మహేష్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో లేటెస్ట్గా వస్తున్న గుంటూరు కారం చిత్రం ప్రస్తుతం పలు వివాదాలతో ఎప్పుడు వార్తల్లో వైరల్ అవుతుంది. అయితే వీళ్ళిద్దరి సినిమాకి ఇది కొత్తేమీ కాదు అని విశ్లేషకులు అంటున్నారు.
ఇంతకుముందు మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన రెండు చిత్రాలు కూడా షూటింగ్ విషయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి.

అతడు సినిమా ప్రొడ్యూసర్ లో ఒకరైన మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో ఈ చిత్రం షూటింగ్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఎటువంటి లోపం లేదని ,మామూలుగా తాము చేసే ఏ చిత్రాలైన మూడు లేక ఆరు నెలల నిడివి కాలంలో విడుదలకు సిద్ధంగా ఉండేవని మురళీమోహన్ ఈ సందర్భంగా అన్నారు.సరియైన ప్లానింగ్ లేకపోవడం కారణంగానే చిత్రం షూటింగ్ బాగా డిలే అయిందని మురళీమోహన్ చెప్పకనే చెప్పారు.

త్రివిక్రమ్ మహేష్ కాంబోలో వచ్చిన మరో చిత్రం ఖలేజా గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మహేష్ షూటింగ్ రెగ్యులర్ గా జరగకపోవడమే చిత్రం డిలే కి కారణం అని పేర్కొన్నారు. ఒక షెడ్యూల్ కి ఇంకో షెడ్యూల్ కి మధ్యలో కనీసం నాలుగు నుంచి ఐదు నెలల గ్యాప్ వచ్చేదని…ఇలాంటి కారణాల కారణంగా షూటింగ్ డిలే అయిందని మహేష్ అన్నారు.

అతడు సినిమా పూర్తి చేయడానికి త్రివిక్రమ్ రెండు సంవత్సరాల సమయాన్ని తీసుకుంటే.. ఖలేజాకు ఏకంగా మూడు సంవత్సరాల టైం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు గుంటూరు కారం పరిస్థితి ఏమిటో అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మహేష్ లైన్ అప్ లో వరుస ప్రాజెక్టులో ఉన్న ఈ సమయంలో త్రివిక్రమ్ లేట్ చేస్తే అతను రిస్కు తీసుకుంటాడా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
watch video :
https://twitter.com/Chandan_radoo/status/1683014035514753024
ALSO READ : ఒకప్పటి హీరోయిన్ “రీమా సేన్” ని చూశారా..? ఇలా మారిపోయారేంటి..?



తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమాతో రీమా సేన్ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టారు. 2000 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ తరువాత వరుస అవకాశాలు రావడంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారారు. తెలుగులో నటిస్తూనే గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘మిన్నలే’ అనే మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తెలుగులో ‘చెలి’ పేరుతో రిలీజ్ అయ్యింది.
ఈ మూవీ హిట్ అవడంతో కోలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసింది. హిందీలో కూడా పలు సినిమాలు చేసింది. వల్లభ, యుగానికి ఒక్కడు వంటి సినిమాలలో నెగెటివ్ పాత్రల్లో నటించి, విమర్శకుల ప్రశంసలతో పాటు, అవార్డ్స్ అందుకున్నారు. ఆమె 2012లో ఢిల్లీ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్‌ను పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2013 లో ఈ రీమాసేన్ బాబుకు జన్మనిచ్చింది. అతని పేరు రుధ్రవీర్.
రీమాసేన్ సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ, ఆమె ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో తరచుగా అభిమనులతో పంచుకుంటుంది. ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అదేవిధంగా, రీమాసేన్ తన భర్త, కుమారుడు మరియు స్నేహితులతో గడిపిన స్నాప్షాట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.















