లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్రసీమకి పరిచయం అయిన కాజల్ అగర్వాల్ చందమామతో అందరికి చేరువయింది. యువ హీరోలతో పాటు మెగస్టార్ చిరంజీవి సరసన కూడా నటించి పేరు తెచ్చుకుంది . తెలుగులో అత్యదిక వసూళ్లు రాబట్టిన మగధీర సినిమా కాజల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ .
బృందావనం , మిస్టర్ ఫర్పెక్ట్ , ఖైదీ , గోవిందుడు అందరి వాడేలే , బిజినెస్ మాన్ , సింగం ,సర్దార్ గబ్బర్ సింగ్ తదితర సినిమాల్లో నటించింది కాజల్ . తెలుగుతో పాటు తమిళ్ సినిమాల్లో కూడా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మరియు రేర్ ఫొటోస్.
జూన్ 19,1985 లో ముంబయ్ లో పుట్టిన కాజల్ తండ్రి వినయ్ కుమార్, ఎంటర్ ప్రెన్యూర్. తల్లి సుమన్ అగర్వాల్ . కాజల్ సినిమా కాల్షిట్లన్ని తల్లే చూస్కుంటుంది . సోలో సినిమాలో నారా రోహిత్ సరసన నటించిన నిషా అగర్వాల్ కాజల్ కి చెల్లి.
అక్క బాటలోనే ఇండస్ట్రీకి పరిచయం అయినప్పటికి కాజల్ కి వచ్చినంత పేరు నిషా అగర్వాల్ కి రాలేదు. దీంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటిన కాజల్ మాత్రం ఇంకా సినిమాలు చేసుకుంటూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
“క్యుం హో గయా నా “ అనే బాలివుడ్ చిత్రంలో చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. అందులో ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్ గా నటించింది కాజల్ . తర్వాత తెలుగులో “లక్ష్మీ కళ్యాణం “ అవకాశం రావడంతో నటించి , ఇక్కడే సెటిల్ అయిపోయింది. తెలుగుతో పాటు , తమిళంలో కూడా స్టార్ హీరోలందరి సరసన నటించింది.
తమిళ స్టార్ హీరో సూర్య సరసన నటించిన సింగం సినిమాతో బాలివుడ్ కి తిరిగి పరిచయం అయింది , ఆ సినిమా హిట్ ,అంతేకాదు బాక్సాఫీస్ హిట్ అయిన స్పెషల్ 26 లో కూడా నటించింది. కానీ తెలుగు,తమిళంలో వచ్చినంత గుర్తింపు రాకపోవడంతో మళ్లీ బాలీవుడ్ నుండి వెనుదిరిగింది.
ఇటీవల సింగపూర్ కి చెందిన మేడమ్ టుస్సాడ్ప్ మ్యూజియంలో కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మని ప్రదర్శించారు.ఇలాంటి అరుదైన అవకాశం కొద్దిమందికి మాత్రమే లభిస్తుంటుంది. అందులో కాజల్ అగర్వాల్ ఒకరు. తన దశాబ్దం కెరీర్లో ఎన్నో సక్సెస్లు, ఫెయిల్యూర్స్ చూసిన కాజల్ ఎన్నో అవార్డులని సొంతం చేసుకుంది.