‘అ ఆ’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ప్రేమమ్ అనే మలయాళ సినిమాతో ఈ మలయాళ బ్యూటీకి తెలుగు నాట ఎక్కడ లేని పాపులారిటీ వచ్చేసింది. అటు మలయాళంలోనూ, ఇటు తెలుగులోనూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది.
తెలుగులో అ ఆ, శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసమే, తేజ్ ఐ లవ్ యు, ఉన్నది ఒకటే జిందగీ, అందమైన జీవితం, రాక్షసుడు వంటి సినిమాలతో అనుపమ తెలుగు వారికి బాగా దగ్గరైంది.
#1.
అంతే కాదు ప్రస్తుతం చేతిలో తక్కువ సినిమాలే ఉన్నా అనుపమ సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు. అప్పుడప్పుడు హాట్ ఫోజులతో ఫొటోస్ పంచుకోవడంతో పాటు, సరదా రీల్స్ తో కూడా అలరిస్తూ ఉంటారు. చాలా అల్లరి పనులు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
#4.
తాజాగా.. ఓ త్రో బ్యాక్ పిక్ ని అనుపమ తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పంచుకున్నారు. గతంలో తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను అనుపమ షేర్ చేశారు. అందులో ఆమె ప్రెగ్నంట్ గా కనిపించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కమెడియన్ విద్యులేఖ సైతం.. “కంగ్రాట్స్ చెబుదాం అనుకున్నా..” అంటూ కామెంట్ చేశారు. ఒక్క క్షణం చూసి నిజం అనుకున్నాంగా అంటూ ఫ్యాన్స్ కూడా వరుస కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో కిస్ సీన్ కే ప్రెగ్నంట్ అయిపోయారా అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫోటో పై సోషల్ మీడియాలో తెగ మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
#6.
#7.