ప్రభాస్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ టైటిల్ ప్రకటనకు ముందు చిత్ర యూనిట్ ‘ప్రాజెక్ట్ – K’ అంటే ఏంటి? అని ఆడియెన్స్ కి పజిల్ విసిరింది. దాంతో K అంటే కల్కి, కాలచక్ర, కలియుగ్ అంటూ పలు పేర్లు వినిపించాయి. కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ – K లో K అంటే కల్కి అని, మూవీ టైటిల్ ను ‘కల్కి 2898 ఏడీ’ అని ప్రకటించారు. ఈ గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
‘లోకం అంతా చీకటిలో కూరుకుపోయినప్పుడు, ఆ చీకటిని, అందుకు కారణం అయిన వారిని పారదోలడానికి ఒక శక్తి ఉదయిస్తుందని, ఆ శక్తి కథనే ‘కల్కి’ అని క్లుప్తంగా గ్లింప్స్ తెలియజేశారు. దీంతో ప్రభాస్ శ్రీమహావిష్ణువు అవతారాలలో పదవ అవతారమైన ‘కల్కి’ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ప్రభాస్ కన్నా ముందుగా తెలుగులో మరో హీరో ‘కల్కి’ గా నటించాడు. ఆ హీరో మరెవరో కాదు. రైటర్ కమ్ డైరెక్టర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్.
అడివి శేష్ మొదటి మూవీ ‘సొంతం’. అందులో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తరువాత తానే రచయితగా, దర్శకుడిగా మారి తానే హీరోగా ‘కర్మ’ అనే చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రం 2010లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ‘దేవ్’ అనే పాత్రలో నటించిన శేషు, మూవీ మొదట్లోనే ఎండింగ్ ను ఊహించి చెప్తాడు. సరైన ప్రమోషన్ లేకపోవడంతో ఆడియెన్స్ కి ఈ మూవీ గురించి పెద్దగా తెలియలేదు. 13 సంవత్సరాల క్రితమే అడివి శేష్ ‘కల్కి’గా నటించాడు.











ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. యూట్యూబ్ స్టార్‌గా పాపులర్ అయిన వైష్ణవి ఈ మూవీలో తన నటనలోని మరో కోణాన్ని తెరపై ఆవిష్కరించింది. వైష్ణవి నటనకు యువత ఎంతగా కనెక్ట్ అయ్యారంటే, మూవీ చూసిన వారు ఆమె క్యారెక్టర్ ని దారుణంగా తిడుతున్నారు. అద్భుతమైన నటనతో ఆనంద్ దేవరకొండ ఆడియెన్స్ కి కన్నీళ్లు తెప్పించాడు.
వీరిద్దరికీ కొంచెం కూడా తగ్గకుండా విరాజ్ అశ్విన్ తన నటనతో మెప్పించాడు. దాంతో 2 రోజులకే బ్రేక్ ఈవెన్ అయ్యి, ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి రూ.23.07 కోట్లు షేర్ ను సాధించింది. బ్రేక్ ఈవెన్ అవడమే కాకుండా ఈ మూవీ రూ.16.87 కోట్ల లాభాలను రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా అయ్యింది. ఇంతగా ఆకట్టుకున్న వీరికి ఇచ్చిన పారితోషికం గురించి తెలిసి, ఇంత తక్కువా? అని నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు.
దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో బేబీ మూవీని తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండకు దాదాపు రూ.80 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. హీరోయిన వైష్ణవికి రూ.30 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్‌గా ఇచ్చారని, ఇక విరాజ్ అశ్విన్‌కు కేవలం రూ.20 లక్షలు ఇచ్చారని నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. అయితే డైరెక్టర్ సాయి రాజేష్ కోటికి పైగా తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
1. పోకిరి:
2. అ మూవీ:
3. రంగస్థలం:
4. బాహుబలి: ద బిగినింగ్:
5. అనుకోకుండా ఒక రోజు:
6. క్షణం:
7. గూఢచారి:
8. కేర్ అఫ్ కంచెరపాలెం:
9. కుమారి 21F:
10. ప్రస్థానం:
11. మిస్సమ్మ:
12. నేనొక్కడినే:
13. జెంటిల్ మెన్: