Filmy Adda
ఈ అమ్మాయిని చెత్తబుట్టలో నుంచి ఒక స్టార్ హీరో తెచ్చి పెంచాడు…ఇప్పుడు హీరోయిన్ లా ఎలా ఉందో చూడండి.!
భారత్ ఎంత అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికి.. ఇప్పటికే చాలా మంది ఆడపిల్లలను సంతానం గా వద్దు అనుకునే వారు ఉన్నారు. కొందరైతే, ఆడపిల్లలని పుట్టగానే చెత్తబుట్టలో వదిలివేస్తున్నారు. ఇది వినటానికి దారుణంగా ఉన్నా, కఠినమైన వాస్తవం. అయితే, పశ్చిమ బెంగాల్ రాష్ట్రము లో కూడా ఇలానే ఓ ఆడపిల్లను డస్ట్ బిన్ లో వదిలేస్తే, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఆ పసి పిల్లను చేరదీసి దత్తత తీసుకున్నాడు. ఆమె బాగోగులన్నీ తానే చూసుకున్నాడు.

ఇప్పటి వరకు దీని గురించి బయటప్రపంచానికి అంతగా తెలియదు. రోడ్డు పైన ఉన్న డస్ట్ బిన్ లో ఓ పసిపాప పడి ఏడుస్తుంటే.. ఒక ఎన్జిఓ మరియు కొంతమంది ప్రభుత్వ అధికారులు రక్షించారు. ఈ పాప చాలా బలహీనమైన పరిస్థితిలో ఉందని వారు గుర్తించారు. అయితే, ఈ వార్త పేపర్ లో ప్రచురితం అవడం తో, అది చూసిన మిథున్ చక్రవర్తి చలించిపోయి.. ఆ పాపను తాను దత్తత తీసుకుంటానని ముందుకు వచ్చాడు. మిథున్ భార్య యోగిత కూడా ఈ విషయం లో మిథున్ కు సహకరించారు.

యోగిత కూడా ఆ పిల్లను పెంచడానికి ఎంతో ఆసక్తి కనబరిచారు. ఆ రాత్రంతా కష్టపడి పేపర్ వర్క్ ను పూర్తి చేసి, అధికారికం గా దత్తత తీసుకున్నారు. ఆ పాపకు దిశాని అని నామకరణం చేసారు. అప్పటి నుంచి ఆమె ను వారు ఎంతో కేరింగ్ గా ప్రేమ గా పెంచుకుంటున్నారు. యోగిత, మిథున్ లకు మిమోహ్, ఉష్మీ, మరియు నమాషి అని ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరితో సమానం గానే దిశాని ని కూడా అల్లారు ముద్దు గా పెంచుకుంటున్నారు.

దిశాని కూడా యాక్టింగ్ వైపు రావడానికి ఆసక్తిని కనబరుస్తోంది. యాక్టింగ్ పై ఇంటరెస్ట్ తో దిశాని ప్రస్తుతం న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సును నేర్చుకుంటోంది. కాబట్టి, తొందరలోనే దిశాని కూడా హీరోయిన్ కాబోతోందన్నమాట.
అసలు హీరోయిన్ కంటే సైడ్ హీరోయిన్ కె ఎక్కువ ఫిదా అయ్యారు గా..! ఈ కామెంట్స్ చూడండి..!
సంక్రాంతి సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. వెంకటేష్ హీరో గా నటించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. అసలు ఈ సినిమాకి వెంకటేష్ ఒక్కడే హీరో కాదు.. కథ, శ్రీకాంత్ పాత్ర, శివ బాలాజీ, శర్వానంద్ పాత్రలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే తెలుగు వారికి పండగ రోజులే. అయితే.. ప్రతిసారి సంక్రాతి పండగకి సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి.

అలా 2005 లో సంక్రాంతి కి వెంకటేష్ నటించిన “సంక్రాంతి ” సినిమా విడుదల అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా వెంకటేష్ సరసన స్నేహ నటించారు. వీరిద్దరి కాంబో కూడా అదిరిపోయింది. ముప్పలనేని శివ ఈ సినిమా కి దర్శకత్వం వహించారు. మొదటి తమ్ముడు గా నటించిన శ్రీకాంత్ కు జంట గా సంగీత నటించారు. వీరిద్దరి కాంబో లో వచ్చిన పాట కూడా అప్పట్లో దుమ్ము దులిపింది.

