Ads
సాధారణంగా సెలెబ్రిటీల ఫోటోలెప్పుడూ నెట్టింట్లో సందడి చేస్తూనే ఉంటాయి. అదే.. ఒకప్పుడు స్టార్ లుగా కొనసాగి.. తరువాత తెరకు దూరం అయిన వారి గురించి ఏ వార్త వచ్చినా ఆసక్తిగా చదివేస్తూ ఉంటాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అందాల తార ఫోటో వైరల్ అవుతోంది.
Video Advertisement
ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టడం కొంచం కష్టమే. ఎందుకంటే వయసురీత్యా ఆమె ముఖంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ, ఈమె ఎవరో చెబితే మాత్రం మీరు కచ్చితంగా ముక్కున వేలేసుకుంటారు.
ఈమె ఎవరో కాదు.. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోలతో స్క్రీన్ పంచుకున్న మీనాక్షి శేషాద్రి. పెళ్లి అయ్యాక ఈమె అమెరికాలో స్థిరపడింది. జార్ఖండ్ రాష్ట్రంలోని సింధిలో జన్మించిన మీనాక్షి అసలు పేరు శశికళ శేషాద్రి. ఈమె తమిళ కుటుంబానికి చెందినది. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిసి వంటి డాన్సులలో ఆమె రాణించింది.
ఆ తరువాత మోడల్ గా అవకాశాలు రావడంతో ఆ రంగంలో పైకి ఎదిగింది. ‘పెయింటర్ బాబు’ సినిమాతో బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసింది. రాజేష్ ఖన్నా, అమితాబ్, అనిల్ కపూర్ వంటి తారల సరసన నటించింది. టాలీవుడ్ లో కూడా చిరు సరసన ఆపద్భాంధవుడు సినిమాలో నటించింది. ఎన్టీఆర్, బాలయ్య కలిసి నటించిన విశ్వామిత్ర సినిమాలో కూడా మేనక పాత్రలో నటించింది. 1980-90ల కాలంలో ఆమె భారీ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా నిలిచింది. ప్రస్తుతం ఈమె ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు ఆమె వయసు 58 సంవత్సరాలు. అమెరికాలోనే ఉంటున్న ఆమె ఆసక్తి ఉన్నవారికి భారతీయ నాట్యాన్ని పరిచయం చేస్తున్నారు.
End of Article