హాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ సినిమాలలో ‘ఓపెన్‌హైమర్’ ఒకటి. ఈ చిత్రం పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని హాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత క్రిస్టోఫర్ నోలన్ రూపొందించాడు. ఈ మూవీ తొలిసారి అణు బాంబును సృష్టించిన శాస్త్రవేత్త రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.
‘ఓపెన్‌హైమర్’ మూవీ జులై 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన చిత్రం కావడం, సైంటిస్ట్ రాబర్ట్ ఓపెన్ హైమర్ కథతో రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమా పై అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఉన్నాయి.
హాలీవుడ్లో మాత్రమే కాకుండా ప్రపంచమంతా మెచ్చే దర్శకులలో క్రిస్టఫర్ నోలాన్ ఒకరు. క్రిస్టఫర్ తీసిన ప్రతి చిత్రం కూడా అద్భుతమే. ఆయన గతంలో ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లార్, ద ప్రిస్టిజ్, టెనెట్, డార్క్ నైట్ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. చివరగా 2020లో ‘టెనెట్’ అనే సినిమాతో ఆడియెన్స్ ని పలకరించిన క్రిస్టఫర్, మూడు సంవత్సరాల తరువాత ఈ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు.
‘ఓపెన్‌హైమర్’ మూవీ కేవలం అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా విపరీతమైన బజ్ ఏర్పడింది. ఈ మూవీ అంతా అణుబాంబు కాన్సెప్ట్ చుట్టునే తిరుగుతుందని తెలుస్తోంది. దానివల్లే ఈ చిత్రం పై అంచనాలు రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. బుక్ మై షోలో ఇప్పటి దాకా ఈ మూవీ పై లక్షన్నర మంది ఇంట్రెస్ట్ కనబర్చినట్టుగా తెలుస్తోంది. ఒక మూవీ పై రిలీజ్ కు ముందు ఇంత ఆసక్తి చూపించడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.
ఈ మూవీ రిలీజ్ కు ఇంకా 3 వారాలు ఉంది. అయితే ఇప్పటికే బుక్ మై షో లో లక్షన్నర మంది ఈ సినిమా పై ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ఇక మూవీ రిలీజ్ టై కు ఈ సంఖ్య 3 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఈ రేంజ్ లో ఇండియాలో ఈ మూవీ పై ఆసక్తి ఉండటంతో ఈ మూవీకి భారీగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: ఏజెంట్ OTT రిలీజ్ ఎందుకు ఆలస్యం అవుతోంది..? కారణం ఇదేనా..?

సూపర్‌స్టార్ మహేష్‌బాబు మేమ్ ఫేమస్ మూవీ విడుదల కాకముందే ఈ చిత్రాన్ని చూసి, పాజిటివ్ రివ్యూ పెట్టారు. డైరెక్టర్ రాజమౌళి ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ రివ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేష్, రాజమౌళి ఇద్దరూ కూడా ఈ సినిమాని ప్రశంసించారు. అది ఆ సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలో విడుదల అయ్యింది. ఈ మూవీ చూసిన వారు మహేష్ బాబు, రాజమౌళిల పై కామెంట్స్, ట్రోల్ చేస్తున్నారు.
‘మేమ్ ఫేమస్’ మూవీని ఓటీటీలో చూసినవారు ఈ చిత్రానికి మహేష్ బాబు, రాజమౌళి ఎలా పాజిటివ్ రివ్యూని పోస్ట్ చేశారనే విషయం అర్థం కావట్లేదని, ఈ సినిమాను ప్రశంసించడం మహేష్ మరియు రాజమౌళిలకి అనవసరం అని కామెంట్స్ చేస్తున్నారు. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘బలగం’ మూవీ గురించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. అలాంటివారు ఈ మూవీని ఎలా ప్రశంసించారని అంటున్నారు.
యూట్యూబ్‌లో పెట్టాల్సిన ‘మేమ్ ఫేమస్’ సినిమాని థియేటర్లో విడుదల చేసి, అనవసరమైన హైప్ ఇచ్చారని విమర్శిస్తున్నారు. కాగా, ఫ్యాన్స్ మాత్రం మహేష్ బాబు, రాజమౌళి యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించడం కోసం అలా ట్వీట్ చేసి ఉండవచ్చని అంటున్నారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవల్సిన అవసరం ఏం లేదని, ఒక మూవీ నచ్చడం, నచ్చకపోవడం అనే విషయం వారివారి అభిరుచిని బట్టి ఉంటుందని అంటున్నారు.







