ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో చూస్తూ ఉంటే సమయమే తెలియదు. చక్కగా ఎంత సేపు అయిన నవ్వుకుంటూ కూర్చోవచ్చు. జబర్దస్త్ లో చాలా మంది కమెడియన్లు వస్తూ ఉంటారు. అయితే వారిలో తన్మయి కూడా ఒకరు. తన్మయి కూడా ఎంత యాక్టివ్ గా స్కిట్స్ చేస్తూ అందరిని అలరిస్తుంది.
అయితే తన్మయి తాజాగా క్యాష్ షోకి వచ్చింది. సుమ తో పాటు క్యాష్ కి వచ్చిన కమెడియన్స్ బాగా అలరించారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో ఒకటి వచ్చింది.

దీనిలో జబర్దస్త్ కమెడియన్స్ వారి కుటుంబ సభ్యులతో రావడం మనం చూడొచ్చు. జబర్దస్త్ కమెడియన్ తన్మయి తన తల్లి లక్ష్మి తో పాటుగా వచ్చింది. అలానే పవన్ తన తల్లి చావలి బాయి తో పాటు వచ్చారు. అలాగే వినోద్ తన భార్య విజయతో పాటు వచ్చారు. హరికృష్ణ కూడా తన భార్యతో కలిసి ఈ షోకి వచ్చారు.

ఈ షో తల్లా పెళ్ళామా అనే కాన్సెప్ట్ తో మొదలయ్యింది. ప్రోమో అంతా కూడా ఎంతో ఎమోషనల్ గా ఉంది. తన్మయి అయితే నేను జీవితంలో చాలా పెద్ద తప్పు చేశానని.. అది తల్లిదండ్రులను మోసం చేయడమేనని.. ఆమె బాధ పడింది. ఒక అబ్బాయిగా తల్లిదండ్రులు ఆమెకు జన్మనిచ్చారు కానీ శరీరంలో హార్మోన్స్ సమస్య వల్ల పూర్తిగా అమ్మాయిగా మారిపోయానని చెప్పింది. అయితే చాలా ఆస్పత్రుల్లో చూపించుకున్నాను.. కానీ హార్మోన్ సమస్యల వల్ల అమ్మాయిగా మారాల్సి వచ్చిందని ఆమె చెప్పారు.

పైగా జబర్దస్త్ కి వస్తున్నప్పుడు నేను అబ్బాయిని కాదు. అమ్మాయిని అని చెప్తే ఎక్కడ అవకాశాలు రావు అని భయపడి అమ్మాయి కాదు నేను అబ్బాయిని అని చెప్పి వచ్చాను అని ఆమె చెప్పింది. పైగా నేను అమ్మాయిని అని చెప్తే కుటుంబ పరువు ఎక్కడ పోతుంది అని భయపడ్డాను అని తన తల్లి కాలు మీద పడింది. దీంతో తన తల్లి ఎవరేమనుకున్నా నాకు పరవాలేదు. నా బిడ్డ జీవితమే ముఖ్యమని తన ప్రేమని తెలియపరిచారు.
watch video :







































#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19