సొంత “దుస్తుల బ్రాండ్” తో పాటు… “మహేష్ బాబు” కి ఉన్న ఈ 5 వ్యాపారాలు ఏంటో తెలుసా..?

సొంత “దుస్తుల బ్రాండ్” తో పాటు… “మహేష్ బాబు” కి ఉన్న ఈ 5 వ్యాపారాలు ఏంటో తెలుసా..?

by kavitha

Ads

కాలంతో పాటుగా ట్రెండ్ మారుతూ వస్తోంది. సినీ ప్రముఖులు కూడా సినీరంగంలోనే కాక ఇతర రంగాల్లోను అడుగు పెడుతున్నారు. వివిద బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ కృష్ణ వారసుడు మహేష్ బాబు తొలి వరుసలో ఉంటాడు.

Video Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎల్లప్పుడూ సరికొత్తగా ఆలోచిస్తూ ఇటు సినిమాల్లోనూ అటు వ్యాపారంలోను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. టాలీవుడ్ లోనే కాక వ్యాపార రంగాల్లోనూ తనదైన ముద్రను వేస్తూ ఓ బ్రాండ్‌ను సృష్టించుకున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా, రాజకుమారుడిగా కెమెరా ముందుకి వచ్చి తన ప్రతిభతో ఒక్కొ మెట్టు ఎక్కి సూపర్‌స్టార్‌గా అభిమానులను ప్రేమను పొందుకుని, మహేష్ బాబు టాలీవుడ్ అగ్రనటుల్లో ఒకరిగా ఎదిగాడు.అక్కడితో ఆగకుండా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేయడం కోసం సతీమణి నమ్రత సహకారంతో వివిధ బిజినెస్ లను మొదలుపెట్టాడు. సూపర్ స్టార్ రియల్ బిజినెస్ మేన్ గా కూడా ప్రూవ్ చేసుకుంటున్నాడు. సినిమాల్లో సంపాదించిన డబ్బును బిజినెస్ లకు ఉపయోగిస్తూ, మిగతా వారికంటే వినూత్నంగా ముందుకెళ్తున్నాడు. ఇక మహేష్ వ్యాపారాలు ఏమిటో చూద్దాం..#1 జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్..

మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌజ్ స్థాపించి, దీనిపై భారీ బడ్జెట్‌తో మూవీస్ తీస్తున్నాడు.#2 ఏఎంబీ సినిమాస్..

మహేష్ ఏషియన్ సంస్థతో కలిసి AMB సినిమాస్ పేరుతో హైదరాబాద్‌లో భారీ మల్టీప్లెక్స్ థియేటర్‌ను మొదలుపెట్టాడు. ఈ AMB సినిమాస్ ఇండియాలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్‌లలో ఒకటిగా ఉంది.#3 ది హంబుల్ కో..

మహేష్ బాబు ‘ది హంబుల్ కో’పేరుతో గార్మెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతంది హంబుల్ కో బ్రాండ్ బట్టలకు మంచి డిమాండ్ ఉంది.#4 AN రెస్టారెంట్..

మహేష్ బాబు తాజాగా రెస్టారెంట్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టాడు. ఏషియన్ గ్రూప్స్ తో కలిసి AN రెస్టారెంట్ ను స్టార్ట్ చేస్తున్నాడు. ఇది డిసెంబర్ 8 నుండి అందుబాటులోకి వస్తుంది.ఈ రెస్టారెంట్ కు భార్య నమ్రతా పేరుని పెట్టాడు మహేష్. AN రెస్టారెంట్లో N అంటే నమ్రతా. ఇది బంజారా హిల్స్‌లో టీఆర్ఎస్ బిల్డింగ్ పక్కన ఉంది.

#5 ప్యాలెస్ హైట్స్

మహేష్ బాబు మినర్వా కాఫీ షాప్ తో కలిసి ప్యాలెస్ హైట్స్ అనే రెస్టారెంట్ కూడా మొదలు పెట్టబోతున్నాడు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా, బిజినెస్ ద్వారానే కాక యాడ్స్ లో నటిస్తూ కూడా సంపాదిస్తున్నాడు. ఇటీవల సర్కారీ వారి పాట మూవీతో సూపర్ హిట్ అందుకుని, ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తరువాత రాజమౌళి సినిమా మొదలవుతుంది.


End of Article

You may also like