కన్నడ స్టార్ నటుడు పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటు కారణంగా మరణించారు. పునీత్ కి కేవలం కన్నడలో ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, ఇతర భాషల ఇండస్ట్రీలలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంది. గత శుక్రవారం ఉదయం జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడు పునీత్ ఒక్కసారిగా కింద పడిపోయారు. ఆస్పత్రికి వెళ్లే సరికి పునీత్ పరిస్థితి చాలా విషమంగా ఉంది అని డాక్టర్లు చెప్పారు.
చికిత్స అందించిన కొంతసేపటి తర్వాత పునీత్ తుది శ్వాస విడిచారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం తీరని లోటు. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ఎంతో పాపులర్ అయిన పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు. పునీత్ రాజ్ కుమార్ ఎన్నో మంచి పనులు చేశారు.

చాలా మందికి సహాయం అందించారు. చదుకోవడానికి పేదలకి అండగా నిలబడ్డారు. మందులు ఖర్చులతో పాటు మొదలైన వాటి కోసం ఆయన ఎందరికో సాయం చేశారు. నిజంగా అందరూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి అని ప్రణీత సుభాష్ చెప్పారు
https://www.instagram.com/p/CVu0r3Qv1Jt/?utm_source=ig_web_copy_link



























