చాలా మందికి అసలు మంచం దిగాలని అనిపించదు. ఎప్పుడు చూసినా హ్యాపీగా మంచం ఎక్కేసి నిద్రపోతూ ఉంటారు. అయితే అటువంటి వాళ్ళు తప్పక ఈ ఉద్యోగం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే వారికి ఇష్టమైన పనితో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇక ఆ పని ఏమిటి అనేది చూస్తే.. మంచం మీద నిద్రపోవడం మాత్రమే. చాలా కొత్తగా ఉంది కదా..?, నమ్మాలా లేదా అని ఆలోచిస్తున్నారా…? అటువంటి ఉద్యోగాలు కూడా వున్నాయండి. మీరు ఆశ్చర్య పోవద్దు.

Video Advertisement

Sleeping on Bed

ఒక కంపెనీ మంచంపై పడుకుని టీవీ చూస్తే ఏకంగా లక్షల్లో శాలరీ ఇస్తానని చెబుతోంది. మరి దాని కోసం పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. యూకే కి చెందిన ‘క్రాఫ్ట్ బెడ్’ అనే కంపెనీ ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు చూసినా మంచం పై పడుకునే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ జాబ్. అయితే ఈ జాబ్ చేయాలంటే కొన్ని షరతులకు సరే అనాలి. అనుకున్నంత సులువు కాదు ఆ షరతుల్ని ఫాలో అవ్వడం.

Sleeping on Bed

ఈ ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు చేయాల్సిన పని ఏమిటో తెలుసా..? మంచం మీద పడుకొని టీవీని చూడటం. ఈ ఆఫర్ ని కంపెనీ ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అయ్యిపోతోంది. పైగా ఈ ఉద్యోగానికి ఎంపికైతే ఆ వ్యక్తికి ఏకంగా పాతిక లక్షల రూపాయలు జీతం కూడా ఇస్తానని అంది. ఉద్యోగి ఈ కంపెనీ లో పని చేయాలంటే వారానికి 37.5 గంటల సేపు మంచంపై పడుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా మనం నిద్రపోయే పరుపు వాడే దిండులో ఎలాంటి మార్పులు చేయాలి అనేది కూడా వివరిస్తూ ఉండాలి. ఉద్యోగులు ఆఫీసుకు కూడా వెళ్ళక్కర్లేదు. కేవలం ఇంట్లో ఉండే ఈ పని చేయొచ్చు. పైగా కంపెనీయే వాళ్లకి దిండు, పరుపు పంపిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ జాబ్ కొట్టేయొచ్చు.