Ads
జబర్దస్త్ కామెడీ షో తో చాలా మందికి పాపులారిటీ వచ్చింది. చాలా మంది ఆర్టిస్ట్ లు తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. అలా పాపులారిటీ తెచ్చుకున్న వారిలో బులెట్ భాస్కర్ కూడా ఒకరు. ఆయన మిమిక్రీతో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు.
Video Advertisement
ఆయన చాలా మంది ప్రముఖుల వాయిస్ ను ఇమిటేట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎక్కువగా మహేష్ బాబు వాయిస్ ను ఇమిటేట్ చేయడం అందరికి బాగా నచ్చుతుంది. మహేష్ బాబు వన్ సినిమాకు కూడా బులెట్ భాస్కర్ ట్రాక్ చెప్పారట. ఈ విషయం తెలుసుకుని మహేష్ బాబు కూడా ఆశ్చర్యపోయారట.
ఇప్పటివరకు మహేష్ బాబును కలవడం కుదరలేదు అని.. ఎప్పటికైనా ఆయనను కలుస్తాను అని చెప్పుకొచ్చారు. మహేష్ బాబు చేసే కొన్ని ప్రకటనలకు కూడా బులెట్ భాస్కర్ డబ్బింగ్ చెప్తారట. మహేష్ బాబు బిజీ గా ఉన్న సమయంలో ఆయన డబ్బింగ్ చెప్తూ ఉంటారట. దాదాపు చాలా మంది వాయిస్ ని ఇమిటేట్ చేయగలను కానీ, బ్రహ్మానందం వాయిస్ ని మాత్రం ఇమిటేట్ చేయలేనని బులెట్ భాస్కర్ చెప్పుకొచ్చారు.
End of Article