ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.
ఈ సినిమా విడుదల తేదీని ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది.
ఈ సినిమా లో ఎన్టీఆర్ నడిపిన బైక్ అందరిని ఆకట్టుకుంది. దీని పేరు వెలోసెట్ రెట్రో బైక్. ఇది 1934 కాలానికి చెందింది. బ్రిటన్ కి చెందిన ఈ బైక్ కి ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యత ఉంది. రెండవ ప్రపంచ యుద్ధ సమయం నాటికి ఈ బైక్ కి విశేష ప్రాముఖ్యత లభించిందట. ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం ఈ బైక్ లో కొన్ని మార్పులు చేసి ఉపయోగించారట. ఎక్కువగా ఈ బైక్స్ ఆక్షన్ వెబ్ సైట్లలోనే కనిపిస్తాయి. దీనికోసం రాజమౌళి ఏకంగా పదిలక్షలు ఖర్చు చేసాడట.