సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత పుకార్లు సహజం. హీరో, హీరోయిన్ మీద కానీ, లేదా దర్శకుల మీద కానీ, లేదా సినిమా రంగానికి చెందిన ఎవరి మీద అయినా సరే ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకసారి పుకారు వస్తూనే ఉంటుంది. ఇంక స్టార్ హీరో హీరోయిన్ల మీద అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వారి గురించి నెలలో ఒక్కసారైనా ఏదో ఒక పుకారు వస్తుంది. ఆ సెలబ్రిటీలలో కొంత మంది మీడియా ముందుకు వచ్చి ఆ పుకార్లు అన్నీ నిజం కావు అని క్లారిఫికేషన్ ఇస్తారు.
కానీ కొంత మంది మాత్రం పుకార్లపై పెద్దగా స్పందించరు. ఇలాంటి పుకారు ఒకటి ప్రియమణి మీద వచ్చింది అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రియమణి, తరుణ్ కలిసి నవ వసంతం సినిమాలో నటించారు. ఆ సినిమా తర్వాత వారిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు. కానీ ప్రియమణి ,తరుణ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్టు, వారి రిలేషన్ షిప్ ని తరుణ్ తల్లి రోజా రమణి గారు అంగీకరించినట్టు వార్తలు వచ్చాయట.
అంతే కాకుండా తరుణ్ కి ప్రియమణి ఒక ఖరీదైన కార్ ని బహుమతిగా కూడా ఇచ్చారు అనే పుకారు వచ్చిందట. ప్రియమణి ప్రవరాఖ్యుడు సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు ఈ పుకారు గురించి తనకి కాల్ చేసి చెప్పారట. తర్వాత ప్రియమణి వెంటనే మీడియాకి క్లారిఫికేషన్ ఇచ్చారు అని, “ఇలా ఎలా రాస్తారు?” అని గట్టిగా అడిగాను అని చెప్పారు.
ఈ విషయం అంతా ప్రియమణి తన తండ్రికి చెప్పినప్పుడు, ప్రియమణి తండ్రి, ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండడమే నయం అని, ఎందుకంటే అలా సైలెంట్ గా ఉంటే ఆ పుకారుని రెండు రోజుల కంటే ఎక్కువ ఎవరు గుర్తు పెట్టుకోరు అని, అదే ఒకవేళ రియాక్ట్ అయితే ఆ పుకారు నిజం అనుకునే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారట. అప్పటి నుంచి ప్రియమణి తనపై వచ్చే పుకార్లకు స్పందించడం మానేశారట.
watch video :