తెలుగుతో పాటు తమిళ్ లో, అలాగే హిందీలో కూడా సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటి తమన్నా భాటియా. తమన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే గత కొంత కాలం నుండి తమన్నా ప్రేమలో ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి.
అది కూడా విజయ్ వర్మ అనే ఒక నటుడిని తమన్నా ప్రేమిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఇప్పటి వరకు తమన్నా స్పందించలేదు. కానీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్నా ఈ విషయంపై మాట్లాడుతూ తాను రిలేషన్ షిప్ లో ఉన్నట్టు చెప్పారు.

విజయ్ వర్మతో తాను ప్రేమలో ఉన్నట్టు తమన్నా తెలిపారు. విజయ్ వర్మ హిందీ నటుడు అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలిసిన నటుడు. నాని హీరోగా నటించిన ఎంసీఏ సినిమాలో విజయ్ వర్మ విలన్ పాత్రలో నటించారు. నటించింది ఒక్క సినిమా అయినా కూడా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. హిందీలో పింక్, గల్లీ బాయ్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

అటు నెగిటివ్ పాత్రలని, ఇటు పాజిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలని చాలా సులభంగా పోషిస్తారు విజయ్ వర్మ. తమన్నా, విజయ్ కలిసి ఇటీవల ఒక సిరీస్ లో నటించారు. ఇలా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఇప్పుడు ఈ సిరీస్ విడుదల అవుతోంది. తమన్నా హిందీలో సినిమాలు, సిరీస్ చేయడంతో పాటు తెలుగులో కూడా చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నారు.

అంతే కాకుండా మలయాళంలో కూడా ఒక సినిమాలో నటిస్తున్నారు. విజయ్ వర్మ విలన్ పాత్రలో నటించిన దహాడ్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యి చాలా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తమన్నా వారిద్దరి ప్రేమ గురించి మాట్లాడుతూ, విజయ్ తో తన బంధం చాలా స్పెషల్ అని చెప్పారు. తమన్నా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియా ద్వారా అందరూ తమన్నాకి అభినందనలు తెలుపుతున్నారు.





























