అందాల తార శ్రియ సరన్‌ అందరికీ సుపరిచితమే. ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటించి ఈ భామ బాగా పాపులర్ అయ్యింది.  కేవలం తెలుగు సినిమాలే కాకుండా శ్రియ ఒక ఇండో-కెనడియన్ సినిమా లో కూడా నటించింది. వాట్స్ కుకింగ్ స్టెల్లా అనే ఇండో కెనడియన్ సినిమాలో శ్రియ నటించింది.

Video Advertisement

ఒక ఏడాదిన్నర పాప ఆలనా పాలనా చూసుకునే అమ్మాయిగా నటించింది. టాలీవుడ్ లో అయితే శ్రియ చాలా మంది టాప్ హీరోల సరసన కూడా నటించింది.

చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు,ఎన్టీఆర్ ఇలా చాలా మంది టాప్ హీరోలతో శ్రియ సరన్‌ సినిమాలు చేసింది. ఆమె నటన కూడా బాగుంటుంది. ఇక ఫోటో లో ఉన్న చిన్నారి విషయానికి వస్తే..

ఈపాటికే మీకు ఈమె ఎవరో అర్ధం అయ్యే ఉంటుంది. ఈ చిన్నారి ఎవరో కాదు అందాల నటి శ్రియ సరన్. ఈ చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్ కింద ఎదిగింది. అద్భుతమైన ఫ్యాన్ బేస్ ని కూడా సొంతం చేసుకుంది. చిన్నప్పుడు తల్లి తనను ముద్దులాడుతున్న ఫోటో ఒకటి ఇక్కడ ఉంది. దానితో పాటుగా మరో పిక్ కూడా వుంది. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు కూడా.