Ads
మార్షల్ ఆర్ట్స్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బ్రూస్ లీ. ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్‌పై ఇంట్రెస్ట్ చూపించి యూత్ ఆయనే ఆదర్శం అని చెప్పవచ్చు. మార్షల్ ఆర్ట్స్‌తో వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది ఫ్యాన్స్ సొంతం చేసుకున్న అమెరికన్ లెజెండరీ యాక్టర్ బ్రూస్ లీ.
Video Advertisement
బ్రూస్ లీ ‘ఎంటర్ ది డ్రాగన్’ మూవీతో ప్రపంచ సినీమాని మార్చేసాడు. తన పవర్ పంచ్, కిక్‌లతో అంతర్జాతీయంగా ఆడియెన్స్ ను అలరించారు. ఆగస్టు 19తో ఈ చిత్రం రిలీజ్ అయ్యి యాబై సంవత్సరాలు. ఈ చిత్రం రిలీజ్ అవకముందే రిలీజ్ బ్రూస్ లీ కన్నుమూశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, 1940లో బ్రూస్ లీ శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు. హాంకాంగ్‌లో చాలా ఏళ్లు గడిపిన బ్రూస్ లీ ఒక సమయంలో హాలీవుడ్‌ను ఏలారు. 1959లో బ్రూస్ లీ సీటెల్‌లో స్థిరపడ్డారు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ చదవుకున్నారు. ఆ తర్వాత వివాహం చేసుకుని, సిని కెరీర్ ను మొదలుపెట్టడం కోసం కాలిఫోర్నియా చేరుకున్నారు. అతను చైనాకు చెందినవాడు కావడం సినిమాలలో నటించడానికి ఆటంకంగా మారింది.
పదేళ్లు అమెరికాలో ప్రయత్నించినప్పటికీ కెరీర్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో 1971లో మళ్ళీ హాంకాంగ్ కి వెళ్ళిపోయారు. అక్కడే ‘ది బిగ్ బాస్’, ‘ఫస్ట్ ఆఫ్ ఫ్యూరీ’, ‘ది వే ఆఫ్ డ్రాగన్’ అనే 3 యాక్షన్ చిత్రాలతో విజయం సాధించారు. ది వే ఆఫ్ డ్రాగన్ మూవీకి కు బ్రూస్ లీ దర్శకుడుగా వ్యవహరించాడు. ఆ తరువాత ఆయన నటించిన మూవీ ఎంటర్ ది డ్రాగన్. ఈ మూవీ 1973 ఏప్రిల్ లో షూటింగ్ పూర్తయింది. అయితే మూవీకి డబ్బింగ్ చెప్పే సమయంలో బ్రూస్ లీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే హాస్పటల్ కి తరలించారు.
అప్పుడే సెరిబ్రల్ ఎడెమీ(మెదడువాపు) వ్యాధి అని తెలిసింది. అయితే ఆ వ్యాధి రావడానికి కారణం వైద్యులు చెప్పలేకపోయారు. బ్రూస్ లీ కోలుకుని తిరిగి సినిమాల్లో నటిస్తారని వైద్యులు హామీ ఇచ్చారు. 2 నెలల తర్వాత బ్రూస్ లీ ప్రేయసి బెట్టీ టింగ్ పెయి ఇంట్లో ఉన్న సమయంలో బ్రూస్ లీ స్పృహ తప్పారు. అలా బ్రూస్ లీ 1973 జులైలో తన 32 ఏళ్ల వయసులో ఈలోకాన్ని విడిచారు. బ్రూస్ లీ చనిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికి అంతుచిక్కలేదు. ఆయన మరణానికి కారణం పెయిన్ కిల్లర్లు ఎక్కువగా తీసుకోవడం అని అప్పట్లో డాక్టర్లు ప్రకటించారు.
Also Read: ఆ పిచ్చి వల్లే కళ్ళు చిదంబరం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారా? అసలు విషయం బయటపెట్టిన కొడుకు..!
End of Article