బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసిపోయింది ఇందులో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. ఇక రన్నర్ గా ప్రముఖ బుల్లితెర నటుడు అమర్దీప్ నిలిచాడు. బిగ్ బాస్ అనంతరం అమర్దీప్ సొంత ఊరు అయిన అనంతపురం వెళ్ళాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురంలోనే ఉన్నాడు.
బిగ్ బాస్ లో ఉన్నంతవరకు తనకి సపోర్ట్ చేసిన అభిమానులకు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసి, వారితో కలిసి ఫోటోలు దిగాడు. అమర్దీప్ భార్య తేజస్విని కూడా ఆయన వెంట ఉన్నారు.
ఇకపోతే అనంతపురంలో అమర్ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక సేవ సంస్థతో కలిసి ఈయన ఎంతోమంది పేదవారికి, చిన్నపిల్లలకు ఉచితంగా దుప్పట్లను పంపిణీ చేయడమే కాకుండా వారికి అవసరమైనటువంటి వస్తువులను కూడా అందజేశారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పిల్లలతో కలిసి ఈయన కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం తర్వాత అమర్ మాట్లాడుతూ దేవుడు నాకు ఇచ్చిన దానిలో నా శక్తి మేర ఇతరులకు సహాయం చేస్తానని ఈయన తెలియజేశారు. అలాగే మీ అందరి ఆశీస్సులు దీవెనలు మాపై ఉండాలి అంటూ కూడా ఈ సందర్భంగా అమర్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బుల్లితెర సీరియల్ నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అమర్ బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు