సంక్రాంతి సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. వెంకటేష్ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. అసలు ఈ సినిమాకి వెంకటేష్ ఒక్కడే హీరో కాదు.. కథ, శ్రీకాంత్ పాత్ర, శివ బాలాజీ, శర్వానంద్ పాత్రలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే తెలుగు వారికి పండగ రోజులే. అయితే.. ప్రతిసారి సంక్రాతి పండగకి సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి.

అలా 2005 లో సంక్రాంతి కి వెంకటేష్ నటించిన “సంక్రాంతి ” సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా వెంకటేష్ సరసన స్నేహ నటించారు. వీరిద్దరి కాంబో కూడా అదిరిపోయింది. ముప్పలనేని శివ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. మొదటి తమ్ముడు గా నటించిన శ్రీకాంత్ కు జంట గా సంగీత నటించారు. వీరిద్దరి కాంబో లో వచ్చిన పాట కూడా అప్పట్లో దుమ్ము దులిపింది.

ఇప్పటికీ.. ఈ పాటను యు ట్యూబ్ లో వినే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. యు ట్యూబ్ లో కామెంట్లు కూడా దుమ్ము రేపుతున్నాయి. సంగీత గారి డాన్స్ పెర్ఫార్మన్స్ కి ఫాన్స్ కామెంట్స్ తో రచ్చ లేపుతున్నారు. ఈ కింద కామెంట్స్ చూస్తే ఆ విషయం అర్ధం అవుతోంది.

ఆ వీడియో ఒక లుక్ వేసుకోండి.!
Watch Video:




