దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నేషనల్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి తాను తీసే సినిమాల కథ విషయంలో ఎంతో పకడ్బందీగా ప్లాన్ వేసుకుంటాడు.
ఆయన తీసిన బాహుబలి సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతే కాకుండా అంతకు ముందు వరకు పాన్ ఇండియా సినిమా అంటే ఎప్పుడో ఒకసారి వచ్చేవి.
కానీ బాహుబలి తర్వాత ఎన్నో పాన్ ఇండియన్ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి కూడా. ఒకరకంగా చెప్పాలి అంటే తమ కంటెంట్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రజెంట్ చేయాలి అనుకునే ఫిలిం మేకర్స్ కి బాహుబలి ఒక ధైర్యం ఇచ్చింది. అంత ధైర్యాన్ని ఇచ్చారు డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ కూడా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది.
రాజమౌళి ఒక సినిమా తీస్తున్నారు అంటే అది పక్కా హిట్ అవుతుంది అన్న నమ్మకం అందరికీ ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమా తీయడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఎన్ని డేట్స్ అడిగితే అన్ని ఇవ్వడానికి కూడా సాహసం చేస్తుంటారు. రాజమౌళి అంత పక్కా ప్లానింగ్ తో ఉంటారు.
ఇది ఇలా ఉంటె.. రాజమౌళి తీయాలనుకున్న సినిమాలు ఆగిపోయాయని తెలుసా..? చాలా మందికి ఈ విషయం తెలియదు. జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీసిన రాజమౌళి తరువాత మోహన్ లాల్ ను హీరోగా పెట్టి ఓ మైథలాజికల్ సినిమాను తీయాలనుకున్నారు. కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తరువాత రాఘవేంద్ర రావు తనయుడు సూర్య ప్రకాష్ తో మరో సినిమా తీయాలనుకున్నారు. కానీ, భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది. మరో కారణం ఏంటంటే సూర్య ప్రకాష్ హీరో గా వచ్చిన తొలి సినిమా “నీతో” అట్టర్ ప్లాప్ కావడమే.