సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో “రాజశేఖర్ – జీవిత” మధ్య జరిగిన ఈ సంఘటన తెలుసా..? కానీ ట్విస్ట్ ఏంటంటే..?

సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో “రాజశేఖర్ – జీవిత” మధ్య జరిగిన ఈ సంఘటన తెలుసా..? కానీ ట్విస్ట్ ఏంటంటే..?

by kavitha

Ads

సినీ పరిశ్రమలో దర్శకులు హీరోలను ఖరారు చేసుకున్న తరువాతే హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారు. ఒకవేళ మార్చాల్సి వస్తే సినిమా నుండి హీరోయిన్స్ ను తేలికగా మార్చేస్తుంటారు. కానీ హీరోని మాత్రం మార్చరు. హీరో సదరు హీరోయిన్ ను ఒకే చేస్తేనే, ఫిక్స్ చేస్తారు. లేదు అంటే ఆమెను మార్చి మరో హీరోయిన్ తీసుకుంటుంటారు.

Video Advertisement

ఇది సాధారణంగా ఇండస్ట్రీలో జరిగే విషయమే. ఈ విధంగా ఎన్నోసార్లు ఎంతోమంది విషయంలో జరుగగా, కొంత మంది హీరోయిన్లు ఆ విషయాన్ని చెప్పి, బాధ పడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఒక హీరోయిన్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరిగి, సదరు హీరోనే తొలగించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. hero-rajashekarఈ హీరో ఎవరో కాదు, హీరో రాజశేఖర్. ఆ హీరోయిన్ ఆయన సతీమణి జీవిత. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, తన మూవీలో హీరోయిన్ గా జీవితను వద్దని, మార్చమని చెప్పినందుకు, ఆ మూవీ నుండి హీరోగా రాజశేఖర్ ని తొలగించి, వేరే హీరోతో మూవీని తీసారంట. ఇది వీరు పెళ్లి చేసుకోకముందు జరిగిన ఇన్సిడెంట్. రాజశేఖర్ సినిమాలలోకి వచ్చేసరికి జీవిత హీరోయిన్ గా నటిస్తోంది.
jeevitha-rajasekharరాజశేఖర్ కెరీర్ మొదట్లో తాను హీరోగా నటించే ఒక సినిమాలో హీరోయిన్ గా జీవితను తీసుకున్నారట. ఆ షూటింగ్ లో ఆమెను మొదటిసారి చూసిన రాజశేఖర్ ఈమె హీరోయినా అనుకున్నారంట. మూవీ షూటింగ్ లో జీవిత జ్వరం వచ్చి పడిపోగా, అప్పటికే డాక్టర్ అయిన రాజశేఖర్ ఆమెకు ట్రీట్మెంట్ చేసి, కోలుకున్నాక ఇంటికి పంపించారంట. ఆమె వెళ్లిపోయాక దర్శకుడితో ఈమెను ఎలా హీరోయిన్ గా ఎంపిక చేశారు. నాకు అయితే నచ్చలేదు. మార్చితే మంచిది అని చెప్పారంట. అప్పుడు ఆ డైరెక్టర్ కూడా మార్చితే మంచిది అన్నారట. కానీ జీవితను కాకుండా రాజశేఖర్ ను మార్చి , హీరో సురేష్ తో మూవీ పూర్తి చేశారంట. ఆ తరువాత కాలంలో జీవిత, రాజశేఖర్ కలిసి పలు సినిమాలలో నటించారు.ఇక వీరిద్దరూ నటిస్తున్న సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకి ఇద్దరు కుమార్తెలు. వీరు కూడా హీరోయిన్లుగా పలు సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.

https://www.instagram.com/reel/Cv4fuAGJvm9/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: సినిమాల్లో ఒక వెలుగు వెలిగి… ఆ తర్వాత ఎందుకు వెనుకబడ్డాడు..! దాని వెనుక ఇంత విషాదం దాగి ఉందా..?


End of Article

You may also like