డిలీట్ చేశారు బ్రహ్మాజీ.

బ్రహ్మాజీ  ఈ విషయం గురించి మాట్లాడుతూ ” తను ఇంటికి రిటర్న్ అయ్యేటప్పుడు, వాళ్ళ వీధి మొత్తం నీళ్లతో నిండి ఉంది అని, దాంతో కార్ లో వెళ్ళలేను అని తనకు అర్థమైందని, ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ ని కార్ పార్క్ చేయమని అడిగి, నడుచుకుంటూ వెళ్లి పోయాను అని,

వాళ్ల బేస్మెంట్లో కూడా నీళ్ళు ఉన్నాయని అందుకే బోట్ కొనుక్కోవాలి అనుకుంటున్నాను సలహా ఇవ్వండి అని ట్వీట్ చేశాను అని” చెప్పారు. ఇలాంటి సమయంలో  ఎంతో కష్టపడి పని చేస్తూ, ఎంతో మంది ప్రజలకు సహాయం అందించేందుకు కృషి చేస్తున్న తెలంగాణ గవర్నమెంట్ ని బ్రహ్మాజీ అభినందించారు.


End of Article

You may also like