విజువల్ వండర్ గా రూపొందిన ‘ఆది పురుష్’ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించిగా, సీత పాత్రలో కృతి సనన్ నటించింది. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్. హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ప్రదర్శించే ధియేటర్లలో ఒక సీటును ఆంజనేయస్వామి కోసం కేటాయిస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
దీనిపై కొందరు ప్రమోషనల్ స్టంట్ అని అంటే, కొందరు శ్రీరాముడి కథ చెప్తున్నప్పుడు ఆంజనేయస్వామి కోసం సీటు వదిలితే తప్పు ఏమిటి? అని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం మీద సోషల్ మీడియాలో రక రకాల చర్చలు జరుగుతున్న క్రమంలో తాజాగా వాట్సాప్ మెసేజ్ ఒకటి వైరల్ గా మారింది. ఆదిపురుష్ సినిమా చూసే సమయంలో పాటించాల్సిన నియమాలు అంటూ వాట్సాప్ గ్రూప్ లలో తిరుగుతోంది. ఆ నియమాలు ఇవే..
ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన ఏపీ, తెలంగాణలో అన్ని ఏరియాల హక్కుల కోసం భారీగా పోటీ ఏర్పడింది. దీని ఫలితంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ప్రభాస్ కెరీర్ లోనే ఎక్కువ బిజినెస్ చేసిన సినిమాలలో 3వ స్థానానికి చేరింది. ఈ చిత్రం కంటే ముందు బాహుబలి 2 సినిమా 122 కోట్లతో మొదటి స్థానంలో ఉంది.
ఆదిపురుష్ మాత్రమేకాకుండా ప్రభాస్ గత 4 సినిమాలకు కూడా ఏపీ, తెలంగాణలో వంద కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. బాహుబలి 2 సినిమాకి రూ.122 కోట్లు, సాహో సినిమాకి రూ.121.60 కోట్లు, రాధే శ్యామ్ సినిమాకు రూ.105.20 కోట్లు, ఆదిపురుష్ సినిమాకి రూ.120 కోట్లు బిజినెస్ జరిగింది. ఈ విధంగా ప్రభాస్ గత 4 సినిమాలకు కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలోమొత్తం రూ. 468.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీగా బిజినెస్ చేసిన ఒకే ఒక హీరోగా ప్రభాస్ రికార్డును క్రియేట్ చేశాడు.
‘ఆదిపురుష్’ చిత్రం రీలీజ్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. శ్రీరాముడిగా తమ అభిమాన స్టార్ ను వెండితెర పై వీక్షించాలని ఆశపడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లు ఈ చిత్రం పై అంచనాలను అమాంతం పెంచాయి. డైరెక్టర్ ఓం రౌత్ రామాయణ మహాకావ్యాన్ని కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. రామాయణ కథ అందరికి తెలిసిన స్టోరీనే అయినా ఓం రౌత్ టేకింగ్, గ్రాఫిక్స్ ఎలా ఉండనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు ఈ మూవీ పై ఇప్పటికే ఎన్నో విమర్శలు, వివాదాలు వచ్చాయి. కొన్ని ఇంకా కొనగుతున్నాయి. వీటి మధ్యే జూన్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో తనకు తానే ఓవర్సీస్ క్రిటిక్, సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు ఈ చిత్రం పై నెగెటివ్ రివ్యూ ఇచ్చాడు.
‘ఆదిపురుష్’ టార్చర్ అని, ప్రభాస్, కృతి సనన్ బ్యాడ్‌లక్ బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతుందని ట్వీట్ చేశాడు. ‘పెద్ద స్టార్స్, భారీ బడ్జె్, వీఎఫ్ఎక్స్ ఉన్న భారీ చిత్రం. కానీ ఈ మూవీలో సోల్ లేదు. నటీనటులందరు వరెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రభాస్ మీకు యాక్టింగ్ క్లాసులు అవసరం’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. ప్రభాస్ కి ఏమి రాకుండానే ఇంత పెద్ద స్టార్ అయ్యాడా? ఈ రేంజ్ కి వచ్చారు అంటే అంత స్కిల్ ఉండబట్టే కదా? అని కామెంట్స్ చేస్తున్నారు. మూవీ చూడకుండా రివ్యూ ఏంటని అని తిడుతున్నారు.
ఒకప్పడు హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన శరత్‌కుమార్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస చిత్రాలలో బిజీగా ఉన్నారు. ఇటీవలే వారసుడు, పీఎస్ 2 సినిమాల ద్వారా ఆడియెన్స్ ను పలకరించారు. శరత్ కుమార్ డిఫరెంట్ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తాజాగా ఆయన ప్రధాన పత్రలో నటించిన తమిళ చిత్రం ‘పోర్ థోజిల్’ విడుదల అయ్యింది. ఈ చిత్రం ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. రిలీజ్ అయినప్పటి నుండి పాజిటివ్ తెచ్చుకున్న ఈ మూవీ, కోలీవుడ్ లో సెన్సేషనల్ గా మారింది.
ఈ మూవీ కథ విషయానికి వస్తే తిరుచ్చి అనే ఊరులో ఒక సైకో అమ్మయిలను వరుసగా చంపేస్తుంటాడు. ఆ సైకో ఎవరు? అతను అమ్మాయిలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు. కొత్తగా పోలీస్ జాబ్ లో చేరిన ప్రకాష్ (అశోక్ సెల్వన్) ఈ కేసును ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా కథ. ఇలాంటి చిత్రాలు గతంలో ఎన్నో వచ్చాయి. కానీ ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే ఎంగేజింగ్ గా, గ్రిప్పింగ్ గా ఉండడంతో ఆడియెన్స్ ని స్టోరీతో పాటు ప్రయాణించేలా చేస్తుంది.
కొత్త దర్శకుడు అయినప్పటికీ విఘ్నేష్ రాజా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. కొత్తగా పోలీసు డిపార్ట్మెంట్ లో చేరిన వ్యక్తిగా అశోక్ సెల్వన్, సీనియర్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా శరత్ కుమార్ యాక్టింగ్ ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య ఉండే ఇగో, సీన్స్ చాలా బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.