పెళ్లికి ముందు వరుడు పెట్టిన 10 షరతులకి.. షాక్ అయిన వధువు కుటుంబ సభ్యులు..! ఏం చెప్పాడంటే..?

పెళ్లికి ముందు వరుడు పెట్టిన 10 షరతులకి.. షాక్ అయిన వధువు కుటుంబ సభ్యులు..! ఏం చెప్పాడంటే..?

by kavitha

Ads

పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని పెద్దలు చెబుతుంటారు. జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం అయిన పెళ్లిని గ్రాండ్ గా గుర్తుండిపోయే విధంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. దానికి తగ్గట్టు ఎవరి ఆర్థిక పరిస్థితులను బట్టి వారు తమ వివాహాన్ని మధుర జ్ఞాపకంగా ఉండేలా జరుపుకుంటారు.

Video Advertisement

ఇదే విధంగా ఆలోచించిన ఓ వరుడు వధువు కుటుంబానికి పలు షరతులు పెట్టాడు. ఆ షరతులు విన్న వధువు మరియు ఆమె కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అమ్మాయిలు పెళ్లికి ముందు ఆ అబ్బాయి పెట్టిన ఈ ప్రత్యేకమైన షరతుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఇది తెలంగాణ రాష్ట్రంలో ని కోదాడలో చోటు చేసుకుంది. వరుడి షరతులకు ముందు ఆశ్చర్యపోయినా, ఆ తరువాత సంతోషంగా పెళ్లి కుమార్తె ఆమె ఫ్యామిలీ అంగీకరించారు. అయితే అవి వరకట్నానికి సంబంధించిన డిమాండ్ కాదు.  పెళ్లి లో జరిగే పద్ధతులు మరియు సంప్రదాయాల గురించిన షరతులు. అందరు ఆశ్చర్యపోయేంతగా ఆ వరుడు పట్టిన ఆ షరతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. 1. ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండకూడదు.

2. పెళ్లిలో వధువు లెహంగా కాకుండా చీరను ధరించాలి.

3. వివాహ వేదిక వద్ద అసభ్యకరమైన సంగీతం కాకుండా తేలికపాటి వాయిద్య సంగీతం ఉండాలి.

4. దండ వేసే సమయంలో వేదిక పై వధూవరులు మాత్రమే ఉండాలి.

5. వరమాల సమయంలో వధువు లేదా వరుడిని ఇబ్బంది పెట్టేవారిని వివాహం నుండి బహిష్కరించాలి.

6. పూజారి పెళ్లిని మొదలుపెట్టిన తరువాత ఎవరూ ఆపకూడదు.

7. కెమెరామెన్ దూరం నుండి ఫోటోలు తీయాలి. ఫోటోలు తీసే సమయంలో అతను ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ఫోటోలు తీయాలి.

8. పూజారి పెళ్లి జరిపించేటపుడు పదేపదే ఆటంకం కలిగించకూడదు. కెమెరామెన్ చెప్పినట్లుగా పోజులివ్వడం లాంటివి ఉండకూడదు.

9. పెళ్లి వేడుకను మధ్యాహ్నం జరిపించి, సాయంత్రం అమ్మాయికి వీడ్కోలు ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయాలి. అలా చేయడం వల్ల మధ్యాహ్నం 12 -1 గంటల వరకు భోజనం పూర్తవుతుంది. పెళ్లికి వచ్చిన అతిథులు నిద్రలేమి, అసిడిటీ లాంటి సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉంటారు. అలాగే అతిథులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలస్యం కాకుండా తమ ఇళ్లకు చేరుకుంటారు.

10. వివాహం జరిగిన వెంటనే అందరి ముందు ముద్దు పెట్టుకోమని, కౌగిలించుకోమని అడిగినవారిని పెళ్లి నుండి  బహిష్కరించాలి.

Also Read: ఫేస్బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ వల్ల ఆ 18 ఏళ్ల యువతి పెళ్లి ఆగిపోయింది.! ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి.?


End of Article

You may also like