ఇప్పటికీ.. ఈ పాటను యు ట్యూబ్ లో వినే వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. యు ట్యూబ్ లో కామెంట్లు కూడా దుమ్ము రేపుతున్నాయి. సంగీత గారి డాన్స్ పెర్ఫార్మన్స్ కి ఫాన్స్ కామెంట్స్ తో రచ్చ లేపుతున్నారు. ఈ కింద కామెంట్స్ చూస్తే ఆ విషయం అర్ధం అవుతోంది.

ఆ వీడియో ఒక లుక్ వేసుకోండి.!
Watch Video:
“విక్రమ్” పోస్టర్ లో నందమూరి హీరోలు.. ఫాన్స్ పిచ్చి మాములుగా లేదుగా.. పోస్టర్ అదిరింది..!
నందమూరి అభిమానులకు ఎప్పటినుంచో ఓ డ్రీమ్ ఉంది. నందమూరి హీరోలంతా ఒకేసారి తెరపై కనిపిస్తే చూడాలని అనుకుంటున్నారు. అయితే.. ఇప్పటివరకు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఒక సినిమాలో నటించడం కుదరలేదు. అయితే.. ఓ ఫ్యాన్ మాత్రం “విక్రమ్” సినిమా పోస్టర్ ని సొంతం గా డిజైన్ చేసాడు. వాస్తవానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే రిలీజ్ అయింది.ఈ సినిమాలో కమల్ హసన్, విజయ్ సేతుపతి, మరియు ఫహద్ ఫాసిల్ నటిస్తున్నారు. వీరు ముగ్గురు ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేసారు.

అయితే.. ఓ నందమూరి అభిమాని ఈ పోస్టర్ ను నందమూరి హీరోలైన బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో ఎడిట్ చేసాడు. ఇది అచ్చం ఒరిజినల్ ఫోటో లాగానే ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో ఉంది
అత్తగారి దగ్గర కొత్త టెక్నిక్ లు నేర్చుకుంటున్న కాజల్ అగర్వాల్.. అదేంటంటే..?
కాజల్ అగర్వాల్ గతేడాది తన ప్రియుడు గౌతమ్ కిచ్లు ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. పెళ్లి అయిన తరువాత కూడా కాజల్ అగర్వాల్ తన సినిమా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతము కాజల్, తన భర్త తో కలిసి ముంబై లో నివసిస్తున్న సంగతి తెలిసిందే.

వ్యక్తిగతం గా కాజల్ అగర్వాల్ ఆమె అత్తగారి వద్ద నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటున్నారట. ఆమె అత్తగారు తరచూ ధ్యానం చేస్తుంటారట. రెండవ లాక్ డౌన్ సమయం లో ఆవిడ కాజల్ కు అల్లడం మరియు క్రోచింగ్ వర్క్ ను నేర్పించారట. ఈ చందమామ ప్రస్తుతం హిందీ భాషా చిత్రం ‘ఉమా’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అలాగే ‘ఘోస్టీ’ అనే తమిళ చిత్రం లో కూడా నటించబోతున్నారు. అలాగే.. రాబోయే రోజుల్లో ఆమె మరో రెండు కోలీవుడ్ సినిమాలను కూడా చేయనున్నారట. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో అక్కినేని నాగార్జున ఆక్షన్ థ్రిల్లర్ లో కూడా ఆమె నటించనున్నారని సమాచారం. ఇంకా ఈ సినిమా కి టైటిల్ అనుకోలేదు.
తన బయో పిక్ ని కన్ఫర్మ్ చేసేసిన సౌరవ్ గంగూలీ.. గంగూలీ పాత్రని ఎవరు పోషిస్తున్నారంటే..?
గత కొన్ని రోజులు గా సౌరవ్ గంగూలీ బయో పిక్ గురించి చర్చ జరుగుతోంది. అయితే.. ఈ విషయమై తాజాగా సౌరవ్ గంగూలీ స్పందించారు. మొత్తానికి, తన బయో పిక్ ను నిర్మించడానికి సౌరవ్ గంగూలీ అంగీకరించారు. భారీ బడ్జెట్ తో మాజీ కెప్టెన్ బయో పిక్ రూపొందబోతోంది. బాలీవుడ్ లో ఈ సినిమా రూపొందనుంది.