నిహారిక, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. జులై 4న అధికారికంగా తెలిసింది. వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది. కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో జూన్ 5న వీరికి డైవర్స్ ముంజూరు అయ్యాయి. విడాకులకు కారణం ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలే అని సమాచారం. అయితే విడాకుల కోసం ముందుగా పిటిషన్ వేసింది చైతన్య జొన్నలగడ్డనే అని కోర్టు రిలీజ్ చేసిన కాపీలో ఉంది.
పిటిషన్ ఏప్రిల్ 1న ఫైల్ అయ్యింది. ఆ తర్వాత విడాకులకు నిహారిక కూడా అంగీకరించగా, ఆమె తరఫున అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర పిటిషన్ దాఖలు చేశారట. కళ్యాణ్ నాగబాబుకు అత్యంత సన్నితంగా ఉంటారని సమాచారం ఇక విడాకుల మ్యాటర్ ను గోప్యంగా ఉంచాలని ముందే అనుకున్నారని తెలుస్తోంది. మే 19న మొదటి హియరింగ్, మే 29న రెండో హియరింగ్ జరిగినట్లు ఆ కాపీలో ఉంది.
మూడో హియరింగ్ జరిగిన జూన్5న తుది నిర్ణయం తీసుకున్నారు. అదే రోజే కోర్టు విడాకులు మంజూరు చేశారని కాపీలో ఉంది. నిహారిక విడాకుల విషయం బయటికి వచ్చిన తరువాత ఆమె చేసిన మొదటి పోస్ట్ తో అందరు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దానిపై చర్చలు చేస్తున్నారు. ఎందుకంటే ఆమె తన విడాకుల గురించి పోస్ట్ పెడుతుందని అందరు భావించారు.
కానీ ఆమె తన చిత్రాలకు, వెబ్ సిరీస్‌ల కోసం యూఎస్ నుండి ప్రమోషన్స్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు బర్త్ డే విషెస్ చెప్తూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన వారు ఆమె విడాకుల విషయాన్న లైట్ తీసుకుందని అంటున్నారు. తాజాగా నీహరిక తన విడాకుల పై కూడా ఒక పోస్ట్ చేసింది.
అందులో ‘డైవర్స్ విషయంలో మేము ఇద్దరం పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, ఇది చాలా సెన్స్టివ్ విషయం. ఇద్దరం కొత్తగాప్రారంభించబోయే పర్సనల్ లైఫ్ లో ప్రైవసీని కోరుకుంటున్నాం. ఈ ఇబ్బందికర సమయంలో నాకు మద్ధతుగా కుటుంబం, ఫ్రెండ్స్ నిలబడ్డారు. తమపై నెగటివ్‌గా మా పై ప్రచారం చేయవద్దని, ఇలాంటి టైంలో తమను ఇబ్బంది పెట్టవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను’ అని నిహారిక రాసుకొచ్చారు.
అయితే కోర్టు గత నెల జూన్ 5న విడాకులు మంజూరు చేసిందని తెలుస్తోంది. ఈ వార్తతో గత కొంతకాలంగా వస్తున్న విడాకుల వార్తలకు తెర పడినట్టు అయ్యింది. 2020 డిసెంబర్లో మెగాడాటర్ నిహారిక వివాహం, మాజీ ఐజీ జే ప్రభాకర్ రావు కొడుకు చైతన్య జొన్నలగడ్డతో జరిగింది.
వీరి వివాహం రాజస్థాన్‌లోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మెగా, అల్లు కుటుంబాలతో పాటు సిని ఇండస్ట్రీ నుండి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. కానీ పెళ్ళి అయిన తరువాత రెండు సంవత్సరాలకే చైతన్య, నిహారిక మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.




ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్, నవదీప్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘ఆర్య 2’. ఈ మూవీని ఆదిత్య బాబు ఆదిత్య ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. శ్రద్ధా దాస్, బ్రహ్మానందం, ముఖేష్ రుషి కీలక పాత్రలలో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 2009లో నవంబరు 27న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.
ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ నిర్మాతలకు లాభాలను తెచ్చింది. ఈ మూవీ మలయాళంలో సేమ్ టైటిల్ తో అనువదించబడి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. తాజాగా ఈ మూవీలోని ఒక సన్నివేశాన్ని హాలీవుడ్ మూవీ అయిన ఇండియానా జోన్స్ 4 నుండి కాపీ కొట్టారని నెట్టింట్లో ఒక వార్త హల్చల్ చేస్తోంది. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన నెటిజెన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు సుక్కు మావా నువ్వు కూడా కాపీ కోడతావా అని కామెంట్ చేస్తే, మరొకరు ఇండియానా జోన్స్ టాలీవుడ్ డైరెక్టర్లకి బాగా ఉపయోగపడిందని అని కామెంట్ చేశారు. ఇంకొకరు సుకుమార్ కూడా వాడేస్తాడా అంటూ కామెంట్ చేస్తున్నారు.