ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అమృత అయ్యర్. అమృత తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించారు. అలాగే తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన బిగిల్ సినిమాలో కూడా ఒక ఒక పాత్రలో నటించారు అమృత. ఈ సినిమా తెలుగులో విజిల్ పేరుతో డబ్ అయ్యింది.

అయితే ఇవాళ విజయ్ తన 47వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు, నెటిజన్లు, ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా విజయ్ కి బర్త్ డే విషెస్ ని తెలుపుతున్నారు. అమృత అయ్యర్ కూడా అలాగే విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలోని వాతి కమింగ్ పాటకి డాన్స్ చేసి విజయ్ కి బర్త్ డే విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
https://www.instagram.com/reel/CQaejt_haY8/?utm_source=ig_web_copy_link















టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ గ్రామానికి చెందిన ముడాదాన ప్రమీల ఒక రోజు రైలులో కోచింగ్ నిమిత్తం విజయనగరం వెళుతోంది. అదే రైలులో ప్రయాణిస్తున్న కొంకి వెంకటేష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అతడిది వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడ గ్రామం. వెంకటేశ్ దిగాల్సిన స్టేషన్ రావడంతో ట్రెయిన్ దిగిపోయాడు. కానీ వెళ్తూ వెళ్తూ తన ఆర్ఆర్బీ కోచింగ్ సెంటర్‌కు సంబంధించిన ఐడీ కార్డును అక్కడే మర్చిపోయి వెళ్లిపోయాడు.
ఆ కార్డు ప్రమీల కంటపడడంతో, అతడికి అవసరమవుతుందని ఆలోచించి దానిపై ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసింది. అయితే,ఇక్కడే కథ ప్రారంభమయింది. తాను కావాలనే ఐడీ కార్డు వదిలివెళ్లానని,నిన్ను ప్రేమిస్తున్నానని ప్రమీలకి చెప్పాడు వెంకటేష్.ప్రస్తుతం నేను రాజమండ్రిలో ఉన్నందున ఐడీ కార్డు కోసం తర్వాత వస్తానని చెప్పాడు.
కొత్త కాపురం మొదలు పెట్టారు . పదిహేను రోజుల బాగానే కాపురం చేసిన వెంకటేశ్ , వాళ్లింటికి వెళ్లొస్తానని ఒకరోజు వెళ్లాడు .ఇంటి నుండి వచ్చిన నాటినుండి ప్రమీలను గర్భం తీయించేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు ప్రమీల ఒప్పుకోలేదు . దాంతో ఇంటికి రావడం మానేసి , ప్రమీలకి పూర్తిగా ముఖం చాటేశాడు.
ప్రమీల ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా కలవకపోగా , కలిసినప్పుడు తక్కువ కులం దానివంటూ దూషించడం మొదలుపెట్టాడు. చేసేదేం లేక , బాధితురాలు తన తల్లితో కలిసి టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. తొందరపడి తీసుకునే నిర్ణయాల వల్ల జీవితాలు అల్లకల్లోలం కావడం తప్ప ఫలితం ఉండదు . ఇద్దరూ చదువుకుంటున్నవాళ్లు , వీరిద్దరే తల్లిదండ్రులపై ఆధారాపడాల్సిన పరిస్థితి . ఇప్పుడు కడుపులో బిడ్డ భవిష్యత్ ఏంటి??




