అయితే.. ఈ సినిమాలో గంగూలీ పాత్రను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పోషించే అవకాశం ఉందని సమాచారం. రెండు వందల నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. అయితే., ఈ సినిమా రూపొందించడానికి తానూ అంగీకరించానని.. కానీ డైరెక్టర్ పేరు ను ఇప్పుడే చెప్పలేనని.. ఈ సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ చెప్పడానికి మరికొన్ని రోజుల సమయం పడుతుందని దాదా పేర్కొన్నారు.
కెరియర్ లో ముందుకు వెళ్లాలంటే ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాల్సిందే. ఇవాళ ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న కొంత మంది యాక్టర్స్ కూడా ఏదో ఒక రోల్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. మరి మొదటి సినిమాలో క్రెడిట్ లేని పాత్రలో గానీ సైడ్ రోజులు కానీ కనిపించి తర్వాత మెల్లగా లీడ్ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగారు. అలా లీడ్ రోల్స్ చేసే ముందు సైడ్ రోల్స్ లో కనిపించిన కొంతమంది నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 సాయి పల్లవి
సాయి పల్లవి తమిళ్ లో జయం రవి, కంగనా రనౌత్ హీరో హీరోయిన్లుగా నటించిన ధామ్ ధూమ్ అనే సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు. అలాగే కస్తూరిమాన్ అనే సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపిస్తారు.

#2 కాజల్ అగర్వాల్
కాజల్ క్యూ హో గయా నా అనే సినిమాలో ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్ గా నటించారు.

kajal in kyun ho gaya na
#3 త్రిష
త్రిష జోడి సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్ గా నటించారు.

trisha in jodi
#4 సిద్ధార్థ్
బాయ్స్ సినిమాతో హీరోగా తన కెరీర్ మొదలు పెట్టిన సిద్ధార్థ్ అంతకుముందు మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన కన్నతిల్ ముతమిట్టల్ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాని తెలుగులో అమృత పేరుతో డబ్ చేశారు. ఇది అన్ క్రెడిటెడ్ రోల్.

siddharth in amrutha
#5 కార్తీ
తమిళ్ హీరో అయినా కూడా కార్తీకి మన తెలుగులో కూడా చాలా మంచి క్రేజ్ ఉంది. అందుకే కార్తీ నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతాయి. అయితే కార్తీ అంతకుముందు మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు. సిద్ధార్థ్ కి కుడివైపు కార్తీ ఉంటారు. సిద్ధార్థ్ కి ఎడమ వైపు ఉన్న ఆవిడ సారొస్తారా వంటి ఎన్నో పాటలతో ఎంతో పేరు తెచ్చుకున్న సింగర్ సుచిత్ర.

karthi in yuva
#6 అనసూయ
జబర్దస్త్ షో తో పాటు, ఎన్నో సినిమాల్లో కూడా నటిస్తున్న అనసూయ అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమా లో ఒక చిన్న రోల్ లో కనిపిస్తారు.

#7 నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి అంతకుముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1-నేనొక్కడినే సినిమాల్లో నటించారు. అలాగే డి ఫర్ దోపిడీ సినిమాలో కూడా నలుగురు హీరోల్లో ఒకరిగా నటించారు.

naveen polishetty in d for dopidi
#8 విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ అంతకుముందు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా సినిమాలో, అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించారు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఈషా రెబ్బ అలాగే తేజస్విని కూడా కనిపిస్తారు.

#9 రవితేజ
రవితేజ సక్సెస్ స్టోరీ గురించి మనందరికీ తెలుసు. కెరియర్ ప్రారంభంలో రవితేజ సీతారామరాజు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ లో నటించారు.

ravi teja in sitaramaraju
#10 విజయ్ సేతుపతి
మన భారతీయ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న నటుల్లో బెస్ట్ యాక్టర్స్ లో ఒకరు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి సీరియల్ లో, అలాగే షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అంతే కాకుండా నా పేరు శివ తో పాటు, ఇంకా కొన్ని సినిమాల్లో సైడ్ రోల్ లో కూడా నటించారు.

#11 శివ కార్తికేయన్
రెమో, సీమరాజా వంటి సినిమాలతో తెలుగు వారికి కూడా చేరువైన శివ కార్తికేయన్ అంతకుముందు ధనుష్ హీరోగా నటించిన త్రీ సినిమాలో ధనుష్ ఫ్రెండ్ గా నటించారు. శివ కార్తికేయన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు యాంకరింగ్ కూడా చేశారు.

