అంజీర్ ఫ్రూట్ మల్బరీ ఫామిలీ కి చెందిన డ్రై ఫ్రూట్. ఈ ఫ్రూట్ వలన కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. చాలా మంది వీటిని ఇష్టం గా తింటారు. అంజీర్ ను తినడం వలన మహిళలో పిఎంఎస్ వలన వచ్చే లక్షణాలు తగ్గుముఖం పడతాయి. బాదాం పప్పులు, వాల్ నట్ లతో పాటు ఈ ఫ్రూట్స్ ను కూడా తీసుకోవడం మంచిది.
వీటిని తీసుకోవడం వలన బరువు తగ్గడానికి దోహదపడుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది. షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తమ డైట్ చార్ట్ లో చేర్చుకోవడం ఉత్తమం. గుండె ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది. కానీ చాల మంది వీటిని మామూలుగానే తినేస్తూ ఉంటారు. అలా కాకుండా.. వీటిని ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వలన మంచి ఫలితాలు ఉంటాయి.