బస్ స్టాప్ హీరోయిన్ శ్రీదివ్య చెల్లి కూడా హీరోయినే..ఎవరో తెలుసా..!!

బస్ స్టాప్ హీరోయిన్ శ్రీదివ్య చెల్లి కూడా హీరోయినే..ఎవరో తెలుసా..!!

by Sunku Sravan

Ads

నటి శ్రీ దివ్య.. సీరియల్స్,మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించింది. ఋతురాగాలు, చక్రవాకం వంటి సీరియల్స్ లో మరియు యువరాజు,హనుమాన్ జంక్షన్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా లలో నటించింది. అలాగే ఈటీవీ లో ప్రసారమయ్యే తూర్పు వెళ్ళే రైలు సీరియల్ లో బుల్లితెర హీరోయిన్ గా పరిచయం అయ్యి,

Video Advertisement

ఆ తర్వాత సీరియల్స్ మానేసి 2010లో రవి బాబు గారు దర్శకత్వం వహించిన మనసారా సినిమా లో హీరోయిన్ గా నటించి వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. కానీ ఆ తర్వాత 2012 లో డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్ స్టాప్ మూవీ లో శైలు క్యారెక్టర్ లో నటించి మంచి పేరును తెచ్చుకుంది.

తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకు తెలుగులో అంత గుర్తింపు రాలేదు. దాంతో తమిళ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. తమిళంలో సినిమాల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అలాగే రానా, విశాల్ వంటి హీరోలతో తమిళ్ సినిమాల్లో నటించింది. అలాగే సైమా అవార్డును సైతం సొంతం చేసుకుంది. తమిళ్ తర్వాత మలయాళం సినిమాల్లో కూడా నటించింది శ్రీదివ్య.

అలాగే శ్రీ దివ్య వాళ్ళ చెల్లెలు శ్రీ రమ్య కలిసి కొన్ని సీరియల్స్ లో నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయినా శ్రీ రమ్య కూడా 1940 లో ఒక గ్రామం అనే సినిమా ద్వారా చాలా చిన్న వయసులోనే టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది. కానీ ఆ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి స్టడీస్ మీద కాన్సట్రేషన్ చేసింది శ్రీ రమ్య.


End of Article

You may also like