#12 జె డి చక్రవర్తి
హీరోగా పరిచయం అవ్వకముందు జె.డి.చక్రవర్తి శివ సినిమాలో కనిపిస్తారు.

ఈ 15 మంది సింగర్స్ సినిమాల్లో కూడా నటించారని మీకు తెలుసా.? ఎవరు ఏ సినిమాలోనో చూడండి.!
ఒక మనిషికి ఒక విషయంలో మాత్రమే కాకుండా రెండు, మూడు విషయాల్లో ప్రావీణ్యం ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో కూడా అంతే. ఒక వ్యక్తి ఒక సినిమాని నిర్మించి, దానికి దర్శకత్వం వహించగలరు. అలాగే దర్శకత్వంతో పాటు, సంగీత దర్శకత్వం కూడా వహించగలరు. సంగీత దర్శకులు కూడా ఒక పాటని కంపోజ్ చేయగలరు, అలాగే పాడగలరు. అయితే ఇలా మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన కొంత మంది సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ లో మంచి నటులు కూడా ఉన్నారు. వారిలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
లెజెండరీ శ్రీ ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గాత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఆయన మంచి నటులు కూడా. బాలు గారు ఎన్నో సినిమాల్లో నటించారు. ప్రేమికుడు, మిధునం సినిమాల్లో ఆయన నటన మనం ఎప్పటికి మరచిపోలేము.

#2 మనో
మనో గారు కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అందులో రామ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా వచ్చిన శివం సినిమాలో రాశీ ఖన్నా తండ్రిగా నటించారు మనో గారు.

#3 ఆండ్రియా
ఆండ్రియా తెలుగులో తడాఖా తో పాటు తమిళ్ లో అయిరత్తిల్ ఒరువన్ (తెలుగులో యుగానికి ఒక్కడు), వడ చెన్నై, మాస్టర్ ఇంకా ఎన్నో సినిమాల్లో నటించారు.

#4 జీవీ ప్రకాష్ కుమార్
డార్లింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన జి.వి.ప్రకాష్ కుమార్ కూడా సంగీత దర్శకత్వం వహించడం, అలాగే ఎన్నో పాటలను పాడడంతో పాటు ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. తెలుగులో నాగ చైతన్య, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన 100% లవ్ తమిళ్ రీమేక్ అయిన 100 పర్సెంట్ కాదల్ లో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించగా, అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీకి పరిచయమైన షాలిని పాండే హీరోయిన్ గా నటించారు.

#5 తమన్
సంగీత దర్శకుడు తమన్ కూడా బాయ్స్ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు.

#6 హిమేష్ రేషమ్మియా
బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అలాగే సింగర్ హిమేష్ రేషమ్మియా కూడా హీరోగా, అలాగే ముఖ్య పాత్రల్లో కూడా నటించారు.

#7 భానుమతి
భానుమతి గారు ఎన్నో సినిమాల్లో నటించారు దర్శకత్వం వహించారు, అలాగే ఎన్నో మంచి పాటలను కూడా పాడారు. భానుమతి గారు పాడిన పాటలని ఇప్పటికీ కూడా మనం చాలా చోట్ల వింటూనే ఉంటాం.

#8 సాందీప్
నువ్వు నేను సినిమాలోని నా గుండెలో నీవుండిపోవా, అంజి సినిమాలో మానవా మానవా తో పాటు ఇంకా ఎన్నో పాటలను పాడిన సాందీప్ కూడా ప్రేమ యనమః, ఇంకోసారి తో పాటు, సందీప్ కిషన్ హీరోగా నటించిన టైగర్ సినిమాలో కూడా నటించారు.

#9 శ్రీ రామచంద్ర
ఎన్నో సినిమాల్లో పాటలు పాడి, అలాగే ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన శ్రీ రామచంద్ర కూడా హీరోగా నటించారు.

#10 రఘు కుంచే
సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన రఘు కుంచే గారు కూడా బాచీ, హోలీ, పలాస సినిమాల్లో నటించారు. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా కూడా వ్యవహరించారు.

