చిన్నారి పెళ్లికూతురు సీరియల్ ఫేమ్ అవికా గోర్ తెలుగులో పాపులారిటీని సంపాదించుకుంది. ఈ సీరియల్ మంచి మిగతా భాషల్లో కూడా టీఆర్పీ రేటింగ్‌తో సక్సెస్ అయ్యింది. ఈ సీరియల్ తో అవికా గోర్ కు తెలుగులో విపరీతమైన అభిమానులు పెరిగిపోయారు.
తెలుగు సినిమాల ద్వారా పాపులారిటీని, డబ్బు సంపాదించుకుని, సక్సెస్ ను అందుకున్న హీరోయిన్లు బాలీవుడ్ కి వెళ్ళడం అనేది ఎప్పటి నుండో ఉన్న విషయమే. అయితే అలా బాలీవుడ్‌కి వెళ్ళిన హీరోయిన్లు సౌత్ ఇండస్ట్రీ పై బురద చల్లడం కూడా జరుగుతోంది. తాజాగా అవికా గోర్ సౌత్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
హీరోయిన్ గా టాలీవుడ్ మూవీ ఉయ్యాల జంపాల ద్వారా ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్, ఆ తర్వాత లక్ష్మి రావే మా ఇంటికి, తాను నేను, సినిమా చూపిస్తా మావ, రాజు గారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యింది. హిందీ సీరియల్స్ నటిస్తూ బిజీగా ఉంది. బాలీవుడ్లో ఆమె నటించిన 1920:హార్రర్ ఆఫ్ ద హార్ట్ మూవీ రిలీజ్ కాబోతుంది.
ఈక్రమంలో అవికా గోర్ ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొంది. దీనిలో ఆమె సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. “దక్షిణాది ఇండస్ట్రీలో నెపోటిజం ఎక్కువ. అక్కడ స్టార్ హీరోల పైనే ఇండస్ట్రీ నడుస్తోంది. అక్కడి ఆడియెన్స్ కూడా స్టార్స్ చిత్రాలనే చూస్తారని, టాలీవుడ్ లో నెపోటిజం ఎక్కువ.” అని అవికా గోర్ కామెంట్స్ చేసింది. నెటిజెన్లు అవికా గోర్ కామెంట్స్ పై మండిపడుతున్నారు. తెలుగు చిత్రాలలో నటించి, గుర్తింపు వచ్చిన తరువాత అదే ఇండస్ట్రీ పై ఇలాంటి కామెంట్లు చేయడం సరి కాదని అంటున్నారు.
watch video:
Also Read: అంత పెద్ద ప్రాజెక్ట్ ని యష్ రిజెక్ట్ చేశారా..? అది ఏంటంటే..?

రణబీర్ కపూర్,సందీప్ రెడ్డి వంగా వంటి క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ‘యానిమల్’ పై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఈ చిత్రంలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరో అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్యమైన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ టి సీరీస్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 11న 5 భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ప్రారంభించింది.
ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా యానిమల్ ప్రీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో పాటు మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. టీజర్ లో స్కల్ మాస్క్ పెట్టుకొన్న ఒక గ్యాంగ్ హీరో రణబీర్ కపూర్ పై అటాక్ చేయడం, రణబీర్ వారిపై అటాక్ చేయడంతో ఆ గ్యాంగ్ భయంతో పరుగులు తీస్తారు. ఈ టీజర్ రక్తపాతాన్ని తలపించింది.
అయితే ఇందులో చూపించిన యాక్షన్ సీన్స్ 2003లో రిలీజ్ అయిన కొరియన్ మూవీ ‘ఓల్డ్ బాయ్’నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి కాపీ చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది మాత్రమే కాకుండా ఈ మూవీ కూడా స్క్వాడ్ గేమ్స్, ది మ్యాన్ ఫ్రమ్ నోవేర్, ఓల్డ్ బాయ్ లాంటి కొరియన్ సినిమలను మిక్స్ చేసి, తీశారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ టీజర్ రిలీజ్ తరువాత సందీప్ రెడ్డి వంగాను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.












పూర్ణ, రవిబాబు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం అసలు. ఈ చిత్రానికి సురేష్, ఉదయ్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీని డైరెక్ట్‌గా ఈటీవీ వారి విన్ ఓటీటీలో ఏప్రిల్ 14న విడుదల చేశారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్. రవిబాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూనే ఈ మూవీని నిర్మించారు.
కామెడీ, క్రైమ్ సస్పెన్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలో రవిబాబుకు మంచి పేరుంది. అనసూయ, అవును లాంటి చిత్రాలతో విజయం సాధించారు. చాలా గ్యాప్ తరువాత ‘అసలు’ సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రంలోని ఒక సన్నివేశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సీన్ లో డాక్టర్ ఒక పేషంట్ బ్రెయిన్ లో స్టోర్ అయిన ఇమేజ్ లు అంటూ హీరోయిన్ పూర్ణకు చూపిస్తుంది. ఆ పేషంట్ కాన్షియస్ గా చివరిసారి చూసిన విజువల్స్ అని చెప్తుంది. వాటి ద్వారా ఆమె షాక్ లోకి ఎందుకు వెళ్లిందో తెలుస్తుందని చెప్తుంది. పూర్ణ వాటిని చూసి ఆ ఫోటోలోని వ్యక్తిని గుర్తు పడుతుంది. ఇక ఈ సీన్ చూసినవారు బ్రెయిన్ ఇలా కూడా పనిచేస్తుందా అంటూ ఈ మూవీని ట్రోల్ చేస్తున్నారు.


జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ, తన ప్రతిభతో ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుని స్టార్ హీరోగా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇక ఎన్టీఆర్ కెరీర్ లో అనేక హిట్ సినిమాలు ఉన్నప్పటికీ, ఆయన హీరోగా నటించిన ‘బృందావనం’ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, ఎన్టీఆర్ అప్పటి దాకా మాస్ చిత్రాలను మాత్రమే చేస్తూ మాస్ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు.
మాస్ హీరోగా అయిన ఎన్టీఆర్ ను కుటుంబ ప్రేక్షకులకు చేరువయ్యేలా చేసిన చిత్రం బృందావనం. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీని నిర్మించాడు. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, శ్రీహరి ముఖ్యమైన పాత్రలలో నటించిన ఈ మూవీ 2010లో అక్టోబర్ 14న రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ గా నిలిచింది.
అయితే ఈ చిత్రంలో చేసిన ఒక మిస్టేక్ పై నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. ఒక సన్నివేశంలో పడుకున్న ఎన్టీఆర్ ను నటి ప్రగతి నిద్రలేపుతుంది. అయితే ఆ సీన్ లో బెడ్ పక్కనే ఉన్న పెద్ద అద్దంలో కెమెరామెన్, పక్కనే ఉన్న మరో ఇద్దరు కనిపిస్తున్నారు. ఈ సీన్ చూసినవారు డైరెక్టర్ గారు దీనిని ఎలా మిస్ చేశారు అని కామెంట్స్ చేస్తున్నారు.