అసలు “నోటి పూత” ఎందుకు వస్తుంది.? తగ్గించడానికి వంటింటి చిట్కాలు ఇవే.!

అసలు “నోటి పూత” ఎందుకు వస్తుంది.? తగ్గించడానికి వంటింటి చిట్కాలు ఇవే.!

by Anudeep

Ads

చాలా మందిలో నోటిపూత కనిపిస్తూనే ఉంటుంది. చెప్పుకోవడానికి ఇదేమి పెద్ద జబ్బు కాకపోయినా.. ఆహరం తినడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న గా కనిపించే నోటిపూత మనం అన్నం తినేటపుడు మాత్రం చుక్కలు చూపిస్తుంది. మీకు తరచుగా నోటిపూత వస్తోందా..? అయితే ఇది తప్పనిసరిగా కేర్ తీసుకోవాల్సిన అంశం. అసలు నోటిపూత ఎందుకు వస్తుంది..? ఇది తగ్గాలంటే మన ఇంట్లోనే సింపుల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

mouth ulcer

మీరెప్పుడైనా అధికం గా ఒత్తిడి కి గురి అయినప్పుడు, వేడి చేసినపుడు, సరైన పోషకాహారం తీసుకోనపుడు ఇలా నోటిలో అల్సర్ వస్తూ ఉంటుంది. డీహైడ్రేషన్ వలన కూడా ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చూడడానికి గుండ్రం గా ఉంటుంది. మధ్యలో తెల్లని గాయం లా కనిపిస్తుంది..దాని చుట్టూ ఎర్ర గా పూత పూసినట్లు ఉంటుంది. ఇవి వచ్చినప్పుడల్లా మనం తినడానికి నానా అవస్థలు పడుతూ ఉంటాం.

mouth ulcer

ఎందుకు వస్తుందంటే..?

#1. మనకి ఏదైనా ఆహారం పడకపోతే ఇలా నోటిలో పుండ్లు మాదిరిగా ఏర్పడే అవకాశం ఉంటుంది.
#2. అధికం గా ఒత్తిడి కి గురి అవడం వలన కూడా ఇలాంటి సమస్యలొస్తాయి.
#3. ఎక్కువ గా ఆమ్లా లక్షణాలు కలిగిన పండ్లు నారింజ, యాపిల్, నిమ్మ, స్ట్రాబెరి వంటివాటిని ఎక్కువ గా తీసుకోవడం వలన కూడా వేడి చేసి నోటిపూత వచ్చే అవకాశం ఉంటుంది.

 

#4. ఫోలిక్ ఆసిడ్, బి 12 విటమిన్, ఐరన్, జింక్, సి విటమిన్ వంటివి లోపించడం, హార్మోనుల అసమతౌల్యం వలన ఇలాంటి ఇబ్బంది తలెత్తుతుంది.
#5. మీరు తరచుగా యాంటిబయోటిక్ లు వాడినా కూడా ఇలాంటి ఇబ్బంది తలెత్తుతుంది.
#6. మీ నోటిని, దంతాలను పరిశుభ్రం గా ఉంచుకోకపోయినా కూడా మీకు పదే పదే నోటి అల్సర్ తలెత్తుతుంది.

mouth ulcer 2

ఎలాంటి చిట్కాలు పాటించాలంటే:

#1. నోటి అల్సర్ నుంచి ఉపశమనం పొందడానికి తేనే చక్కని మార్గం. నోట్లో కణజాలాలు చిట్లిపోవడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది కాబట్టి.. తేనే ను పూయడం వలన కొత్త కణజాలాలు తిరిగి ఏర్పడడానికి ఇది దోహదం చేస్తుంది. తేనెలో పసుపు కలిపి పేస్ట్ లా చేసుకుని రాసినప్పుడు కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది. కేవలం తేనెను ఇలా రాసినా కూడా మంచి ఫలితమే కనిపిస్తుంది.

#2. అలానే, కొబ్బరి నీళ్లను తరచుగా తాగడం, కొబ్బరి నూనెను పూయడం అలానే కొబ్బరిని తినడం కూడా నోటిపూతను నివారిస్తుంది. కొబ్బరి శరీరం లో వేడిని తగ్గిస్తుంది. ఫలితం గా నోటిపూత త్వరగా మానిపోతుంది.
#3. పాలపదార్ధాలైన నెయ్యి, మజ్జిగ వంటి పదార్ధాలు కూడా నోటిపూత నుంచి ఉపశమనం కల్పిస్తాయి. ఎక్కడైతే నోటిపూత గాయాలున్నాయో అక్కడ నేయి రాయడం, రోజుకు రెండుమూడుసార్లు గ్లాసు మజ్జిగ తాగితే ఎంతో ఉపశమనం గా ఉంటుంది.

#4. తులసి ఆకులు కూడా నోటిపూతకు మంచి ఔషధం. నోటిలో కొంత నీరు పోసుకుని తులసి ఆకుల్ని వేసుకుని నీటితో పాటుగా ఈ ఆకుల్ని నమలాలి. ఇలా రోజుకు నాలుగైదు సార్లు నమలడం వలన కూడా ఈ నోటిపూత తొందరగా తగ్గిపోతుంది.
#5. అలాగే చిన్న ఐస్ ముక్కతో పుండు ఉన్న చోట మర్దనా చేయడం, లవంగం నమలడం కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.


End of Article

You may also like