చాలామందికి ఎప్పుడూ కూడా మొదటిసారి వచ్చిన సంపాదన అంటే లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్ ఉంటుంది. దీనికి ఎక్కడలేని ప్రత్యేకత ఉంటుందని భావిస్తారు కాబట్టి దీన్ని ఎలా ఖర్చు పెడతామన్న విషయంపై కూడా ఎంతో ఆలోచించి చేస్తారు. ఇది కేవలం మనకే కాదు సినీ స్టార్స్ కూడా ఎంతో ముఖ్యం.
తాము సైన్ చేసిన ఫస్ట్ మూవీతో వచ్చిన ఇన్కమ్ వాళ్ళు ఎలా ఖర్చు పెడతారు అన్న క్యూరియాసిటి చాలామందికి ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా అలాంటి ఒక విషయమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుర్తు చేసుకోవడం జరిగింది.

కోట్ల ఆస్తికి అధిపతి అయినా.,.మెగాస్టార్ కొడుకు అయినా తన ఫస్ట్ సంపాదన అంటే ఎంతో ప్రత్యేకమని రామ్ చరణ్ చెప్పడం జరిగింది. అందరికీ తెలిసి రామ్ చరణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి చిత్రం చిరుత…మొదటి సినిమాలోనే తన పవర్ చూపించి సినిమాను సూపర్ డూపర్ హిట్ గా నిలబెట్టాడు రామ్. స్టైల్ మరియు మాస్ కాంబినేషన్ లో రామ్ లుక్స్ ఈ మూవీలో ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

ఫస్ట్ మూవీ కావడంతో దీనికోసం అతను బాగా కష్టపడ్డాడట. ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని 100 కోట్లకు పైగా రమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగాడు. అయినా ఇప్పటికీ తన ఫస్ట్ ఇన్కమ్ ఎంతో ఇంపార్టెంట్ అని రామ్ చరణ్ పేర్కొన్నారు. మొదటినుంచి వాచెస్ అంటే ఎంతో ఇష్టమైన రామ్ చరణ్ తన ఫస్ట్ ఇన్కమ్ తో ఇష్టమైన వాచ్ ని కొనడం జరిగిందట.
ALSO READ : “ప్రభాస్” నటిస్తున్న” కల్కి 2989 AD” స్టోరీ ఇదేనా..?

‘బేబీ’ మూవీ ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ కల్ట్ లవ్ స్టోరీ కి యూత్ బాగా కనెక్ట్ అవడంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ హిట్ అవడంతో చాలా మంది నటీనటులు వెలుగులోకి వచ్చారు. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్యకు మంచిపేరు వచ్చింది. కీలక పాత్రలో నటించిన విరాజ్ అశ్విన్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ స్నేహితులుగా నటించినవారికి కూడా మంచి గుర్తింపు లభించింది.
ఈ మూవీతో సాయి రాజేశ్ దర్శకుడిగా మరో మెట్టు ఎక్కారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ తల్లి పాత్రలో నటించిన నటి కూడా చాలా బాగా చేశారనే పేరు వచ్చింది. ఆమె పేరు ప్రభావతి వర్మ. ఎన్నో సినిమాలలో నటించిన ఆమెకు ఈ మూవీతో గుర్తింపు లభించింది. మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీలో హీరోయిన్ తల్లిగా నటించింది.
ఇటీవల జరిగిన బేబీ సక్సెస్ మీట్ లో ప్రభావతి వర్మ మాట్లాడుతూ తాను ఇండస్ట్రీకి వచ్చి 22 సంవత్సరాలు అయినట్లు తెలిపారు. ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలు చేసినప్పటికీ ఈ మూవీలో నటించిన తల్లి పాత్ర చాలా స్పెషల్ అని అన్నారు. ఎందుకంటే ఈ మూవీ ద్వారా ఆనంద్ తనకు కొడుకుగా లభించాడని, అది ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ప్రభావతి వర్మ వెల్లడించారు.




తేజ దర్శకత్వం వహించిన చిత్రం సినిమాతో రీమా సేన్ తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టారు. 2000 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీలో ఉదయ్ కిరణ్, రీమా సేన్ జంటగా నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఆ తరువాత వరుస అవకాశాలు రావడంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారారు. తెలుగులో నటిస్తూనే గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘మిన్నలే’ అనే మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ తెలుగులో ‘చెలి’ పేరుతో రిలీజ్ అయ్యింది.
ఈ మూవీ హిట్ అవడంతో కోలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేసింది. హిందీలో కూడా పలు సినిమాలు చేసింది. వల్లభ, యుగానికి ఒక్కడు వంటి సినిమాలలో నెగెటివ్ పాత్రల్లో నటించి, విమర్శకుల ప్రశంసలతో పాటు, అవార్డ్స్ అందుకున్నారు. ఆమె 2012లో ఢిల్లీ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ను పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2013 లో ఈ రీమాసేన్ బాబుకు జన్మనిచ్చింది. అతని పేరు రుధ్రవీర్.
రీమాసేన్ సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ, ఆమె ఫ్యామిలీ ఫోటోలను సోషల్ మీడియాలో తరచుగా అభిమనులతో పంచుకుంటుంది. ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అదేవిధంగా, రీమాసేన్ తన భర్త, కుమారుడు మరియు స్నేహితులతో గడిపిన స్నాప్షాట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.















ప్రభాస్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ టైటిల్ ప్రకటనకు ముందు చిత్ర యూనిట్ ‘ప్రాజెక్ట్ – K’ అంటే ఏంటి? అని ఆడియెన్స్ కి పజిల్ విసిరింది. దాంతో K అంటే కల్కి, కాలచక్ర, కలియుగ్ అంటూ పలు పేర్లు వినిపించాయి. కామిక్ కాన్ ఈవెంట్లో ప్రాజెక్ట్ – K లో K అంటే కల్కి అని, మూవీ టైటిల్ ను ‘కల్కి 2898 ఏడీ’ అని ప్రకటించారు. ఈ గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
‘లోకం అంతా చీకటిలో కూరుకుపోయినప్పుడు, ఆ చీకటిని, అందుకు కారణం అయిన వారిని పారదోలడానికి ఒక శక్తి ఉదయిస్తుందని, ఆ శక్తి కథనే ‘కల్కి’ అని క్లుప్తంగా గ్లింప్స్ తెలియజేశారు. దీంతో ప్రభాస్ శ్రీమహావిష్ణువు అవతారాలలో పదవ అవతారమైన ‘కల్కి’ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అయితే ప్రభాస్ కన్నా ముందుగా తెలుగులో మరో హీరో ‘కల్కి’ గా నటించాడు. ఆ హీరో మరెవరో కాదు. రైటర్ కమ్ డైరెక్టర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్.
అడివి శేష్ మొదటి మూవీ ‘సొంతం’. అందులో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తరువాత తానే రచయితగా, దర్శకుడిగా మారి తానే హీరోగా ‘కర్మ’ అనే చిత్రాన్ని తీశాడు. ఈ చిత్రం 2010లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ‘దేవ్’ అనే పాత్రలో నటించిన శేషు, మూవీ మొదట్లోనే ఎండింగ్ ను ఊహించి చెప్తాడు. సరైన ప్రమోషన్ లేకపోవడంతో ఆడియెన్స్ కి ఈ మూవీ గురించి పెద్దగా తెలియలేదు. 13 సంవత్సరాల క్రితమే అడివి శేష్ ‘కల్కి’గా నటించాడు.










