నిన్నటి తరం తెలుగు సినిమా ప్రేక్షకులకు కళ్ళు చిదంబరం సుపరిచితులు. ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించేవి. ఆయన పేరు కొల్లూరు చిదంబరం అయినప్పటికీ ఆయన “కళ్ళు” సినిమాతో ఎంట్రీ ఇవ్వడంతో అందరికి కళ్ళు చిదంబరంగానే గుర్తుండిపోయారు.

Video Advertisement

కొల్లూరు చిదంబరం ఆయన కళ్ళతోనే మనకి గుర్తుండిపోయారు. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆయనను “కళ్ళు” చిదంబరం గా పిలుస్తుంది. అంతే కాదు. ఆయన నటించిన కళ్ళు సినిమా ఆయనకీ మంచి గుర్తింపు ను తెచ్చింది.

kallu chidambaram 2

ఆయనకు ఈ సినిమాకి గాను రాష్ట్ర నంది స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నాడు. తెలుగు లో ఆయన నటించిన “అమ్మోరు” సినిమా కూడా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. చిదంబరం సినిమాల్లోకి వచ్చే ముందు ఆయన ఇంజనీర్ గా పనిచేసేవారట. ఆయన 2015 లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయన అనారోగ్య కారణాల వలెనే ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కళ్ళు చిదంబరం కుమారుడు ఆయన మరణం వెనకాల ఉన్న కారణాలను వివరించారు.

kallu chidambaram 3

సినిమాల్లోకి రాకముందు కళ్ళు చిదంబరం ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. అంతేకాక నాటకాలపై ఆసక్తి ఉండడంతో ఆయన నాటకాలలో కూడా నటించేవారు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు నాటకాలలో నటించడం కోసం కూడా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఉద్యోగం విజయవాడలో చేస్తూ.. మరోవైపు నాటకాల కోసం హైదరాబాద్, చెన్నై ల మధ్య ప్రయాణాలు చేసేవారు. సమయానికి సరైన నిద్ర ఉండేది కాదు. దీనితో ఆయన కంటికి ఓ నరం పక్కకి జరిగి మెల్లకన్నులా వచ్చింది.

kallu chidambaram 1

కళ్ళు చిదంబరానికి మొదట్లో మెల్లకన్ను ఉండేది కాదు. కానీ నాటకాలపై, సినిమాలపై ఉన్న ప్రేమ కారణంగా ఆయన ఆరోగ్యం మీదకు తెచ్చుకున్నారు. ఇక డాక్టర్లు కూడా ఇతర చికిత్స విధానాల ద్వారా మెల్లకన్నుని సరి చేసుకోవచ్చని చెప్పినప్పటికీ.. సినిమాల్లోకి వచ్చాక మెల్లకన్ను కలిసి వచ్చిందని.. కళ్ళు చిదంబరం చికిత్స చేయించుకోలేదు. ఆ తరువాత అనారోగ్యం కారణంగా ఆయన తుదిశ్వాస విడిచారు.

Watch Video: