డార్లింగ్ ప్రభాస్ వరుస లైన్ అప్ మూవీస్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఆది పురుష్ చిత్రం ఊహించిన ఫలితాలను అందివ్వలేకపోయింది. నెక్స్ట్ అప్ కమింగ్ ప్రభాస్ మూవీస్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విడుదలైనటువంటి సలార్ టీజర్ ఇప్పుడు బాగా వైరల్ అయింది.
క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ చిత్రంలో ఇంతవరకు ప్రభాస్‌ని చూడని మాస్ యాంగిల్ లో చూడబోతున్నాం.పృథ్వీరాజ్ సుకుమార్, శ్రుతి హాసన్, జగపతి బాబు తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈరోజు ఉదయం విడుదలైన సలార్ చిత్రం టీజర్ 1 నిమిషం 46 సెకన్ల నిడివితో ఆసక్తిగా ఉంది.

విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాని షేక్ చేసిన ఈ టీజర్ మూవీ పై అంచనాలను ఓ రేంజ్‌కు తీసుకువెళ్లింది. ‘వైలెన్స్.. వైలెన్స్.. వైలెన్స్’ అనే ఒక్క డైలాగ్ ఉపయోగించి కేజీయఫ్-2 ట్రైలర్ ద్వారా మూవీకి విపరీతమైన హైప్‌ని తెచ్చిన ప్రశాంత్ నీల్ సలార్ మూవీ విషయంలో కూడా అదే ఫార్మాట్ ఫాలో అవుతున్నారు.

‘సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరం కానీ.. జురాసిక్ పార్క్‌లో కాదు. ఎందుకంటే అక్కడ..’అంటూ ట్రైలర్ లో ప్రభాస్ ను ఎలివేట్ చేసిన విధానం చిత్రం పై క్రేజీ ను పెంచే విధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ట్రైలర్ తర్వాత మరో కొత్త చర్చ వెలుగులోకి వచ్చింది.‘సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్’ అని ఇందులో పేర్కొనడంతో ఈ సీజ్ ఫైర్ అంటే ఏంటి అని నటిజెన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు.

సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ లేదా యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం. రెండు దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరినప్పుడు లేదా ఎక్కువ హింసాత్మకమైన సంఘటనలు జరిగినప్పుడు శాంతి ఒప్పందం కోసం సీజ్ ఫైర్ వాడుతారు. మరి ఈ చిత్రంలో ఈ పదం ఏ సన్నివేశాన్ని ఉద్దేశించి వాడారు అనేది మూవీ రిలీజ్ అయితేనే తెలుస్తుంది. మరోపక్క టీజర్ లో ప్రభాస్ ముఖం కూడా సరిగ్గా కనిపించలేదని ,ఒక డైలాగ్ కూడా లేదని డార్లింగ్ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు.

సాధారణంగా బోయపాటి చిత్రాలలో లాజిక్‌లు అస్సలు చూడకూడదని టాక్. దానికి కారణం ఆయన తీసే సినిమాలలో ఒకదానిలో హీరో దేవుడు అవడం, తల గాల్లోకి ఎగరడం, ఆ తలను గద్ద ఎత్తుకెళ్ళి పోవడం లాంటివి కనిపిస్తాయి. రీసెంట్ గా ‘స్కంద’ మూవీ గ్లింప్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో రామ్ మాస్ లుక్ లో కనిపించారు. ఆయన చెప్పిన డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ డైలాగ్ రామ్ ఫైట్ చేసే క్రమంలో చెప్తాడు. ఆ ఫైట్ ను కోనేరులో తీశారు. అంటే వాటర్ లో జరిగిన ఈ ఫైట్ లో బోయపాటి మార్క్ అయిన రక్తపాతం చాలా ఎక్కువగా జరిగింది. అయితే రక్తం అంటే ఎరుపు రంగులో ఉంటుంది. కానీ ఈ వీడియోలో మాత్రం రక్తం ఆరెంజ్ కలర్ లో కనిపించింది.
దాంతో సోషల్ మీడియాలో నెటిజన్లు బోయపాటి పై కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. అసలు ఆరెంజ్ కలర్ రక్తం ఎందుకు వచ్చింది. రక్తంతో వాటర్ కలసినా కూడా అవి ఆరెంజ్ కలర్ లోకి మారవు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై బోయపాటి ఎలా స్పందిస్తారో చూడాలి.
ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు మహిళల స్టోరీనే ఈ వెబ్ సిరీస్. కుటుంబంలోని ఆడవాళ్ళకి ఏం కావాలో తెలియని సగటు మనిషి రాజరత్నం. అతను ఇంట్లోని వారు క్షేమంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అతని తల్లి సుందరి (లక్ష్మి), భార్య కావేరి (మధు), కుమార్తె నివి (శాంతి) సంతోషంగా ఉన్నారని భావిస్తాడు. తల్లిని ఇంట్లోనే ఉంచి చిన్న పిల్లలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఆమెకు ఎక్కడికైనా వెళ్లి గడపాలని కోరుకుంటుంది.
కుమార్తె క్రికెటర్ గా తన కెరీర్ ను, తనను గౌరవించే వ్యక్తి కోసం వెతుకుతుంటుంది. ఇక గృహిణి అయిన కావేరికి ఇళ్లే ప్రపంచం. కానీ భర్త, కొడుకు సరి అయిన గౌరవం ఇవ్వకపోవడం వల్ల విసిగిపోతుంది. అలా ఈ మహిళలు ముగ్గురు ఒక రోడ్ ట్రిప్ ప్లాన్ చేసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతారు. వారు తమ జర్నీని ఎలా కొనసాగించారు? ఆ ప్రయాణంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ తరువాత ఏం జరిగింది? అనేది మిగతా కథ.
ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. నిజ జీవితంలో ప్రతిరోజూ తమ ఫ్యామిలీ కోసం త్యాగం చేసే ప్రతి మహిళ జీవితం గురించి ఈ సిరీస్ లో ప్రస్తావించారు. ముగ్గురు మహిళల పాత్రలను చక్కగా రాసుకున్నారు. వారి పాత్రలలో మనల్ని మనం ఊహించుకునేలా ఉన్నాయి. లక్ష్మి, మధుబాల ఇద్దరూ తమ పాత్రలలో జీవించారు. 7వ ఎపిసోడ్లో లక్ష్మి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. శాంతి చక్కగా నటించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.
అతను ఎవరో కాదు యాక్టర్ టీనూ ఆనంద్. అతనికి ప్రభాస్ తో ఇది రెండవ మూవీ. ప్రభాస్ ‘సాహో’ మూవీలో ఇతడు నటించాడు. అతను పలు తెలుగు సినిమాలలో నటించాడు. అయితే టీనూ ఆనంద్ తెలుగులో నటించిన మొదటి సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అంజి’ సినిమా లో విలన్ గా నటించాడు. అతను భాటియా అనే క్యారెక్టర్ లో సరికొత్త విలనిజం పండించాడు.
అంతేకాకుండా గతేడాది రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధించిన ‘సీతారామం’ మూవీలో కూడా నటించాడు. మూవీ మొదట్లో వచ్చే ఆనంద్ మెహతా అనే క్యారెక్టర్ లో కనిపించాడు. ఆయన కుటుంబంలోని వారంతా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. టీనూ ఆనంద్ మేనల్లుడు అయిన సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నాడు. టీనూ ఆనంద్ లో యాక్టర్ మాత్రమే కాదు. రైటర్, దర్శకుడు, నిర్మాతగా పని చేశాడు.
సలార్ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు రాత్రి నుంచే హడావుడి మొదలుపెట్టారు. అయితే తెల్లవారుజామున రిలీజ్ అయిన టీజర్ నిరాశ పరిచిందని అంటున్నారు. ఇంతగా ఎదురు చేసింది మలయాళ హీరో పృథ్వి రాజ్ ను కోసం కాదని హీరో ప్రభాస్ ను చూడటం కోసమని అంటున్నారు. టీజర్ లో కనీసం ప్రభాస్ ఫుల్ ఫేస్ కూడా చూపించలేదని, సాహో సినిమా క్లైమాక్స్ షాట్స్ పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు నెటిజెన్లు సలార్ టీజర్ కు బదులుగా మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారని కామెంట్ చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఇప్పటికే వరుస పరాజయాలతో నిరాశలో ఉన్నారు. ఈ మూవీ టీజర్ ఫ్యాన్స్ ను మరింత నిరాశకు గురి చేసిందని చెబుతున్నారు. టీజర్ ఈ మూవీని మరో లెవెల్ కి తీసుకెళ్తుందని అనుకుంటే ఇలా నెగిటివ్ కామెంట్స్ రావడం బాగోలేదని చెబుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితారకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆమె సినిమాలలో నటించకపోయినా, తన టాలెంట్ కు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా తన డ్యాన్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో 1.2 మిలియన్ మంది ఫాలో చేస్తున్నారు. ఇప్పటివరకు సితార ఇన్ స్టాగ్రామ్ లో 642 పోస్టులను మాత్రమే చేసింది. వాటితోనే ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పొందారు.
12 సంవత్సరాల సితార ఇటీవల జ్యువెలరీ యాడ్ యాడ్ లో నటించింది. ఆమె నటించిన ఈ యాడ్ సెన్సషన్ గా మారింది. ఈ జ్యువెలరీ యాడ్ ను న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ప్రదర్శించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సితార గురించి మహేష్ చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉంటే ఈ యాడ్ లో నటించడం కోసం సితార అందుకున్న పారితోషికం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. సితార ఈ జ్యువెలరీ యాడ్ కి అందుకున్న రెమ్యునరేషన్ కోటి రూపాయలని సమాచారం. సితార భవిష్యత్తులో మరిన్ని ప్రకటనలలో కనిపిస్తారని తెలుస్తోంది.


తాజాగా రిలీజ్ అయిన సలార్ టీజర్లో నెటిజెన్లు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను గుర్తించారు. దాంతో కేజీఎఫ్‌తో సలార్ మూవీకి కనెక్షన్ ఉంటుందని అంటున్నారు. ఈ చిత్రంలో రాఖీ భాయ్ కూడా ఉంటారు అనే విషయానికి మరింతగా బలం చేకూరినట్టు అయ్యింది. ఇది ప్రభాస్ సలార్, రాఖీ భాయ్ మధ్య ఉన్న పెద్ద క్రాసర్ను సూచిస్తుంది.
ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఈ సన్నివేశాలు ఉన్నాయి. టీజర్లో వీటికి సంబంధించిన క్లూస్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇచ్చాడు. ఒక వేళ ఇదే నిజం అయితే ప్రభాస్, రాఖీ భాయ్ ఇద్దరు ఒకే తెరపై కనిపిస్తే ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతుందని అంటున్నారు. ప్రభాస్, యశ్ ఇద్దరు పాన్ ఇండియా స్టార్లు. ఒకరి మూవీ రిలీజ్ అయితేనే బాక్సాఫీస్ బద్దలవుతుంది. ఇక ఇద్దరు ఒకే సినిమాలో నటిస్తే భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్స్ గ్యారెంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని టీజర్ చివరలో దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ అంటూ టీజర్ ఎండ్ లో వేశారు. ఇలా ఈ ఈ టీజర్ కేజీఎఫ్ తో రిలేటెడ్ గా ఉంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.


