డిఫరెంట్ కథలని ఎంచుకుంటూ, కేవలం మంచి నటుడిగా మాత్రమే కాకుండా మంచి కథా రచయితగా కూడా పేరు తెచ్చుకున్న హీరో అడివి శేష్. ఎన్నో సినిమాల్లో ముఖ్యమైన పాత్రల్లో, అలాగే గూడచారి, క్షణం, ఎవరు, మేజర్ వంటి సినిమాల్లో హీరోగా కూడా నటించారు. ఈ సినిమాలన్నీ కూడా పెద్ద హిట్ అయ్యాయి.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమాలకు చాలా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు గూడచారి సినిమా సీక్వెల్ కూడా వస్తోంది. ఇదిలా ఉండగా అడివి శేష్ నాని ప్రొడక్షన్ లో హిట్ సీక్వెల్ అయిన హిట్-2 లో నటించారు. ఈ సినిమాకి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల అయ్యింది.
మొదటి పార్ట్ లాగానే ఇది కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థం అవుతోంది. ఇదిలా ఉండగా ఈ టీజర్ యూట్యూబ్ నుండి డిలీట్ అయ్యింది. ఈ సినిమా టీజర్ చూడాలంటే యూట్యూబ్ కొన్ని కండిషన్స్ పెట్టింది. ఈ సినిమా టీజర్ చూడాలి అంటే వయసు 18 సంవత్సరాలు ఉండాలి అని, అది ప్రూవ్ చేసుకుంటేనే టీజర్ చూసే అవకాశం ఉంది అని కండిషన్ పెట్టింది. ఈ విషయంపై అడివి శేష్ మాట్లాడుతూ, “టీజర్ చూసిన తర్వాత తాను ఇలా అవుతుంది అని ఊహించాను” అని చెప్పారు. “అందుకే మేము కూడా ట్వీట్ లో కేవలం 18 సంవత్సరాలు పైబడిన వాళ్లు మాత్రమే ఈ సినిమా టీజర్ చూడాలి అని ప్రత్యేకంగా చెప్పాం” అని అన్నారు.