దాదాపు పదేళ్ళ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన మూవీ భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, తమన్నా హీరోహీరోయిన్లుగా నటించారు. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించగా, కీలక పాత్రలో యంగ్ హీరో సుశాంత్ నటించారు. ఈ మూవీ ఆగస్ట్ 11 న విడుదల అయ్యి, మొదటి షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీలోనీ సన్నివేశాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, మీమ్స్ క్రియేట్ చేస్తూ నెటిజెన్లు ఈ మూవీని, మెహర్ రమేష్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
సినిమా పోయి మేకర్స్ దగ్గర నుండి అభిమానుల వరకు బాధలో ఉంటే, మరో వైపు ఈ మూవీ ప్లాప్ అవడం కూడా మంచిదే అని కొందరు అంటున్నారు. ఇది అన్నది సినీ ప్రేక్షకులు కాదు, టీమిండియా అభిమానులు. అలా అనడానికి కారణం ఏమిటంటే, 2011లో మెహర్ రమేశ్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తీసిన ‘శక్తి’ మూవీ రిలీజ్ అయ్యి, డిజాస్టర్ గా నిలిచింది. అయితే అదే ఏడాది ధోనీ సేన వన్డే ప్రపంచ కప్ ను సాధించింది. ఇది భారత్ గెలిచిన రెండవ ప్రపంచ కప్.
ఆ తరువాత 2013లో మెహర్ రమేష్ వెంకటేశ్ హీరోగా తీసిన ‘షాడో’ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయితే అదే ఏడాది భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని సాధించింది. ఇక ఈ ఏడాది కూడా ప్రపంచ కప్ జరగనుంది. మెహర్ రమేశ్ తీసిన భోళా శంకర్ మూవీ ప్లాప్ అవడం అటు చిరంజీవికి, ఇటు మెగా ఫ్యాన్స్‌కు ఊహించని విధంగా షాకిచ్చింది. మెహర్ రమేష్ ప్లాప్ సెంటిమెంట్ కొనసాగితే, ఈ ఏడాది కూడా ప్రపంచ కప్ ఇండియాదే అని టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
జైలర్ మూవీలో రజినీకాంత్ లీడ్ రోల్ లో నటించగా ఆయన భార్యగా ఈ మూవీలో రమ్యకృష్ణ నటించింది. తమన్నా, వసంత్ రవి, వినాయకన్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం మూడు రోజుల్లో 200 కోట్ల వసూలు చేసినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్ అందుకున్నాడు. గత 10 ఏళ్ల కాలంలో రజనీకాంత్ సినిమాలు ఆశించిన సక్సెస్ అందుకోలేదు. జైలర్ మూవీతో అన్ని చోట్ల మంచి వసూళ్లను సాధిస్తోందని చెప్పవచ్చు.
జైలర్ మూవీ విజయంలో క్యామియో రోల్స్ కీలక పాత్ర పోషించాయనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిలో ముఖ్యంగా శివ రాజ్ కుమార్ పాత్ర హైలెట్ గా నిలిచింది. నరసింహా అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించి, థియేటర్లను షేక్ చేశారు. చాలామందికి, ఇతర రాష్ట్రాలవారికి ఆయన అంతగా తెలియకపోవచ్చు. శివ రాజ్ కుమార్ శాండల్ వుడ్ లో పెద్ద స్టార్. ఈ మూవీ తరువాత ఆయన గురించి ఆన్ లైన్ లో వెతుకుతున్నారు.
ఆయన మూవీలో కనిపించింది కొన్ని నిముషాలు అయినా, ఆయన పంచెకట్టుతో కనిపించి, ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఆయన రోల్ కు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ వచ్చిందంటే, మూవీలో ఆయన వాడిన ఒక టిష్యూ కూడా పాపులర్ అయ్యింది. ఈ మూవీలో శివ రాజ్ కుమార్ ఓరిగామి అనే టిష్యూను ఉపయోగించారు. ఆ సీన్ తర్వాత ఈ టిష్యూలు కూడా విపరీతంగా ఫేమస్ అయిపోయాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తమిళంలో హిట్ అయిన వేదళం మూవీ రీమేక్ గా భోళా శంకర్ మూవీని మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించారు. ఈ మూవీలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ నటించారు. ఆగస్ట్ 11 న రిలీజ్ అయిన ఈమూవీ ఫస్ట్ షోతోనే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ మూవీని విమర్శిస్తూ నెట్టింట్లో ట్రోల్స్ వస్తున్నాయి. కలెక్షన్స్ కు కూడా దారుణంగా ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. 
