ప్రతి సంవత్సరం ఎంతో మంది కొత్త హీరోయిన్స్ సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కాంపిటీషన్ ని తట్టుకోవడం కష్టమవుతున్న ఈ తరుణంలో చాలామంది హీరోయిన్లు వరుస ఫ్లాప్ లతో బాధపడుతున్నారు.
రాబోయే సినిమా అయినా కచ్చితంగా సక్సెస్ అవ్వకపోతే తెలుగు సినీ రంగంలో వాళ్ల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. రాబోయే తమ నెక్స్ట్ మూవీతో కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన ఆ మేటి తారలెవరో చూద్దాం
#1 కృతి శెట్టి
ఉప్పెన మూవీతో ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తన నటనతో మంచి పేరు సంపాదించిన కృతి శెట్టి, వారియర్ మరియు మాచర్ల నియోజకవర్గం సినిమాల కారణంగా వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంది. ఈ గుమ్మడు నెక్స్ట్ మూవీ తో సక్సెస్ సాధించకపోతే టాప్ హీరోయిన్ గా కొనసాగడం కష్టమేనంటున్నారు విమర్శకులు.
#2 రకుల్ ప్రీత్ సింగ్
టాప్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ కూడా చెక్ మరియు కొండ పాలెం సినిమాలు వల్ల వరుస ప్లాపులతో సతమతమవుతోంది.
#3 లావణ్య త్రిపాఠి
ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ ఈ మధ్యకాలంలో నటించిన అర్జున్ సురవరం , చావు కబురు చల్లగా వరుస ఫ్లొప్స్ తో నిరాశపరిచాయి అయితే A1 ఎక్స్ప్రెస్ మాత్రం యావరేజ్ గా ఆడింది. ఈ తరుణంలో లావణ్య ఇండస్ట్రీలో తనకంటూ స్థానం నిలుపుకోవాలి అంటే ఈసారి చిత్రంతో తప్పకుండా సక్సెస్ సాధించాలి.
#4 రాశి ఖన్నా
2013లో సినీ రంగ ప్రవేశం చేసిన రాశి ఖన్నా వరుస హిట్లతో దూసుకు వెళ్ళింది. కానీ గత కొద్దికాలంగా ఫ్లాప్ మూవీలో ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో భారీ అంచనాలతో రిలీజ్ అయిన థాంక్యూ మూవీ కూడా షాక్ మిగిల్చింది. కాబట్టి రాశి ఖన్నా కు కచ్చితంగా తన నెక్స్ట్ మూవీ తో సక్సెస్ కొట్టాల్సిన అవసరం ఉంది.
#5 అనుష్క
బాహుబలి తర్వాత అంత భారీ సక్సెస్ అందుకో లేకపోయింది అనుష్క. ఆమె నటించిన నిశ్శబ్దం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ తరుణంలో చాలా గ్యాప్ తర్వాత తిరిగి మంచి హిట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుష్క ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
#6 పూజా హెగ్డే
ఈ హాట్ అమ్మడు అగ్ర హీరోల సరసన రాధ్యే శ్యామ్, బీస్ట్ మరియు ఆచార్య లాంటి సినిమాలు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూడు చిత్రాలు ఊహించని ఫలితాలు ఇవ్వకపోవడంతో తదుపరిచిత్రం కచ్చితంగా హిట్టు కొట్టాలి అని ప్రయత్నిస్తోంది పూజ.
#7 కాజల్
మోసగాళ్లు సినిమా ఫ్లాప్ తర్వాత కాజల్ తిరిగేటువంటి సినిమాలో మనకు కనిపించలేదు. కానీ వెబ్ సిరీస్ లో మాత్రం బాగా బిజీగా ఉన్న ఈ అమ్మడు తిరిగి సినీ ప్రవేశం కోసం మంచి భారీ హిట్ చిత్రానికై అన్వేషిస్తుంది అని సమాచారం.
#8 హన్సిక
ఎందరో అగ్ర హీరోల సరసన నటించిన హన్సిక ఈమధ్య సినిమాలు చాలా తగ్గించింది. రోజురోజుకీ పోటీ పెరుగుతున్న ఈ నేపథ్యంలో ఆమె తిరిగి సోలో హీరోయిన్గా మంచి హిట్ ఇవ్వాలి అని ఆశిస్తుంది.
#9 నిధి అగర్వాల్
మిస్టర్ మజ్ను ,సవ్యసాచి మిగిల్చిన చేదు అనుభవాలతో బాధపడుతున్న నిధి అగర్వాల్ తన నెక్స్ట్ చిత్రంతో హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
#10 పాయల్ రాజ్పుత్
ఆర్ఎక్స్ 100 తో మంచి క్రేజ్ సంపాదించిన పాయల్ రాజ్ పుత్ ఈమధ్య సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్నారు. ఈ క్రమంలో మంచి హిట్ మూవీతో తిరిగి రీ ఎంట్రీ కోసం ట్రై చేస్తుంది.
ఈ హీరోయిన్స్ మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది తెలుగు హీరోయిన్స్ కూడా తన నెక్స్ట్ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. వీరిలో కొంతమంది వేరే ఇండస్ట్రీలో నటించిన సినిమాలు హిట్ అయినా కూడా తెలుగులో మాత్రం గత కొంత కాలం నుండి హిట్ సినిమాలు రావట్లేదు. దాంతో రాబోయే సినిమాలు కచ్చితంగా హిట్ అవ్వాలి.