నటసింహం నందమూరి బాలకృష్ణ ఇవాళ తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు బాలకృష్ణకి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. అంతే కాకుండా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేశారు. ప్రస్తుతం అది యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది.
ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే కన్నడ హీరో అయిన దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. టీజర్ చూస్తే ఇది ఒక యాక్షన్ సినిమా అని అర్థమైపోతోంది. ఈ సినిమాకి కూడా తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా విడుదల అయి బ్లాక్ బస్టర్ సాధించింది. ఇప్పుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమాలో కూడా నటిస్తారు.
బాలకృష్ణ మంచి నటుడిగా మాత్రమే కాకుండా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ, అలాగే ఒక రాజకీయ నేతగా కూడా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఇన్ని సంవత్సరాల తన సినిమా కెరీర్ లో బాలకృష్ణ ఎన్నో పాత్రలు పోషించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తుండిపోయే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకి అందించారు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18