#11. దేవిశ్రీప్రసాద్ – అత్తారింటికి దారేది (స్పెషల్ గెస్ట్)

#12. బాబా సెహెగల్ – రుద్రమదేవి

#13. నోయెల్ – ఈగ, కుమారి 21 ఎఫ్, నాన్నకు ప్రేమతో

#14. స్మిత – మల్లీశ్వరి

#15. ఘంటసాల మాస్టర్ – శ్రీ వెంకటేశ్వరా మహత్యం

ప్రభాస్ మొదటి “బాలీవుడ్” సినిమా ఏదో తెలుసా..? సాహో అనుకుంటే పొరపాటే.!
ఇండియన్ సినిమా హిస్టరీ గురించి అందులోనూ ముఖ్యంగా తెలుగు సినిమా హిస్టరీ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అని అనొచ్చు. అంతకు ముందు వరకు వేరే దేశం వాళ్ళకి ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ సినిమా మాత్రమే గుర్తొచ్చేది. కానీ బాహుబలి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

అయితే ఈ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ ఎంత పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ప్రభాస్ గురించి ఎన్నో సార్లు గొప్పగా చెప్పారు. అలాగే ఇతర భాషల సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా తమ ఫేవరేట్ హీరో ప్రభాస్ అని ఎన్నో సార్లు చెప్పారు.

బాహుబలి తర్వాత దాదాపు రెండు సంవత్సరాల విరామం తీసుకున్న ప్రభాస్ సాహో సినిమాతో మళ్లీ ప్రేక్షకుల్ని అలరించారు. సాహో సినిమా తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా రూపొందింది. హిందీ పాత్రకి కూడా ప్రభాస్ స్వయంగా తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.

అయితే కేవలం సాహో మాత్రమే కాకుండా ఇప్పుడు రాబోతున్న రాధే శ్యామ్, అలాగే అది పురుష్, ఇంకా ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా హిందీలో రూపొందుతాయి. అవన్నీ ప్యాన్ ఇండియన్ భాషల్లో రిలీజ్ అవుతాయి. అయితే మనలో చా లామంది ప్రభాస్ డైరెక్ట్ మొదటి హిందీ సినిమా సాహో అనుకుంటాం. కానీ కాదు. ప్రభాస్ అంతకుముందే మరొక హిందీ సినిమాలో నటించారు. కానీ అది అతిధి పాత్రలో.

ప్రభాస్, అజయ్ దేవగన్ హీరోగా నటించిన యాక్షన్ జాక్సన్ సినిమాలో ఒక పాటలో హీరోయిన్ సోనాక్షి సిన్హాతో కలిసి కనిపిస్తారు. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ప్రభాస్, ప్రభుదేవా దర్శకత్వంలో పౌర్ణమి సినిమాలో నటించారు. ఆ స్నేహంతోనే యాక్షన్ జాక్సన్ సినిమాలో ఒక పాటలో గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించారు ప్రభాస్. ఇదే పాటలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కూడా గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపిస్తారు. అలా ప్రభాస్ 2014 లోనే బాలీవుడ్ లో నటించారు అన్నమాట.
watch video :
సంచలన సినిమాల దర్శకులు ss . రాజమౌళి దర్శకత్వం లో వస్తున్న చిత్రం RRR ఆర్ ఆర్ ఆర్, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లు జంటగా అతి పెద్ద మల్టీ స్టారర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం. సినిమా షూటింగ్ రెండు పాటలు మినహా షూటింగ్ భాగం మొత్తం పూర్తిఅయిన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొటక్షన్ వర్క్స్ లో బిజీ గా ఉన్న టీం.

RRR teaser date
సినెమాల్నో రెండు పాటలను మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయినట్టుగా చెబుతున్నారు.ఇకపోతే ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ ల లుక్ లకి సంబదించిన టీజర్లని విడుదల చేసిన టీం. అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసాయి. సినిమా కి సంబంధించి మేకింగ్ వీడియో ఒకటి ఫాన్స్ కోసం విడుదల చేస్తునంటుగా కూడా ఇప్పటికే టీం ప్రకటించింది. అదలా ఉండగా సినిమా టీజర్ కోసం పిచ్చ పిచ్చగా వెయిట్ చేస్తున్నారు అటు ఎన్టీఆర్ ఫాన్స్ ఇటు మెగా ఫాన్స్ వెళ్లందరికోసం సినిమా టీజర్ ని ఆగష్టు 15 రోజున విడుదల చేసే అవకాలు ఉన్నాయని తెలుస్తుంది.సో ఆర్ ఆర్ ఆర్ రికార్డుల వేట పంద్రా ఆగష్టు నుంచి మొదలవుతున్నటుగా తెలుస్తుంది.
