Ads
తన అందం అభినయంతో కుర్రకారుని ఆకట్టుకున్న సమంత ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. మోడరన్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా.. మరో వైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా సమంత తన సత్తా చాటారు. ఇక, వెబ్ సిరీస్ ల రంగంలోకి కూడా అడుగు పెట్టిన సమంత అక్కడ కూడా తన సత్తా చాటారు.
Video Advertisement
ఇది కాకుండా.. సమంత వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నారు. ఈ విషయం చాలా మందికి తెలిసినదే. అయితే.. అందరు సమంత కేవలం సాకి క్లోత్స్ బిజినెస్ మాత్రమే చేస్తుందని అనుకుంటారు.
కానీ, అది ఒక్కటే కాకుండా.. సమంత చేసే వ్యాపారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం సినిమాల మీదే ఆధారపడకుండా.. తనకంటూ సొంతంగా సంపాదించుకునే విధంగా వ్యాపార రంగంలో కూడా అడుగు పెట్టింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతని ఆచరణలో పెట్టి చూపిస్తోంది సమంత.
#1. సాకి బిజినెస్ లో బాగానే లాభాలు సంపాదిస్తుంది సమంత.
#2.సమంతకి ఏకమ్ లెర్నింగ్ అనే స్కూల్ కూడా ఉంది. ఈ స్కూల్ నుంచి కూడా బాగానే లాభాలు వస్తున్నాయి.
#3. మరోవైపు ఓ అధికారిక ఆన్-లైన్ సైట్ లో కూడా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఈ రెండు వ్యాపారాలే కాకుండా సమంత మరో వ్యాపారం లోకి అడుగుపెట్టబోతోంది.
#4. కొత్తగా నగల వ్యాపారం కూడా ప్రారంభించాలని సమంత భావిస్తోందట. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏమైనా సమంత ముందుచూపుకి మెచ్చుకోవలసిందే. ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో కూడా తన సత్తా చాటుకుంటోంది.
End of Article