అక్క హీరోయిన్, బావ స్టార్ హీరో… ఈ అమ్మాయి కూడా హీరోయిన్ గా నటించింది..! ఎవరో కనిపెట్టగలరా..?

అక్క హీరోయిన్, బావ స్టార్ హీరో… ఈ అమ్మాయి కూడా హీరోయిన్ గా నటించింది..! ఎవరో కనిపెట్టగలరా..?

by Harika

Ads

కొంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చి కొన్ని సినిమాలు చేసి అలా వెళ్ళిపోతారు. లేదా మధ్యలో బ్రేక్ తీసుకుంటారు. కానీ వాళ్ళు చేసిన సినిమాల వల్ల ప్రేక్షకులకి గుర్తుండిపోతారు. చాలా మంది హీరోయిన్లు ఒకటి, రెండు సినిమాలు చేసినా కూడా తెలుగు ప్రేక్షకులు వాళ్ళని ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు. ఈ అమ్మాయి కూడా అలాగే తెలుగులో కేవలం రెండు సినిమాల్లో మాత్రమే హీరోయిన్ గా నటించారు. అయినా కూడా అందరికీ బాగా సుపరిచితురాలు అయ్యారు. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు.

Video Advertisement

can you recognize this heroine

ఈ అమ్మాయి హీరోయిన్ గా నటించిన సినిమా ఇటీవల రీ-రిలీజ్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేసింది. బేబీ షామిలి. ఈ పేరుతో పరిచయం అయిన పాప అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా బేబీ షామిలి నటించారు. అప్పట్లో బేబీ షామిలి లేనిదే సినిమా ఉండేది కాదు. కేవలం బేబీ షామిలి ప్రధాన పాత్రలో చాలా సినిమాలు వచ్చాయి. మధ్యలో కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఓయ్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అప్పుడు సినిమా ఆశించిన ఫలితాన్ని పొందలేదు. అయినా కూడా షామిలి నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కొంత బ్రేక్ తీసుకొని అమ్మమ్మ గారి ఇల్లు సినిమాలో నటించారు. తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించారు.

ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. షామిలి అక్క షాలిని కూడా గతంలో హీరోయిన్ గా నటించారు. షాలిని భర్త అజిత్ తమిళ్ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద స్టార్ హీరో. తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. షాలిని, షామిలి అన్న రిచర్డ్ రిషి కూడా చాలా సినిమాల్లో హీరోగా నటించారు. షామిలి నటించిన చివరి సినిమా 2018 లో వచ్చిన అమ్మమ్మ గారి ఇల్లు సినిమా. ఈ సినిమా తర్వాత ఇప్పటి వరకు సినిమా చేయలేదు. అయితే సోషల్ మీడియాలో షామిలి చాలా యాక్టివ్ గా ఉంటారు. షామిలి ఒక మంచి ఆర్టిస్ట్. ఎన్నో పెయింటింగ్స్ కూడా వేస్తారు. అవన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

ALSO READ : ప్రేమలు సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు..?


End of Article

You may also like