సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలబ్రిటీలలో సమంత ఒకరు. తన సినిమాలకు సంబంధించిన విషయాలను కానీ, లేదా ఇతర విషయాలను కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
అలాగే చాలా సార్లు తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్పారు. ఇవన్నీ మాత్రమే కాకుండా ఎంతో మందిని ప్రోత్సహించేలాగా కూడా సమంత పోస్ట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సమంత వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. అలాగే సమంత హీరోయిన్గా నటించిన శాకుంతలం సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ ఇటీవల విడుదల అయింది.
సమంత సోషల్ మీడియా ద్వారా ఎన్నో బ్రాండ్స్ ప్రమోట్ చేస్తారు. గత కొంత కాలం నుండి అలా ఎన్నో కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను సమంత ప్రమోట్ చేశారు. అయితే అవన్నీ సాధారణంగా అందరూ వాడే ఉత్పత్తులు. కానీ ఇటీవల సమంత చేసిన ఒక ప్రమోషన్ మాత్రం చర్చలకు దారి తీసింది. సమంత బ్లెండర్స్ ప్రైడ్ ఆల్కహాల్ ప్రమోట్ చేస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు సమంత.
ఈ వీడియో పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “అంత పెద్ద సెలబ్రిటీ అయ్యుండి ఇలా ఆల్కహాల్ ప్రమోట్ చేయడం తప్పు కదా? డబ్బు కోసం ఇలాంటి వాటిని కూడా ప్రమోట్ చేయాలా?” అని అంటున్నారు. మరి కొంతమంది ఏమో సమంత డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్ చేస్తున్నారు. ఇలా ఆల్కహాల్ ప్రమోట్ చేసి ట్రోలింగ్ కి గురైన సెలబ్రిటీలలో సమంత మొదటి వారు కాదు. అంతకు ముందు కూడా కొంత మంది హీరోయిన్లు, హీరోలు ఆల్కహాల్ ప్రమోట్ చేసి చర్చల్లో నిలిచారు.
watch video :
https://www.instagram.com/reel/Ca3mVBSo4Jp/?utm_source=ig_web_copy_link