సినీ ఇండస్ట్రీ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందరు తమ ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ వస్తుంటారు. కెరీర్ పీక్స్ లో ఉంది అంటే పెళ్లి చేసుకోవడానికి చాలా మంది భామలు అంగీకరించారు. అవకాశాలు ఉన్నంతమేర కెరీర్ ను కొనసాగించాలనే భావిస్తుంటారు. అయితే.. మరికొందరు మాత్రం ఇందుకు విరుద్ధం గా తమకు నచ్చిన వారిని వివాహం చేసేసుకుని తిరిగి కెరీర్ ను కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటె.. కొందరు హీరోయిన్లకు పెళ్లి అయిపోయిందన్న సంగతే చాలా మందికి తెలియదు. ఈ లిస్ట్ ను మీరు కూడా ఓ లుక్ వేయండి.

Video Advertisement

#1 ఆకాంక్ష సింగ్:

1 akanksha
సుమంత్ హీరో గా నటించిన “మళ్ళీ రావా” సినిమా లో హీరోయిన్ గా నటించిన ఆకాంక్ష సింగ్ కు ఆల్రెడీ పెళ్లి అయిపొయింది. కునాల్ సైన్ అనే ఓ సీరియల్ నటుడిని ఈమె 2012 లోనే పెళ్లి చేసుకున్నారు. పహిల్వాన్’, ‘దేవదాస్’ సినిమాలలో కూడా ఆమె నటించింది.

ఇవి కూడా చదవండి : Daily Horoscope: Rashi Phalalu 09.01.2023 ఈ రాశుల వారికి పుష్కలంగా ఉద్యోగ అవకాశాలు

#2 రాధికా ఆప్టే: 

2 radhika apte
రాధికా ఆప్టే బాలీవుడ్ నటి అయినప్పటికీ.. తెలుగు వారికి కూడా సుపరిచితమే. ‘లెజెండ్’ ‘లయన్’, “రక్త చరిత్ర వంటి సినిమాల్లో రాధికా నటించారు. ఆమె బెనెడిక్ట్ టేలర్ అనే వ్యక్తిని డేటింగ్ చేసారు. ఆ తరువాత 2013 లో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు.

#3 అదితి రావు హైదరి:

3 adhiti
మణిరత్నం “చెలియా” సినిమా తో అదితి రావు హైదరి తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ‘సమ్మోహనం’ ‘నవాబ్’ ‘పద్మావత్’ , “అంతరిక్షం” , “వి” సినిమాలు ఆమెకు మరింత అగుర్తింపు తెచ్చాయి. ఆమెకు వివాహమైందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆమె 2009 లోనే సత్యదేవ్ మిశ్రా ను వివాహం చేసుకున్నారు.

#4 నజ్రియా :

4 najriya
‘ రాజా రాణి’ సినిమా తో నజ్రియా తెలుగు వారికి కూడా పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆమె నాని “అంటే సుందరానికి” సినిమా లో నటిస్తున్నారు. ఈమెకు కూడా 2014 లోనే హీరో ఫహాద్ ఫాజిల్ తో పెళ్లి అయిపొయింది. హీరో ఫహాద్ ఫాజిల్ కూడా “పుష్ప” మూవీ తో తెలుగు వారికీ విలన్ గా పరిచయం కాబోతున్నారు.

#5 సనా ఖాన్:

5 sanakhan
కళ్యాణ్ రామ్ “కత్తి” సినిమా తో తెలుగు వారికి పరిచయమైన సనాఖాన్ ‘గగనం’ ‘మిస్టర్ నూకయ్య’ సినిమాల్లో కూడా నటించారు. ఆమె లాస్ట్ ఇయర్ లోనే సయ్యద్ ను వివాహం చేసుకున్నారు.

#6 నీతి టేలర్ :

6 neethi taler
“మేం వయసుకు వచ్చాం” సినిమా తో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన నీతి టేలర్ గత సంవత్సరమే పరీక్షిత్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

#7 షాలిని వడ్నీకట్టి:

8 shalini

‘భానుమతి అండ్ రామకృష్ణ’, ‘యురేకా’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన షాలిని కూడా వివాహమైంది. గతేడాది డైరెక్టర్ మనోజ్ బీదను షాలిని వివాహం చేసుకున్నారు.

#8 అనీషా అంబ్రోస్:

9 anisha ambrose
అనీషా అంబ్రోస్ “అలియాస్ జానకి అనే సినిమాలో నటించారు. “సర్దార్ గబ్బర్ సింగ్” లో కూడా అనీషా అంబ్రోస్ కు అవకాశం లభించింది. అయితే, అనుకోని రీసన్స్ వలన లాస్ట్ మినిట్ లో ఆమె తప్పుకున్నారు. “సెవెన్”, “గోపాల గోపాల” సినిమాల్లో కూడా అనీషా అంబ్రోస్ నటించారు. 2019 లోనే అనీషా అంబ్రోస్ గుణనాధ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

#9 మమతా మోహన్ దాస్ :

10 mamatha
మమతా మోహన్ దాస్ తెలుగువారికి సుపరిచితమే. యమదొంగ, విక్టరీ, చింతకాయల రవి సినిమాల్లో ఆమె నటించి మెప్పించారు. ఆమె 2011 లోనే పరాజిత్ పద్మనాభన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే 2012 లోనే వీరు విడిపోయారు.