ఈ హీరో ఎవరో కాదు, హీరో రాజశేఖర్. ఆ హీరోయిన్ ఆయన సతీమణి జీవిత. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, తన మూవీలో హీరోయిన్ గా జీవితను వద్దని, మార్చమని చెప్పినందుకు, ఆ మూవీ నుండి హీరోగా రాజశేఖర్ ని తొలగించి, వేరే హీరోతో మూవీని తీసారంట. ఇది వీరు పెళ్లి చేసుకోకముందు జరిగిన ఇన్సిడెంట్. రాజశేఖర్ సినిమాలలోకి వచ్చేసరికి జీవిత హీరోయిన్ గా నటిస్తోంది.
రాజశేఖర్ కెరీర్ మొదట్లో తాను హీరోగా నటించే ఒక సినిమాలో హీరోయిన్ గా జీవితను తీసుకున్నారట. ఆ షూటింగ్ లో ఆమెను మొదటిసారి చూసిన రాజశేఖర్ ఈమె హీరోయినా అనుకున్నారంట. మూవీ షూటింగ్ లో జీవిత జ్వరం వచ్చి పడిపోగా, అప్పటికే డాక్టర్ అయిన రాజశేఖర్ ఆమెకు ట్రీట్మెంట్ చేసి, కోలుకున్నాక ఇంటికి పంపించారంట. ఆమె వెళ్లిపోయాక దర్శకుడితో ఈమెను ఎలా హీరోయిన్ గా ఎంపిక చేశారు. నాకు అయితే నచ్చలేదు. మార్చితే మంచిది అని చెప్పారంట.
అప్పుడు ఆ డైరెక్టర్ కూడా మార్చితే మంచిది అన్నారట. కానీ జీవితను కాకుండా రాజశేఖర్ ను మార్చి , హీరో సురేష్ తో మూవీ పూర్తి చేశారంట. ఆ తరువాత కాలంలో జీవిత, రాజశేఖర్ కలిసి పలు సినిమాలలో నటించారు.ఇక వీరిద్దరూ నటిస్తున్న సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి ఇద్దరు కుమార్తెలు. వీరు కూడా హీరోయిన్లుగా పలు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రశాంత్ తండ్రి ప్రముఖ కోలీవుడ్ నటుడు మరియు దర్శకుడు త్యాగరాజన్. తండ్రి దారిలోనే ప్రశాంత్ 17 ఏళ్ల వయసులోనే ‘వైగాసి పోరంతచ్చు’ అనే తమిళ మూవీ ద్వారా ఇండస్ట్రీలో కెరీర్‌ను మొదలుపెట్టాడు. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, విజయ్ లాంటి వారు అప్పుడప్పుడే కెరీర్లో గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే కోలీవుడ్ లో స్టార్ హీరోగా ప్రశాంత్ రాణించాడు. ఆయన కెరిర్ భారీ హిట్లతో దూసుకుపోతున్న టైమ్ లో ప్రశాంత్ కి తన భార్యతో వచ్చిన వివాదాలు, ఆ తరువాత వచ్చిన వరుస పరాజయాలతో స్టార్ స్టేటస్ ను కోల్పోయాడు.
ప్రశాంత్ గురించి తాజాగా కోలీవుడ్ సినీ విశ్లేషకుడు కాంతరాజ్ పలు విషయాలను చెప్పుకొచ్చారు. సినీ రంగంలో దశాబ్దానికి ఒకసారి మార్పులు జరుగుతాయి. వాటి వల్ల కొందరు మాత్రమే రాణిస్తూ ముందుకెళతారు. ప్రశాంత్ ప్రస్తుతం ‘అంధాగన్’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఆ మూవీకి అతని తండ్రి త్యాగరాజ్ దర్శకుడు.
ఇక ఈ మూవీ తరువాత అతని నటనకు స్వస్తి చెప్పి, వేరే ఏదైనా చేయడం మంచిదని అన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదని, అలాగే సినిమాలు మారిపోయాయి. వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యల వల్లే ప్రశాంత్ కెరీర్ పోయిందని, దాంతో సినిమాలకు దూరంగా ఉన్నాడని పేర్కొన్నాడు.
2005లో ప్రశాంత్‌కి బిజినెస్ మెన్ కూతురు గృహలక్ష్మితో వివాహం జరుగగా, వారికి ఒక కుమారుడు జన్మించాడు. కానీ కొన్ని రోజుల్లోనే ఇద్దరి మధ్య సమస్యలు రావడంతో3 ఏళ్ల తర్వాత విడిపోయారు. ఆ తరువాత గృహలక్ష్మి పుట్టింటికి వెళ్లి అక్కడే పాపకు జన్మనిచ్చింది. ప్రశాంత్ పాపను చూడడం కోసం వారి ఇంటికి వెళ్లినా రానివ్వలేదని తెలుస్తోంది. తన భార్య కోసం ప్రశాంత్ కోర్టుకు వెళ్ళాడు. అయితే అప్పుడే నారాయణన్ అనే వ్యక్తి గృహలక్ష్మిని ప్రశాంత్ కన్నా ముందే వివాహం చేసుకున్నానని వచ్చాడు.
అతను తమ పెళ్లి 1998లో జరిగిందని వాదించడంతో ప్రశాంత్ డైవర్స్ కు దరఖాస్తు చేయడం, కొన్నిరోజులకే విడాకులు రావడం జరిగిందని సమాచారం. ప్రశాంత్ తన కూతురుని తనతో ఉండానివ్వాలని కోరగా, దానికి కోర్టు అంగీకరించలేదు. ఇక ఈ విడాకుల టైమ్ లో ఆరోపణలు, ప్రత్యారోపణలు బయటికి రావడంతో ప్రశాంత్ కున్న ఇమేజ్ అంతా పోయింది. అలా ఆయన సినిమాలకు దూరమయ్యాడు. టాలీవుడ్ లో రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ మూవీలో రామ్ చరణ్‌కు అన్నగా ప్రశాంత్ నటించాడు.




























2.దిలీప్ కుమార్
3.దేవ్ ఆనంద్
4.రాజ్ కుమార్
5.జానీ వాకర్
6.బాల్‌రాజ్ సాహ్ని
7.అమోల్ పాలేకర్
8.అమ్రిష్ పూరి
9.శివాజీ సతమ్