ప్రస్తుతం ఉన్న సమస్యల మధ్య… ఈ “క్యారెక్టర్ ఆర్టిస్ట్” లని ఆపగలరా..?

ప్రస్తుతం ఉన్న సమస్యల మధ్య… ఈ “క్యారెక్టర్ ఆర్టిస్ట్” లని ఆపగలరా..?

by Mohana Priya

Ads

ఈ మధ్య రిలీజ్ అవుతున్న భారీ చిత్రాల కారణంగా హీరో హీరోయిన్లతో పాటు దర్శకుల రెమ్యూనరేషన్ కూడా ఆకాశాన్ని అంటుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.

Video Advertisement

సినిమాకి హీరో క్యారెక్టర్ ఎంత ముఖ్యమో క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అంతే ముఖ్యం. పెద్ద సినిమాలకైనా స్ట్రాంగ్ హీరో క్యారెక్టర్ సరిపోతుంది ఏమో కానీ చిన్న సినిమాలకు క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలా అవసరం. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్,రావు రమేష్ ,మురళీ శర్మ ,నరేష్ తదితరులు ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు.

చిత్రం బడ్జెట్ లిమిటెడ్ గా ఉన్న పాపులర్ నటీనటులను తీసుకోవాలని దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. ఈ నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ పారితోషకాలనీ అమాంతం పెంచుతూపోతున్నారు. ఒక పెద్ద సినిమా కోసం రాజేంద్ర ప్రసాద్ లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలంటే అయ్యే రెమ్యూనరేషన్ నిర్మాతకు చుక్కలు చూపిస్తుంది.ఇప్పుడు వీళ్ళు రోజువారీ పారితోషికాలు తీసుకుంటున్నారు…అది చాలదన్నట్టు ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి అయిదు ఆరుగురు మంది పర్సనల్ సిబ్బంది ఉంటారు.

6 murali sarma

షూటింగ్ జరిగినంత కాలం వాళ్ల జీత భత్యాలతో పాటు తిండి ఖర్చు రోజు వారి బేటా కూడా నిర్మాతలే భరించాల్సి వస్తుంది.దానితో షూటింగ్ ముగిసే సరికి క్యారెక్టర్ ఆర్టిస్టులకు కేటాయించిన బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ఫుల్గా నడిస్తే ఈ ఖర్చులన్నీ బ్యాలన్స్ అవుతున్నాయి కానీ ఊహించిన దానికి భిన్నంగా మూవీ ఫ్లాప్ అయితే మాత్రం నిర్మాతలు ఇటువంటి ఖర్చుల వల్లే సగం దివాలా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో క్యారెక్టర్ ఆర్టిస్టులు వల్ల పెరుగుతున్న ఇటువంటి ఖర్చులకు అడ్డుకట్ట వేయాలని నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు ఎలా పలుస్తాయో వేచి చూడాలి.


End of Article

You may also like